Jump to content

విజయలలిత

వికీపీడియా నుండి

విజయలలిత (జననం:-జూన్ 17,1949[1] ) 1970వ దశకములోని తెలుగు సినిమా నటి. ప్రసిద్ధ తెలుగు సినిమా తార విజయశాంతి చిన్నమ్మ. శృంగార నాట్యతారగా సినీ జీవితాన్ని ప్రారంభించి, హీరోయిన్‌గాను ఆ తర్వాత నిర్మాతగానూ తన క్రమశిక్షణ వల్ల ఎదిగింది.[2]

విజయలలిత 1960లు, 70లలో అనేక తెలుగు సినిమాలలో నటించింది. సాధు ఔర్ షైతాన్, రాణీ మేరా నామ్, హథ్‌కడీ వంటి కొన్ని హిందీ సినిమాలు, కొన్ని తమిళ చిత్రాలలో నటించింది. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తదితర అగ్రశ్రేణి తెలుగు సినీ నటుల సరసన నటించిన ఈమె లేడీ జేమ్స్‌బాండ్ పాత్రలకు ప్రసిద్ధి. ఈమె నటించిన సినిమాలలో రౌడీరాణి, రివాల్వర్ రాణి, చలాకీ రాణి కిలాడీ రాజా, భలే రంగడు, మనుషుల్లో దేవుడు, కదలడు వదలడు సినిమాలు ప్రసిద్ధమైనవి.

ఈమె ఎంతో క్రమశిక్షణ, సమయపాలనతో కచ్చితమైన సమయానికి సినిమా షూటింగులకు హాజరవుతూ ఉండేది. విజయలలిత ఉదయం 7 గంటలకు కాల్‌ షీట్‌ అంటే 6 గంటలకే మేకప్‌ చేయించుకుని కార్లో వచ్చి 7 గంటలకి షూటింగ్‌ వున్న స్టూడియోకి వచ్చి ఫ్లోర్‌గేట్‌ తాళం తీయక పోయినా, అక్కడే కూర్చునేది[3] ఈ క్రమశిక్షణా ధోరణి వలన ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి.[4] ఈమె దాదాపు 860 సినిమాలలో నటించింది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నాట్య విలాసం విజయలలిత - ఆంధ్రప్రభ 17 Jun 2010[permanent dead link]
  2. నటన+ విలక్షణశిక్షణ Archived 2012-07-14 at Archive.today - 'లక్ష్మణరేఖ' గోపాలకృష్ణ : ఆంధ్రప్రభ ఏప్రిల్ 8, 2010
  3. "నటన+ విలక్షణశిక్షణ - ఆంధ్రప్రభ 8 Apr 2010". Archived from the original on 14 జూలై 2012. Retrieved 14 July 2012.
  4. "డైరెక్టర్స్‌ స్పెషల్‌ in [[Andhra Prabha]] daily". Archived from the original on 2012-07-14. Retrieved 2010-08-06.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విజయలలిత&oldid=4236431" నుండి వెలికితీశారు