రవిబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవిబాబు
జననం
రవిబాబు
వృత్తిదర్శకుడు, నటుడు, రచయిత
తల్లిదండ్రులు

రవిబాబు ఒక తెలుగు సినీ నటుడు, పేరొందిన దర్శకుడు. ఇతను తెలుగు నటుడు చలపతిరావు కుమారుడు.

సినీ ప్రస్థానం

[మార్చు]

సినిమాలలో ప్రతినాయకుడిగా నటప్రస్థానం ప్రారంభించాడు. తర్వాత అమెరికా వెళ్ళి దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అల్లరి నరేశ్ ను పరిచయం చేస్తూ అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం అల్లరి మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తర్వాత నరేష్ పేరు అల్లరి నరేష్ గా స్థిరపడింది. తర్వాత అదే చిత్ర కోవలో తీసిన అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ చిత్రాలు కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించాయి.

పార్టీ చిత్రం తర్వాత తన పంధా మార్చి సస్పెన్స్, హారర్ చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ పరంపరలో తీసిన అనసూయ సంచలన విజయాన్ని సాధించింది. తర్వాత ప్రేమ కథాచిత్రమైన నచ్చావులే చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. తర్వాత వశీకరణ ప్రక్రియ ముఖ్యాంశంగా తీసిన అమరావతి చిత్రం పరాజయం పాలైంది. తర్వాత తీసిన ప్రేమకథ చిత్రం మనసారా కూడా విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఈ చిత్ర ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండటం వలన ఇది రవిబాబు చిత్రాల జాబితాలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. తర్వాత దర్శకత్వం వహించిఒన చిత్రం నువ్విలా ద్వారా రవి ఆరు మంది నూతన నటీ నటులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయడం జరిగింది. ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. తర్వాత హారర్ సబ్జెక్ట్ ప్రధానాంశంగా తీసిన అవును చిత్రం ఇతని దర్శకత్వ చరిత్రలో పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన చిత్రాల ద్వారా రవిబాబు తాను ప్రేమకథ, హారర్ సబ్జెక్టులను బాగా తీయగలనని చెప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు.

నటుడు

[మార్చు]

దర్శకుడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 అక్టోబరు 2016. Retrieved 28 జూలై 2019.
  2. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'ఆవిరి' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రవిబాబు&oldid=4323024" నుండి వెలికితీశారు