వంశోద్ధారకుడు (2000 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంశోద్ధారకుడు
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
నిర్మాణం ఎమ్.ఎస్.రెడ్డి
తారాగణం నందమూరి బాలకృష్ణ
రమ్యకృష్ణ
సాక్షి శివానంద్
సంగీతం కోటి
సంభాషణలు పరుచూరి సోదరులు
నిర్మాణ సంస్థ గాయత్రి ఫిలింస్
భాష తెలుగు

వంశోద్ధారకుడు 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. గాయత్రి ఫిల్మ్స్ పతాకంపై, శరత్ దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మించాడు. నందమూరి బాలకృష్ణ, రమ్య కృష్ణ, సాక్షి శివానంద్, కృష్ణంరాజు ప్రధాన పాత్రలు పోషించారు. కోటి సంగీతం కూర్చాడు .[1][2]

కథ[మార్చు]

సూర్యం ( నందమూరి బాలకృష్ణ ) స్థానిక కళాశాలలో డ్రిల్లు మాస్టరు. తల్లి వరలక్ష్మి ( రాధిక ) తో నివసిస్తున్నాడు. సూర్యం పనిచేసే కళాశాల సుదర్శన రావు ( చరణ్ రాజ్ ) అనే పారిశ్రామికవేత్తకు చెందినది. సుదర్శన్ రావు పెద్ద వ్యాపారవేత్త అయిన రాజాగారికి (కృష్ణంరాజు ) బావమరిది. రాజాగారికి ఇద్దరు కుమారులు, ఆనంద్ (బ్రహ్మాజీ ), అశోక్ (రవి బాబు). సుదర్శనరావుకు కుమారుడూ శ్రీకాంత్ ( శ్రీహరి ), కుమార్తె సురేఖ ( సాక్షి శివానంద్ ) ఉన్నారు. సురేఖ తమ కాలేజీలోనే చదువుకుంటోంది. సత్య ( రమ్య కృష్ణ ) అదే కళాశాలలో జూనియర్ పిడి (ఫిజికల్ డైరెక్టర్) గా పనిచేస్తోంది. సూర్యం, సురేఖలు తరచూ గొడవలు పడుతూంటారు. కొన్నాళ్ళకు, వాళ్ళు ప్రేమలో పడతారు. సత్య కూడా సూర్యాన్ని ప్రేమిస్తుంది.

వారు కళాశాల తరపున పర్యటనలో 'ఖాజురాహో'ను సందర్శించినప్పుడు, సూర్యం తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని సత్య చెబుతుంది. కొన్ని సన్నివేశాల తరువాత, సుదర్శనరావు సూర్యాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి సత్యను తన కళాశాలలో చేర్చుకున్నాడని, తద్వారా అతని కుమార్తె సురేఖ సూర్యాన్ని ద్వేషించేలా చెయ్యాలనీ తెలుస్తుంది. సత్య ఒక కుట్రదారు ( గిరి బాబు ) కుమార్తె అని కూడా తరువాత తెలుసుస్తుంది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని కాపాడుకోటానికి ఆమె సూర్యంపై కుట్ర చెయ్యాల్సి వస్తుంది. సూర్యం, సురేఖల వివాహం కోసం సుదర్శనరావు అంగీకరిస్తాడు. కానీ భర్త సజీవంగా ఉన్నప్పటికీ సూర్యం తల్లి వితంతువుగా ఎందుకు జీవిస్తోందో తెలుసుకోవా లనుకుంటాడు. తన తండ్రి బతికే ఉన్నాడని అప్పటివరకూ తెలియకపోవడంతో ఈ ప్రశ్నతో అతడు నిర్ఘాంతపోతాడు.

తరువాత, రాజాగారే తన తండ్రి అని సూర్యం తెలుసుకుంటాడు. సూర్యం తల్లి రాజాగారి ఇంట్లో పనిమనిషిగా పనిచేసేది. రాజాగారు ఒక దొంగను హత్య చేసినప్పుడు, ఆమె ఆ నేరాన్ని తనపై వేసుకుని జైలుకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. తన పనిమనిషి చేసిన త్యాగానికి చలించిన రాజాగారు ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. రాజాగారి బావమరిది సుదర్శన రావు కుతంత్రాలు పన్ని ఆమెను ఇంటి నుండి బయటకు నెట్టేలా చేస్తాడు. ఆమె ఇంటినుండి బయటకు వెళ్ళి తన బిడ్డ సూర్యాన్ని పెంచుతుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకున్న తరువాత సూర్యం, తన తండ్రి వద్దకు వెళ్లి తన గౌరవాన్ని పొందాలని తద్వారా ఇంటిని సరిచేయాలనీ నిర్ణయించుకుంటాడు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

కోటి సంగీతం సమకూర్చిన పాటలను సుప్రీం మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది.

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."కొండపల్లి బొమ్మా"ఘంటాడి కృష్ణఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:09
2."అందాల ప్రాయం"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:21
3."గుడి గంటలు"మల్లెమాలఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:22
4."నుడి నుడి చినుకుల"భువనచంద్రరాముఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర3:50
5."డోలే డోలే"భువనచంద్రఉదిత్ నారాయణ్, సుజాత3:47
6."నీ చూపు భలే"సుద్దాల అశోక్ తేజఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:23
Total length:26:51

మూలాలు[మార్చు]

  1. "vamsoddarakudu". bharatmovies.com /. Archived from the original on 9 ఏప్రిల్ 2013. Retrieved 25 November 2012.
  2. "Vamsoddarakudu Movie Cast & Crew". rangu.com /. Archived from the original on 29 మార్చి 2013. Retrieved 25 November 2012.