పట్టుకుంటే లక్ష
Jump to navigation
Jump to search
పట్టుకుంటే లక్ష (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.హరినారాయణ |
నిర్మాణం | బి. కృష్ణమూర్తి, వి. కృష్ణంరాజు |
తారాగణం | కృష్ణ, విజయలలిత , నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, ధూళిపాళ |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | హరి కృష్ణ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఈ సినిమాకు మూలకథ ఆధారం: కొమ్మూరి సాంబశివరావు అపరాధ పరిశోధక నవల - పట్టుకుంటే లక్ష
తారాగణం
[మార్చు]నాగభూషణం, కైకాల సత్యనారాయణ, రాజబాబు
కథ
[మార్చు]దేశ ద్రోహులతో చేతులు కలిపి దేశంలో అలజడులు సృష్టిస్తున్న శివపాదం (కైకాల సత్యనారాయణ) కూతురైన రాధను కోర్టు లో విచారణను ఎదుర్కొంటున్న వినాయకరావు (నాగభూషణం) కిడ్నాప్ చేస్తాడు. రాధను పట్టుకుంటే లక్ష రూపాయల బహుమతిని ప్రకటిస్తాడు. మరోవైపు డిటెక్టివ్ రాజు (ఘట్టమనేని కృష్ణ), శివపాదాన్ని పట్టుకోవడం కోసం అతడి క్లబ్ లో పనిచేసే ఎమిలీ తో పరిచయం చేసుకొంటాడు. వీరందరూ కలిసి దేశద్రోహుల ఆట ఎలా కట్టించారనేది మిగిలిన సినిమా
పాటలు
[మార్చు]- అందరికి ఈ చిలక అందదులే తన వలపు తలుపులను తెరవదులే - జె. గిరిజ
- కన్నులలో నీ రూపం హృదయంలో ఈ తాపం తాళలేకపోతు - ఘంటసాల - రచన: దాశరథి
- కొండా తిరిగొ కోనా తిరిగి రామయ వస్తాడు - తిరుపతి రాఘవులు, జే.గిరిజ: ప్రయాగ
- పట్టుకుంటె లక్ష వచ్చింది చూస్కో లక్ష లక్ష లక్ష దేవుడు దయ - తిరుపతి రాఘవులు, ఎస్. జానకి
- పరత్రాణాయ సాధూనాం వినాశాయచ ( సంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
- రెడి రడి రెడీ ఎందుకైన మంచిది విల్‌యు ప్లీజ్ గెట్ - ఎస్. జానకి, ఘంటసాల - రచన: విజయరత్నంపత్తూకుంటే
- వులికి పడతావేల బెదిరిపడతావేల -ఎస్. జానకి: దాశరధి
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)