సాక్షి శివానంద్
Jump to navigation
Jump to search
సాక్షి | |
---|---|
జననం | సాక్షి శివానంద్ 1977 ఏప్రిల్ 15 |
ఇతర పేర్లు | సాక్షి |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1995–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సాగర్ |
సాక్షి శివానంద్ ప్రముఖ నటీమణి. ఈమె పలు హిందీ, తమిళ, మలయాళ సినిమాలలో నటించింది.
కెరీర్
[మార్చు]1996లో ఆమె బాలీవుడ్ లోకి మొట్టమొదటి సారిగా అడుగు పెట్టింది. తరువాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్. అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు తెలుగులో ప్రముఖ కథానాయకుల సరసన నటించేందుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో కథానాయికగా నటించింది.
నటించిన తెలుగు చిత్రాలు
[మార్చు]- యమజాతకుడు
- కలెక్టర్ గారు
- మాస్టర్
- సీతారామరాజు
- రాజహంస
- సముద్రం
- వంశోద్ధారకుడు
- టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ (2001)
- హోమం (2008)