కృష్ణంరాజు (నటుడు)
కృష్ణంరాజు | |
---|---|
![]() కృష్ణంరాజు | |
జననం | ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1940 జనవరి 20 మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా |
మరణం | 2022 సెప్టెంబరు 11 హైదరాబాదు |
ఇతర పేర్లు | రెబెల్ స్టార్ |
వృత్తి | జర్నలిస్టు, నటుడు, రాజకీయ నాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1970 – 2022 |
ఎత్తు | 6'2" |
భాగస్వామి | శ్యామలాదేవి |
పిల్లలు | ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి |
ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు (1940 జనవరి 20 - 2022 సెప్టెంబరు 11) తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. ఇతడు జనవరి 20, 1940న జన్మించాడు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాడు. కృష్ణంరాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో 1966 లో తన మొట్టమొదటి సినిమా చిలక గోరింక సినిమాలో నటించారు ఈ సినిమా పెద్ద హిట్ అయింది కృష్ణంరాజుకు నంది అవార్డు కూడా లభించింది 1967లో ఎన్టి రామారావు తో కలిసి శ్రీకృష్ణ అవతారం సినిమాలో నటించారు 1968 వ సంవత్సరంలో కృష్ణంరాజు నటించిన నేనంటే నేను సినిమాలో విలన్ గా నటించారు ఇలా 183 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు కృష్ణంరాజు మొదట సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు సీతాదేవి చనిపోయిన తరువాత 1996లో శ్యామల దేవిని పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు టాలీవుడ్ హీరో ప్రభాస్ కి కృష్ణంరాజు పెదనాన్న అవుతాడు అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు 11 సెప్టెంబర్ 2022వ సంవత్సరంలో 82 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచాడు
కుటుంబం[మార్చు]
ప్రముఖ నటుడు ప్రభాస్ కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు. కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తెలుగునాట క్షత్రియ రాజుల వంశస్థులు విజయనగర సామ్రాజ్యం వారసులు కృష్ణంరాజు. కృష్ణంరాజుకు జీవితభాగస్వామి శ్యామలాదేవి. 1996లో వీరి వివాహం జరిగింది.[1][2] వీరికి ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు.[3][4]
నటించిన చిత్రాలు[మార్చు]
క్రమ సంఖ్య |
సంవత్సరం | చిత్రం పేరు | కథానాయిక (లు) | దర్శకుడు |
---|---|---|---|---|
1 | 1966 | చిలకా గోరింక | కృష్ణకుమారి | కె. ప్రత్యగాత్మ |
2 | 1967 | శ్రీకృష్ణావతారం | - | కె. కామేశ్వరరావు |
3 | 1968 | నేనంటే నేనే | - | వి. రామచంద్రరావు |
4 | 1969 | భలే అబ్బాయిలు | షీలా | పేకేటి శివరాం |
5 | 1969 | భలే మాష్టారు | కె.ఆర్.విజయ | యస్.డి. లాల్ |
6 | 1969 | బుద్ధిమంతుడు | సంధ్యారాణి | బాపు |
7 | 1969 | మనుష్యులు మారాలి | - | వి.మధుసూధనరావు |
8 | 1970 | మళ్ళీ పెళ్ళి | విజయనిర్మల | చిత్తజల్లు శ్రీనివాసరావు |
9 | 1970 | జై జవాన్ | చంద్రకళ | డి. యోగానంద్ |
10 | 1970 | అమ్మకోసం | రేఖ (హింది నటి) | బి.వి. ప్రసాద్ |
11 | 1970 | తాళిబొట్టు | విజయనిర్మల | టి. మాధవరావు |
12 | 1970 | పెళ్ళి సంబంధం | - | కె. వరప్రసాద్ |
13 | 1970 | పెళ్ళి కూతురు | - | వి. రామచంద్రరావు |
14 | 1970 | అల్లుడే మేనల్లుడు | - | పి. పుల్లయ్య |
15 | 1970 | ద్రోహి | - | కె. బాపయ్య |
16 | 1971 | పవిత్రబంధం | - | వి.మధుసూధనరావు |
17 | 1971 | అనురాధ | - | పి. చంద్రశేఖర రెడ్డి |
18 | 1971 | భాగ్యవంతుడు | - | చిత్తజల్లు శ్రీనివాసరావు |
19 | 1971 | బంగారుతల్లి | జమున, రమాప్రభ | తాపి చాణక్య |
20 | 1972 | శభాష్ వదిన | - | ఎం. మల్లికుమార్ |
21 | 1972 | మొహమ్మద్ బిన్ తుగ్లక్ | - | బి.వి. ప్రసాద్ |
22 | 1972 | రైతు కుటుంబం | - | వి. మధుసూధనరావు |
23 | 1972 | రాజమహల్ | - | బి. హరినారాయణ |
24 | 1972 | అంతా మన మంచికే | వెన్నిరెడ్డి నిర్మల | భానుమతి రామకృష్ణ |
25 | 1972 | మంచిరోజులు వచ్చాయి | - | వి.మధుసూధనరావు |
26 | 1972 | హంతకులు దేవాంతకులు | రాజసులోచన | కె.ఎస్.ఆర్.దాస్ |
27 | 1972 | మానవుడు - దానవుడు | - | పి. చంద్రశేఖర రెడ్డి |
28 | 1972 | భలే మోసగాడు | లీలారాణి | పి. సాంబశివ రావు |
29 | 1972 | నీతి నియమాలు | కాంచన | యస్. శ్రీనివాసరావు |
30 | 1972 | ఇన్‌స్పెక్టర్ భార్య | - | పి.వి. సత్యనారాయణ |
31 | 1972 | శభాష్ బేబి | - | - |
32 | 1972 | వింత దంపతులు | జమున | కె.హేమాంబరధరరావు |
33 | 1972 | మాతృమూర్తి | - | మానాపురం అప్పారావు |
34 | 1972 | బడిపంతులు | విజయలలిత | పి. చంద్రశేఖర రెడ్డి |
35 | 1972 | ఇల్లు ఇల్లాలు | లీలారాణి | పి. చంద్రశేఖర రెడ్డి |
36 | 1972 | ఊరికి ఉపకారి | - | కె.ఎస్.ఆర్. దాస్, పి. సుందరం |
37 | 1973 | బాలమిత్రుల కథ | - | కె. వరప్రసాద రావు |
38 | 1973 | స్త్రీ | చంద్రకళ | కోటయ్య ప్రత్యగాత్మ |
39 | 1973 | జీవన తరంగాలు | - | తాతినేని రామారావు |
40 | 1973 | జీవితం | శారద | కె.యస్. ప్రకాశ రావు |
41 | 1973 | వాడే వీడు | లీలారాణి | డి. యోగానంద్ |
42 | 1973 | తల్లీకొడుకులు | లీలారాణి | పి. చంద్రశేఖర రెడ్డి |
43 | 1973 | శ్రీవారు మావారు | గీతాంజలి | బి.యస్. నారాయణ |
44 | 1973 | స్నేహబంధం | లీలారాణి | పి. చంద్రశేఖర్ |
45 | 1973 | గాంధీ పుట్టిన దేశం | ప్రమీల, లత | పి. లక్ష్మీదీపక్ |
46 | 1973 | మమత | - | పి. చంద్రశేఖర రెడ్డి |
47 | 1973 | మాయదారి మల్లిగాడు | - | ఆదుర్తి సుబ్బారావు |
48 | 1973 | వైశాలి | శారద | ఎ. సంజీవి |
49 | 1973 | ఇంటి దొంగలు | జమున | కె. హేమాంబరధరరావు |
50 | 1973 | మేమూ మనుషులమే | జమున | కె. బాపయ్య |
51 | 1973 | మేఘమాల | జమున | వసంత రెడ్డి |
52 | 1973 | అభిమానవంతులు | శారద | కె.యస్. రామిరెడ్డి |
53 | 1974 | పల్లెటూరి చిన్నోడు | విజయలలిత | బి.విఠలాచార్య |
54 | 1974 | జీవితరంగం | - | పి.డి. ప్రసాద్ |
55 | 1974 | గుండెలు తీసిన మొనగాడు | - | చక్రవర్తి |
56 | 1974 | మనుష్యులలో దేవుడు | - | బి.వి. ప్రసాద్ |
57 | 1974 | చందన | జయంతి | గిరిబాబు |
58 | 1974 | స్త్రీ గౌరవం | దేవిక, వెన్నెరాడై నిర్మల | యస్.యస్. దేవదాస్ |
59 | 1974 | తులసి | భారతి | బాబూరావు |
60 | 1974 | అనగనగా ఓ తండ్రి | భారతి | సి.యస్. రావు |
61 | 1974 | బంట్రోతు భార్య | శ్రీవిద్య | దాసరి నారాయణరావు |
62 | 1974 | కృష్ణవేణి | వాణిశ్రీ | వి.మధుసూధనరావు |
63 | 1974 | నిత్య సుమంగళి | జయంతి | ఆర్య |
64 | 1974 | ఆడపిల్లల తండ్రి | భారతి | కె. వాసు |
65 | 1974 | ఇంటి కోడలు | - | - |
66 | 1974 | హారతి | శారద, భారతి | పి. లక్ష్మీదీపక్ |
67 | 1974 | పల్లెపడుచు | శారద | కె.సత్యం |
68 | 1974 | జీవితాశయం | విజయ నిర్మల | కె.కామేశ్వరరావు |
69 | 1975 | చిన్ననాటి కలలు | ప్రమీల | టి.లెనిన్ బాబు |
70 | 1975 | పరివర్తన | లక్ష్మీ | కె.హేమాంబరధరరావు |
71 | 1975 | మొగుడా పెళ్ళామా | జమున | బి.ఎ.సుబ్బారావు |
72 | 1975 | పుట్టింటి గౌరవం | భారతి | పి.చంద్రశేఖరరెడ్డి |
73 | 1975 | భారతి | జమున | వేటూరి |
74 | 1975 | నాకూ స్వతంత్రం వచ్చింది | జయప్రద | బి.నర్సింగరావు, పి.లక్ష్మీదీపక్ |
75 | 1976 | ఇద్దరూ ఇద్దరే | చంద్రకళ | వి.మదుసూదనరావు |
76 | 1976 | యవ్వనం కాటేసింది | జయచిత్ర | దాసరి నారాయణరావు |
77 | 1976 | భక్తకన్నప్ప | వాణిశ్రీ | బాపు |
78 | 1976 | ఆడవాళ్లు అపనిందలు | సుభ | బి.యస్.నారాయణ |
79 | 1976 | అమ్మనాన్న | ప్రభ | టి.లెనిన్ బాబు |
80 | 1976 | సుప్రభాతం | వాణిశ్రీ | కె.ప్రకాశరావు |
81 | 1976 | మంచికి మారుపేరు | - | సి.యస్.రావు |
82 | 1977 | కురుక్షేత్రం | - | కె. కామేశ్వరరావు |
83 | 1977 | ఒకేరక్తం | జయప్రద | పి. చంద్రశేఖరరెడ్డి |
84 | 1977 | గీత సంగీత | ప్రభ | ఎమ్.యస్.కోటారెడ్డి |
85 | 1977 | మహానుభావుడు | జయసుధ | కె.హేమాంబరధరరావు |
86 | 1977 | భలే అల్లుడు | శారద, పద్మప్రియ | పి.చంద్రశేఖరరెడ్డి |
87 | 1977 | అమరదీపం | జయసుధ | కె. రాఘవేంద్రరావు |
88 | 1977 | జీవనతీరాలు | జయసుధ | జి. సి. శేఖర్ |
89 | 1977 | మనుషులు చేసిన దొంగలు | సంగీత | ఎం.మల్లిఖార్జునరావు |
90 | 1978 | సతీ సావిత్రి | వాణిశ్రీ | బి.ఎ.సుబ్బారావు |
91 | 1978 | మంచి మనసు | భవాని | కోటయ్య ప్రత్యగాత్మ |
92 | 1978 | కటకటాల రుద్రయ్య | జయసుధ, జయచిత్ర | దాసరి నారాయణరావు |
93 | 1978 | మన ఊరి పాండవులు | - | బాపు |
94 | 1978 | రాముడు రంగడు | ప్రభ | పి. చంద్రశేఖర రెడ్డి |
95 | 1979 | రామబాణం | లత | వై. ఈశ్వర్ రెడ్డి |
96 | 1979 | కమలమ్మ కమతం | పల్లవి | కోటయ్య ప్రత్యగాత్మ |
97 | 1979 | చెయ్యెత్తి జైకొట్టు | గీత | కొమ్మినేని |
98 | 1979 | అందడు ఆగడు | లత | యస్.డి. లాల్ |
99 | 1979 | రంగూన్ రౌడి | జయప్రద | దాసరి నారాయణరావు |
100 | 1979 | వినాయక విజయం | వాణిశ్రీ | కె. కామేశ్వరరావు |
101 | 1980 | శివమెత్తిన సత్యం | శారద, జయసుధ | వి.మధుసూదనరావు |
102 | 1980 | కళ్యాణచక్రవర్తి | జయసుధ | యమ్.యస్. రెడ్డి |
103 | 1980 | అల్లుడు పట్టిన భరతం | జయప్రద | కె.విశ్వనాధ్ |
104 | 1980 | సీతారాముడు | జయప్రద | దాసరి నారాయణరావు |
105 | 1980 | బెబ్బులి | సుజాత | వి.మధుసూధనరావు |
106 | 1980 | ప్రేమతరంగాలు | సుజాత, జయసుధ | యస్.పి. చిట్టిబాబు |
107 | 1981 | ఆడవాళ్ళూ మీకు జోహార్లు | జయసుధ, వై. విజయ | కె. బాలచందర్ |
108 | 1981 | అగ్నిపూలు | జయప్రద | కె. బాపయ్య |
109 | 1981 | పులిబిడ్డ | శ్రీదేవి | వి.మధుసూదనరావు |
110 | 1981 | టాక్సీ డ్రైవర్ | జయప్రద | యస్.పి. చిట్టిబాబు |
111 | 1981 | రగిలే జ్వాల | సుజాత, జయప్రద | కె. రాఘవేంద్రరావు |
112 | 1981 | గువ్వల జంట | జయసుధ | కె. వాసు |
113 | 1981 | రామలక్ష్మణులు | జయసుధ | ఆర్. త్యాగరాజ్ |
114 | 1982 | మధుర స్వప్నం | జయసుధ, జయప్రద | కె. రాఘవేంద్రరావు |
115 | 1982 | తల్లీ కొడుకుల అనుబందం | జయప్రద | కె.యస్.ఆర్. దాస్ |
116 | 1982 | నిప్పుతో చలగాటం | శారద, జయసుధ | కొమ్మినేని |
117 | 1982 | గొల్కొండ అబ్బులు | జయప్రద | దాసరి నారాయణరావు |
118 | 1982 | జగ్గు | జయసుధ | పి. చంద్రశేఖర రెడ్డి |
119 | 1982 | ప్రళయ రుద్రుడు | జయప్రద | ఎ. కోదండరామిరెడ్డి |
120 | 1982 | త్రిశూలం | శ్రీదేవి, రాధిక, జయసుధ | కె. రాఘవేంద్ర రావు |
121 | 1983 | నిజం చెబితె నేరము | జయప్రద | యమ్. బాలయ్య |
122 | 1983 | అడవి సింహాలు | జయప్రద | కె. రాఘవేంద్ర రావు |
123 | 1983 | పులిబెబ్బులి | జయప్రద | కె.యస్.ఆర్. దాస్ |
124 | 1983 | కోటికొక్కడు | జయసుధ | బి. భాస్కర రావు |
125 | 1983 | ధర్మాత్ముడు | జయసుధ | బి. భాస్కర రావు |
126 | 1984 | యుద్దం[5] | రాధిక, జయసుధ | దాసరి నారాయణరావు |
127 | 1984 | సర్దార్ | శారద, జయప్రద | నందం హరిశ్ఛంద్ర రావు |
128 | 1984 | బాబులుగాడి దెబ్బ | శ్రీదేవి, రాధిక | కె. వాసు |
129 | 1984 | కొండవీటి నాగులు | రాధిక | రాజశేఖరన్ |
130 | 1984 | యస్. పి. భయంకర్ | విజయశాంతి | వి.బి. రాజేంద్ర ప్రసాద్ |
131 | 1984 | బొబ్బిలి బ్రహ్మన్న | శారద, జయసుధ | కె. రాఘవేంద్ర రావు |
132 | 1984 | రారాజు | విజయశాంతి | జి. రామ్మోహన రావు |
133 | 1984 | భారతంలో శంఖారావం | జయసుధ | బి. భాస్కరరావు |
134 | 1984 | రౌడి | రాధ, భానుప్రియ | ఎ. మోహనగాంధి |
135 | 1985 | బందీ | రాధ | కోడి రామకృష్ణ |
136 | 1985 | తిరుగుబాటు | జయసుధ | దాసరి నారాయణరావు |
137 | 1985 | అగ్గిరాజు | జయసుధ | బి. భాస్కరరావు |
138 | 1985 | బుల్లెట్ | సుహాసిని | బాపు |
139 | 1986 | ఉక్కుమనిషి | కె.ఆర్.విజయ, రాధిక | రాజ్ భరత్ |
140 | 1986 | రావణబ్రహ్మ | లక్ష్మీ, రాధ | కె. రాఘవేంద్రరావు |
141 | 1986 | నేటి యుగధర్మం | జయసుధ | జి. రామ్మోహన రావు |
142 | 1986 | ఉగ్ర నరసింహం | జయప్రద | ఎ.కోదండరామిరెడ్డి |
143 | 1986 | తాండ్రపాపారాయడు | జయప్రద, జయసుధ | దాసరి నారాయణరావు |
144 | 1986 | బ్రహ్మనాయుడు | సుహాసిని | దాసరి నారాయణరావు |
145 | 1986 | సర్ధార్ ధర్మన్న | - | - |
146 | 1986 | మరణశాసనం | - | - |
147 | 1986 | విశ్వనాధ నాయకుడు | జయప్రద | దాసరి నారాయణరావు |
148 | 1986 | మారణహోమం | - | - |
149 | 1988 | మాఇంటి మహారాజు | జయసుధ | - |
150 | 1988 | అంతిమ తీర్పు | సుమలత | జోషి |
151 | 1988 | పృథ్వీరాజ్ | జయసుధ | - |
152 | 1988 | ప్రచండభారతం | - | - |
153 | 1988 | ధర్మతేజ | రాధిక | పేరాల |
154 | 1988 | ప్రాణస్నేహితులు | రాధ | - |
155 | 1988 | సింహస్వప్నం | జయసుధ | వి.బి. రాజేంద్ర ప్రసాద్ |
156 | 1988 | శ్రీరామచంద్రుడు | సుజాత, విజయశాంతి | విజయ బాపినీడు |
157 | 1988 | పాపే మాప్రాణం | సుహాసిని | - |
158 | 1988 | భగవాన్ | భానుప్రియ | - |
159 | 1988 | సుమంగళి | జయప్రద | - |
160 | 1988 | టూ టౌన్ రౌడి | - | దాసరి నారాయణరావు |
161 | 1990 | గురుశిష్యులు | - | - |
162 | 1990 | యమధర్మరాజు | సుహాసిని | రేలంగి నరసింహారావు |
163 | 1990 | నేటి సిద్దార్ధ | - | క్రాంతి కుమార్ |
164 | 1991 | ఇంద్రభవనం | జ్యోతి | కృష్ణ |
165 | 1991 | విధాత | - | జ్యోతికుమార్ |
166 | 1993 | బావా బావమరిది | జయసుధ | శరత్ |
167 | 1993 | అన్నావదిన | జయప్రద | పి. చంద్రశేఖర రెడ్డి |
168 | 1994 | జైలర్ గారి అబ్బాయి | జయసుధ | శరత్ |
169 | 1994 | అందరూ అందరే | లక్ష్మీ | మౌళి |
170 | 1994 | గ్యాంగ్ మాస్టర్ | - | - |
171 | 1994 | పలనాటి పౌరుషం | రాధిక | ముత్యాల సుబ్బయ్య |
172 | 1994 | రిక్షా రుద్రయ్య | జయసుధజయప్రద | కె.ఎస్.నాగేశ్వరరావు |
173 | 1995 | సింహ గర్జన | జయసుధ | కె.అజయ్ కుమార్ |
174 | 1996 | నాయుడుగారి కుటుంబం | - | బోయిన సుబ్బారావు |
175 | 1996 | తాతా మనవడు | శారద | దాసరి నారాయణరావు |
176 | 1997 | కుటుంబ గౌరవం | రాధిక | అజయ్ కుమార్ |
177 | 1997 | మా నాన్నకి పెళ్ళి | అంబిక | - |
178 | 1997 | సింహద మారి (కన్నడం) | - | రాము |
179 | 1997 | హాయ్ బెంగళూర్ (కన్నడం) | - | - |
180 | 1997 | వంశోద్ధారకుడు | రాధిక | శరత్ |
181 | 2000 | సుల్తాన్ | - | శరత్ |
182 | 2003 | నాకు నువ్వు నీకు నేను | సుజాత | కాశీ విశ్వనాథ్ |
183 | 2006 | రామ్ | - | యన్. శంకర్ |
184 | 2006 | శ్రీశైలం | - | శివ నాగేశ్వరరావు |
185 | 2007 | బిల్లా | - | మెహర్ రమేష్ |
186 | 2012 | రెబెల్ | - | రాఘవ లారెన్స్ |
187 | 2013 | చండీ | ||
188 | 2022 | రాధేశ్యామ్ |
రాజకీయ ప్రస్థానం[మార్చు]
కృష్ణంరాజు మొదట కాంగ్రెస్ పార్టీలో 1991లో చేరినాడు. అదే ఏడాది నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యాడు. 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుతంలో 2000 సెప్టెంబర్ 30న నుండి 2001 జులై 22 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, 2001 జులై 1 నుండి 2003 జనవరి 29 వరకు వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణి శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుండి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. 2004 లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి వెంకట హరిరామజోగయ్య చేతిలో పరాజయం పొందినాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టిని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు.
కృష్ణంరాజు 2009లో రాజమండ్రి నుండి పీఆర్పీ నుండి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయి, అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో రాజకీయాల్లోకి దూరంగా ఉంటూ 2014లో తిరిగి బీజేపీ పార్టీలో చేరాడు.[6]
మరణం[మార్చు]
82 ఏళ్ల కృష్ణంరాజు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2022 సెప్టెంబరు 11న తుదిశ్వాస వదిలారు.[7][8]
మూలాలు[మార్చు]
- ↑
https://en.wikipedia.org/wiki/Krishnam_Raju. వికీసోర్స్.
- ↑ "Latest Telugu News, Headlines, Breaking News, Articles". EENADU. Retrieved 2021-11-21.
- ↑ https://www.youtube.com/watch?v=wHDw-DCvhWk
- ↑ Sakshi (22 December 2019). "ఆ క్రెడిట్ రెబల్‌స్టార్‌దా? శ్యామలదా?!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.
- ↑ Sakshi (12 September 2022). "రాజకీయాల్లో పడిలేచిన కెరటం!". Archived from the original on 12 September 2022. Retrieved 12 September 2022.
- ↑ "ప్రముఖ నటుడు కృష్ణంరాజు కన్నుమూత". web.archive.org. 2022-09-11. Archived from the original on 2022-09-11. Retrieved 2022-09-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Tollywood Senior Actor Krishnam Raju Passes Away, Celebs Pay Tribute - Moviezupp" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-09-11. Retrieved 2022-09-11.
బయటి లింకులు[మార్చు]
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- 1940 జననాలు
- తెలుగు సినిమా నటులు
- నంది ఉత్తమ నటులు
- రాజకీయాలలో సినీనటులు
- 12వ లోక్‌సభ సభ్యులు
- 13వ లోక్‌సభ సభ్యులు
- ప్రజారాజ్యం పార్టీ
- జీవిస్తున్న ప్రజలు
- ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకులు
- పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ నాయకులు
- పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నిర్మాతలు
- తూర్పు గోదావరి జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- 2022 మరణాలు