హరిహరన్
హరిహరన్ | |
---|---|
జననం | హరిహరన్ అనంత సుబ్రమణి 1955 ఏప్రిల్ 3 బాంబే, మహారాష్ట్ర[1] |
వృత్తి | నేపథ్య గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1977–ప్రస్తుతం |
సన్మానాలు | పద్మశ్రీ (2004) కళైమామణి (2005) |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి |
|
వాయిద్యాలు | గాత్రం, హార్మోనియం |
హరిహరన్ (తమిళం: ஹரிஹரன் హిందీ: हरिहरन) (జననం:1955 ఏప్రిల్ 3) ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. ఈయన మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ, భోజ్‌పురి, తెలుగు సినిమాలలో పాటలు పాడాడు. ఈయన గజల్ గాయకుడు కూడా. 2004 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 500కు పైగా తమిళ సినీ పాటలు, దాదాపు 1000 హిందీ పాటలు పాడాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]హరిహరన్ కేరళ లోని తిరువనంతపురంలో 1955 ఏప్రిల్ 3న ఓ తమిళ అయ్యర్ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అలమేలు, హెచ్.ఎ.ఎస్.మణి ప్రముఖ కర్ణాటక శాస్ర్తీయ సంగీతకారులు. ముంబయిలో పెరిగాడు. ముంబయిలోని ఐ.ఐ.ఇ.ఎస్ కళాశాలలో సైన్స్, న్యాయశాస్త్రంలో డిగ్రీలను పూర్తిచేశాడు. ఆయన తల్లిదండ్రులు శ్రీమతి అలమేలు, అనంత సుబ్రహ్మణ్య అయ్యర్లు. ఆయనకు వారసత్వంగా సంగీత విద్య అబ్బింది. హరిహరిన్ తల్లి అలమేలు ఆయనకు తొలి గురువు. చిన్నతనంలోనే కర్నాటక సంగీతాన్ని నేర్చుకున్న ఆయన హిందూస్తానీ సంగీతంలో కూడా శిక్షణపొందాడు. ఆయన హిందూస్థానీ సంగీతం కూడా బాల్యంలో నేర్చుకుననరు. కౌమరదశలో ఆయన "మెహ్దీ హసన్", "జగ్జీత్ సింగ్" వంటి గాయకుల ప్రభావానికి లోనయి గజల్ సంగీతాన్ని అభివృద్ధి పరచుకున్నాడు. ఆయన "ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్" వద్ద హిందూస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆయన ప్రతిరోజూ 13 గంటలకు పైగా సంగీత సాధన చేస్తుంటారు.
కెరీర్
[మార్చు]ఫిలిం కెరీర్
[మార్చు]తన కెరీర్ ప్రారంభంలో హరిహరన్ టెలివిజన్లో ప్రదర్శనలిచ్చేవాడు. అనేక టెలివిజన్ సీరియళ్ళకు పాటలు పాడాడు. 1977 లో ఆయనకు "ఆల్ ఇండియా సర్ సింగర్ కాంఫిటీషన్"లో ఉన్నత బహుమతి వచ్చిన తరువాత ఆయన 1978 లో "జైదేవ్" దర్శకత్వంలో విడుదలైన హిందీ చిత్రం "గమన్"లో పాడుటకు ఒప్పందం చేసుకున్నాడు. ఆయన పాడిన "అజీబ్ సా నహ ముఝ్ పార్ గుజర్ గయ యారో" పాటకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఫిల్మ్ అవార్డు లభించింది. అదే విధంగా జాతీయ అవార్డుకు నామినేట్ చేయబడింది.[2]
సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ ఆయన్ను 1992 లో తమిళ చిత్రసీమకి పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలోని రోజా సినిమాలో "తమిఝ తమిఝ" అనే దేశభక్తి గీతం పాడారు.[3]. తరువాత మణిరత్నం దర్శకత్వంలో నిర్మింపబడ్డ బొంబాయి సినిమాలో "ఉరియే ఉరియే" పాటకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నేపథ్యగాయకునిగా ఎంపికయ్యాడు. ఈ పాటను హరిహరన్ కె.ఎస్.చిత్రతో కలసి పాడాడు. రహ్మాన్ తో చేసిన గాయకులలో ముఖ్యమైనవాడు హరిహరన్. ముత్తు, మిన్సార కనవు, జీన్స్, ఇండియన్, ముదల్వాన్, తాల్, రంగీలా, ఇందిర, ఇరువర్, అంబే ఆరుయిరే, కంగలాల్ కైతు సె, శివాజి, అలైపయుతే" , కన్నతిల్ ముతమిట్టల్ , గురు , మొదలైన అనేక సినిమాలలో పాటలు పాడాడు. 1998 లో హిందీ సినిమా "బోర్డర్" లో "అను మల్లిక్" కూర్చిన "మేరే దుష్మన్ మేరే భాయీ" పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ నేపధ్య గాయకునిగా అవార్డు అందుకున్నాడు. ఆయన 2009 లో "అజయ్ అతుల్" ట్యూన్ చేసిన "జోగ్వా" సినిమాలోని "జీవ్ రంగ్లా" పాటను మరాఠీ భాషలో పాడి జాతీయ బహుమతిని గెలుచుకున్నారు.[4]
ఆయన 500 కి పైగా తమిళ పాటలను, 200 కి పైగా హిందీ పాటలను పాడారు. అనేక వందల మలయాళ, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషలలో పాటలను ఆలపించారు.
ప్రధాన అవార్డులు
[మార్చు]- పౌర పురస్కారాలు
- 1998 – National Film Award for Best Male Playback Singer: "Mere Dushman", Border
- 2009 – National Film Award for Best Male Playback Singer: "Jeev Dangla Gungla Rangla", Jogva[4]
- కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డులు
- 2011 – Kerala State Film Award for Best Singer – for the song "Pattu Paaduvaan" in the film "Pattinte Palazhi" music by Dr. Suresh Manimala
- స్వరలయ-యేసుదాస్ అవార్డు
- 2004 – For his outstanding contribution to Indian film music[6]
- తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్ అవార్డులు
- 2004 – Best Male Playback Singer – for various films
- 1995 – Best Male Playback Singer – for the song "Koncha Naal" in the film Aasai
- నంది అవార్డులు
- 1999 – Best Male Playback Singer – for the song "Hima Semalloyallo" in the film Annayya
- ఆసియా నెట్ ఫిల్మ్ అవార్డులు
- 2011 – Best Male Playback Singer – for "Aaro Padunnu" from Katha Thudarunnu[7]
- ఫిల్మ్ ఫేర్ అవార్డులు (దక్షిణాది)
- 2011 – Best Male Playback Singer – for "Aaro Padunnu" from Katha Thudarunnu
మూలాలు
[మార్చు]- ↑ "Hariharan Interview: मैं सौ फीसदी बंबइया हूं! लेकिन विकिपीडिया वाले हैं कि मेरी बात सुनते ही नहीं".
- ↑ Although he made his debut a long time ago,Hariharan was first noticed in a duet with Kavita Krishnamurthy in Hai Mubarak Aaj ka Din from Boxer (1984), which was composed by R D Burman.Hariharan. Hummaa.com. Retrieved on 2012-01-01.
- ↑ "Life at 50". The Hindu. Archived from the original on 4 February 2008. Retrieved 11 April 2005.
- ↑ 4.0 4.1 "56th National Film Awards, 2008" (PDF).
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Padma
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Swaralaya
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Mammootty, Mohanlal bag Asianet film awards yet again". Indo-Asian News Service. NDTV. 1 January 2011. Archived from the original on 14 జూలై 2011. Retrieved 3 April 2014.
ఇతర లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Hariharan పేజీ
- మూలాల లోపాలున్న పేజీలు
- Pages using embedded infobox templates with the title parameter
- Articles containing Tamil-language text
- Articles containing Hindi-language text
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- గాయకులు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- 1955 జననాలు
- కేరళ వ్యక్తులు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు సినిమా నేపథ్యగాయకులు
- మలయాళ సినిమా నేపథ్యగాయకులు
- తమిళ సినిమా నేపథ్యగాయకులు
- కన్నడ సినిమా నేపథ్యగాయకులు
- హిందీ సినిమా నేపథ్యగాయకులు
- మరాఠీ సినిమా నేపథ్యగాయకులు
- భారతీయ గజల్ గాయకులు
- హిందీ భాషా పాఠాన్ని కలిగి ఉన్న వ్యాసాలు
- కళైమామణి పురస్కార గ్రహీతలు