డ్రైవర్ రాముడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డ్రైవర్ రాముడు
(1979 తెలుగు సినిమా)
Driver Ramudu.jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
రచన జంధ్యాల
తారాగణం నందమూరి తారక రామారావు,
జయసుధ,
సారథి,
కైకాల సత్యనారాయణ
సంగీతం కె. చక్రవర్తి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

డ్రైవర్ రాముడు 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయసుధ, సారథి, కైకాల సత్యనారాయణ తదితరులు నటించగా కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

కథ[మార్చు]

రాము (ఎన్.టి.ఆర్.) నీతి, నిజాయితీ గల లారీ డ్రైవర్. కష్టపడి పైకి వచ్చి లారీ యజమాని ఆయ్యాడు. అతనికి మీనా అనే గుడ్డి చెల్లెలు ఉంది. ఆమె అంటే రాముకు ప్రాణం. తన తోటి లారీ డ్రైవరు వాసు తప్పు దోవలో వెళుతుంటే అతనిని సన్మార్గములో పెడతాడు. చుక్కమ్మ హోటల్ నడుపుతుంటుంది. రాము, చుక్కమ్మను రౌడీ బారినుండి కాపాడతాడు. పోలీసు ఇన్ స్పెక్టర్ రాజా మీనాని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కమల్ అనే స్మగ్లర్, అతని తండ్రి జాకాల్ దొంగ బంగారము రవాణా చేస్తుంటారు. ఒకరోజు పోలీసులకు పట్టుబడి ఆ నేరము రాము మీదకు త్రోసి జైలులో పెట్టిస్తారు. చుక్కమ్మ, లారీ క్లీనర్ నాని ల సహాయముతో రాము జైలు నుంచి తప్పించుకుని తన నిజాయితీని నిరూపించుకుని లారీ డ్రైవర్లందరికి ఆదర్శంగా నిలుస్తాడు.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాలో 6 పాటలు చిత్రీకరించారు.[1]

పాట గీతరచన గానం సంగీతం నటీనటులు
ఎందరో ముద్దు గుమ్మలు ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె. చక్రవర్తి
ఏమని వర్ణించను ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె. చక్రవర్తి ఎన్.టి.ఆర్., రోజారమణి
గుగ్గు గుగ్గు గుడిసుంది ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కె. చక్రవర్తి ఎన్.టి.ఆర్., జయమాలిని
దొంగా దొంగా దొరికాడు వేటూరి సుందరరామమూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె. చక్రవర్తి ఎన్.టి.ఆర్., జయసుధ
మావిళ్లతోపుకాడ వేటూరి సుందరరామమూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె. చక్రవర్తి ఎన్.టి.ఆర్., జయసుధ
వంగమాకు వేటూరి సుందరరామమూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె. చక్రవర్తి ఎన్.టి.ఆర్., జయసుధ

బాక్సాఫీస్[మార్చు]

ఈ సినిమాను 35 కేంద్రాలలో విడుదల చేయగా 14 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని, రెండు కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ వరకు నడిచింది.

మూలాలు[మార్చు]

  1. http://play.raaga.com/telugu/album/driver-ramudu-A0001310

బయటిలింకులు[మార్చు]