ఇద్దరు మిత్రులు (1999 సినిమా)
| ఇద్దరు మిత్రులు (1999 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
| నిర్మాణం | అడ్డాల చంటి |
| రచన | దివాకర్ బాబు |
| చిత్రానువాదం | కె. రాఘవేంద్ర రావు |
| తారాగణం | చిరంజీవి, సాక్షి శివానంద్, రమ్య కృష్ణ, సురేష్, చంద్రమోహన్ |
| సంగీతం | మణి శర్మ |
| నృత్యాలు | లారెన్స్ |
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | ఆర్.కె.ఫిల్మ్ ఆసోసియేట్స్ |
| భాష | తెలుగు |
ఇద్దరు మిత్రులు, స్నేహం అనే ఆంశం చుట్టూ అల్లబడిన కథతో 1999లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి, సాక్షి శివానంద్ ఇద్దరు మిత్రులుగా నటించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో రమ్యకృష్ణ, సురేష్ ,చంద్రమోహన్, బ్రహ్మానందం నటించారు. ఓ ప్రత్యేక పాటలో రంభ కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు.
కథ
[మార్చు]చిరంజీవి, సాక్షి శివానంద్ ఒకరినొకరు ఏడిపించుకొంటూ సరదాగా సమయం గడిపే మిత్రులు. వారికి పెళ్ళి చేయాలన్న పెద్దవారి భావాన్ని తిరస్కరించి కేవలం మిత్రులుగానే ఉన్నారు. చిరంజీవి రమ్యకృష్ణను చూచి ప్రేమలో పడతాడు. అప్పుడా అమ్మాయిని ఆకర్షించడానికి చిరంజీవికి సాక్షి శివానంద్ సలహాలు ఇస్తుంది. ఎలాగో చిరంజీవికి రమ్యకృష్ణతో పెళ్ళి జరుగుతుంది. కాని చిరు, సాక్షిల మధ్య ఉన్న చనువు పట్ల రమ్యకృష్ణ అనుమానాలు పెంచుకొంటుంది. సాక్షి శివానంద్ పట్ల ఆకర్షితుడైన సురేష్ (ఒక ఫొటోగ్రాఫర్) చిరంజీవి సహకారంతో ఆమెను పెళ్ళి చేసుకొంటాడు. కాని పెళ్ళి తరువాత కూడా సురేష్ తన గర్ల్ ఫ్రెండులతో తిరుగుతూ ఉంటాడు. సురేష్‌కు నచ్చజెప్ప బోయిన చిరంజీవి అవమానం పాలవుతాడు. సాక్షిని నిందించి సురేష్ ఇంటినుండి పంపేస్తాడు. తరువాత జరిగిన సంఘటనలు వారిపట్ల ఇతరుల అపార్ధాలను మరింత పెంచుతాయి.
ఇలా గాయపడిన మనసులు, విచ్ఛిన్నమైన సంసారాలలోని వ్యక్తుల మధ్య సాగే కథ ఇంకా క్లిష్టమౌతుంది. చివరకు కొన్ని సంఘటనలు, ప్రయత్నాలు, ఒక ప్రమాదం కారణంగా ఒక కొలికి రావడమే ఈ సినిమా కథ.
తారాగణం
[మార్చు]- చిరంజీవి_విజయ్
- రమ్యకృష్ణ_శాంతి
- సాక్షి శివానంద్_అనిత
- సురేష్_ప్రకాష్
- ఎ. వి. ఎస్_నవల సుబ్బారావు, శాంతి తండ్రి
- వై. విజయ_శాంతి తల్లి
- ప్రత్యేక నృత్యంలో రంభ , రుక్కు రుక్కు పాట
- సుధాకర్_హరిచంద్ర
- చంద్రమోహన్_రంగారావు, విజయ్ తండ్రి
- మల్లిఖార్జునరావు_విజయ్ వంటవాడు
- కన్నెగంటి బ్రహ్మానందం_టైటానిక్, శాంతి బాడీగార్డ్
- సుబ్బయ్య_శర్మ.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కె.రాఘవేంద్రరావు
- చిత్రానువాదం:కె.రాఘవేంద్రరావు
- రచన: భూపతిరాజా, దివాకర్ బాబు
- సంగీతం: మణిశర్మ
- గీత రచయితలు: చంద్రబోస్, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్య గాయకులు: కె.ఎస్.చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, మనో, హరిణి, ఉదిత్ నారాయణ్ , పార్థసారథి
- ఛాయ గ్రహణం: వి.జయరాం
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, గౌతంరాజు
- నృత్యాలు: లారెన్స్
- నిర్మాత: కె.కృష్ణమోహన్
- నిర్మాణ సంస్థ: ఆర్.కె.అసోసియేట్స్
- పంపిణీదారులు: గీతా ఆర్ట్స్
- విడుదల:30:04:1999.
విశేషాలు
[మార్చు]- సిడ్నీ షెల్డన్ వ్రాసిన టెల్ మీ యువర్ డ్రీమ్స్ నవల గురించి ఒక హాస్య సన్నివేశంలో ప్రస్తావించ బడింది.
- చిరంజీవి సాక్షి శివానంద్ మధ్య కొన్ని సన్నివేశాలు హిందీ చిత్రం కుఛ్ కుఛ్ హోతా హైలో షారుఖ్ ఖాన్ కాజోల్ మధ్య సన్నివేశాలని తలపింప జేస్తాయి
పాటలు
[మార్చు]- ఏడేడు లోకాలలో చూళ్ళేదు ఇలాంటి అమ్మాయి - బాలు, చిత్ర , రచన: చంద్రబోస్
- దేఖ్ బేబీ దేఖ్ - బాలు, చిత్ర , రచన: చంద్రబోస్
- చాంగ్ చాంగ్ చాంగ్ రే - ఉదిత్ నారాయణ్ , హరిణి, రచన:చంద్రబోస్
- మనసా వాచా మనసిస్తే - మనో, చిత్ర , రచన:చంద్రబోస్
- బంగారం తెచ్చి - పార్ధసారధి , చిత్ర, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- హే రుక్కు రుక్కు మేమ్ (చిరంజీవి, రంభలపై చిత్రీకరించినది) , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, రచన: చంద్రబోస్
- నూటొక్క జిల్లాల , మనో, చిత్ర ,రచన: చంద్రబోస్ .
మూలాలు
[మార్చు]- ఐడిల్ బ్రెయిన్.కమ్‌లో వ్యాసం
