అందడు ఆగడు
అందడు ఆగడు (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.డి.లాల్ |
తారాగణం | కృష్ణంరాజు, లత |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీకాంత్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
అందడు ఆగడు 1979లో విడుదలైన 'క్రైమ్ థ్రిల్లర్' సినిమా.శ్రీకాంత్ నహతా నిర్మాత గా, ఎస్. డీ. లాల్ దర్శకత్వంలో , కృష్ణంరాజు, లత, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు .
కథ
[మార్చు]రంజిత్ ఘరానా పెద్దమనిషి. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమ్మాయిలను ప్రలోభపెట్టి వారిని భుజంగం అనే వ్యక్తి దగ్గరకు పంపిస్తాడు. భుజంగం ఆ అమ్మాయిలను విదేశాలకు విక్రయిస్తుంటాడు. తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులను పురస్కరించుకుని పోలీసులు రంగంలో దిగుతారు. విజయ్ అనే గూఢచారిని భుజంగం ఆచూకీ తీయడానికి నియమిస్తారు. పద్మ అనే సంపన్నయువతి రంజిత్ వలలో పడుతుంది. ఆమెను రక్షించడానికి విజయ్ శతవిధాలా ప్రయత్నిస్తాడు. పద్మ అక్క లత విజయ్‌తో చేతులు కలుపుతుంది. లత కూడా రంజిత్ దగ్గరకు ఉద్యోగానికి వెడుతుంది. విజయ్ లతను వెంబడించి భుజంగం కోటలోకి ప్రవేశిస్తాడు.[1]
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: ఎస్.డి.లాల్
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: ఎస్.వి.శ్రీకాంత్
- నిర్మాత: శ్రీకాంత్ నహతా
- నిర్మాణ సంస్థ: శ్రీకాంత్ పిక్చర్స్
- సాహిత్యం: ఆరుద్ర, సి నారాయణ రెడ్డి, వీటూరి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి
- విడుదల:30:03:1979.
పాటలు
[మార్చు]ఈ సినిమా కోసం ఆరుద్ర రెండు పాటలను రచించారు. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
- ఈ సంతలో ఒక చిన్నది నిలుచున్నది కొను వారెవ్వరో - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల బృందం
- నీ కోడె వయసు - నా ఆడ మనసు - రచన: ఆరుద్ర - గానం: ఎస్.జానకి
- ఏమని చెప్పేది ఎవరికి చెప్పేది ఎదలో ఈవేళ - రచన: సినారె -గానం: ఎస్.జానకి
- చిక్కడపల్లి చినదానా చిత్రమైనదానా ఏమైందో ఈ రోజున - రచన: వీటూరి -గానం: పి.సుశీల
- ఓ చిటికీ ఎంత ముద్దుగున్నావే ఓ పటికి ఎంత తియ్య - రచన: సినారె -గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
మూలాలు
[మార్చు]- ↑ వి.ఆర్. (7 April 1979). "చిత్రసమీక్ష - అందడు ఆగడు" (PDF). ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66 సంచిక 6. Archived from the original (PDF) on 11 నవంబరు 2022. Retrieved 13 December 2017.