గండర గండడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గండర గండడు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కాంతారావు
నిర్మాణ సంస్థ సంజీవి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కాంతారావు నిర్మాతగా నిర్మితమైనది. ఇంచుమించు ఏకవీర చిత్రంతో పాటు విడుదలై ఆ చిత్రం కంటే ఎక్కువ విజయవంతమైనది. (ఆధారం-కాంతరావు బయొగ్రఫి-అనగనగా ఒక రాకుమారుడు).

పాత్రలు - పాత్రధారులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
 • మాటలు: జి.కె.మూర్తి
 • పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, జి.కె.మూర్తి, రాజశ్రీ
 • సంగీతం: కోదండపాణి
 • ఛాయాగ్రహణం: అన్నయ్య
 • కళ: బి.ఎన్.కృష్ణ
 • కూర్పు: కె.గోపాలరావు
 • నృత్యాలు: కె.ఎస్.రెడ్డి
 • నిర్మాతలు: జి.రామం, వి.చంద్రశేఖర్

సంక్షిప్త కథ[మార్చు]

అలకాపురి మహారాజు శాంతిప్రియుడు. అంతఃకలహాలతో సతమతమవుతున్న సకల దేశాధీశులను వసంతోత్సవాలకు ఆహ్వానించి, తన శాంతి సందేశాన్ని వినిపించి, అందరిచేత అవుననిపించుకుంటాడు. అలకాపురి యువరాజు మనోహార్, కళింగ రాకుమారి శశిరేఖను ప్రేమిస్తాడు. కాలక్ంఠుడనే మాంత్రికుడు అతిలోక శక్తులను సంపాదించడానికై దేవి అనుగ్రహం పొందడానికి, వసంతోత్సవాలకు వచ్చిన అయిదుగురు రాకుమార్తెలను, స్వర్ణమాలను అపహరించుకు పోతాడు. ఆ నేరం మనోహర్‌పైన పడుతుంది. మనోహర్ ఒక నెల గడువు తీసుకుని, పెక్కు కష్టాలను ఎదుర్కొని మాంత్రికుని సంహరించి, రాకుమార్తెలను విడిపించి, తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటాడు. శశిరేఖా మనోహర్‌ల వివాహంతో కథ సుఖాంతమవుతుంది[1].

పాటలు[మార్చు]

 1. అసమాన రసికావతంసా నల్దెసలందు విహరించే - పి.సుశీల - డా. సినారె
 2. నవ్వనా కెవ్వునా రవ్వలే రువ్వనా.. నిను చూశానా - విజయలక్ష్మి కన్నారావు -రచన: రాజశ్రీ
 3. నమామి ధర్మనిలయాం కరుణలోక మాతారం (శ్లోకం) - విజయలక్ష్మి కన్నారావు
 4. లేనిపోని సాకు చెప్పి లేచిపోతావెందుకు రా - విజయలక్ష్మి కన్నారావు, పిఠాపురం - రచన:జి.కె. మూర్తి
 5. వన్నెలడి వలచింది కన్నుగీటి పిలిచింది నిన్నేరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి.కె.మూర్తి
 6. గుర్రాలంటే గుర్రాలు ఇవి పంచకళ్యాణి - మాధవపెద్ది, ఏ.వి.యన్. మూర్తి - రచన: కొసరాజు
 7. మనసులోన మౌనవీణ మధుర గీతం పాడనీ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె

మూలాలు[మార్చు]

 1. వెంకట్ (31 December 1969). "సమీక్ష - గండర గండడు". ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక. 18 (20): 48. Retrieved 15 January 2020.[permanent dead link]