Jump to content

కొమ్మూరి సాంబశివ రావు

వికీపీడియా నుండి
(కొమ్మూరి సాంబశివరావు నుండి దారిమార్పు చెందింది)
కొమ్మూరి సాంబశివ రావు
జననం
కొమ్మూరి సాంబశివ రావు

(1926-10-26)1926 అక్టోబరు 26
మరణం1994 మే 17
వృత్తివిలేఖరి, రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1956-1994
తల్లిదండ్రులు
  • వెంకట్రామయ్య (తండ్రి)
  • పద్మావతి (తల్లి)

కొమ్మూరి సాంబశివ రావు (1926-1994) ఒక ప్రముఖ నవలా రచయిత.[1] తెలుగులో తొలి హారర్ నవలా రచయిత. ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించాడు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా పనిచేశాడు. 90 కి పైగా నవలలు రాసి డిటెక్టివ్ నవలా రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు పాత్రలు తెలుగు పాఠకులకు పరిచయమైన పేర్లు.

జీవిత విశేషాలు

[మార్చు]

సాంబశివరావు 1926 అక్టోబరు 26 న తెనాలిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వెంకట్రామయ్య, పద్మావతి. వెంకట్రామయ్య ప్రముఖ రచయిత చలంకు స్వయానా తమ్ముడు.[2] చలాన్ని తన తాత దత్తత తీసుకోవడంతో ఆయన ఇంటి పేరు గుడిపాటిగా మారింది. వెంకట్రామయ్యకు అప్పట్లో తెనాలిలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. సాంబశివరావు తల్లి పద్మావతి బళ్ళారి రాఘవ బృందంతో కలిసి నాటకాలు వేస్తుండేది. సినిమాల్లో కూడా నటించింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. కొడవటిగంటి కుటుంబరావు భార్యయైన వరూధిని ఈయనకు అక్క. అలా ఈయన కొడవటిగంటి రోహిణీప్రసాద్కు మేనమామ అవుతాడు.[3] ఆయన చెల్లెలు ఉషారాణి ఢిల్లీలోని నేషనల్ బుక్ ట్రస్ట్లో తెలుగు విభాగానికి అధ్యక్షురాలిగా ఉండేది.

సాంబశివరావు తండ్రి వెంకట్రామయ్య ప్రెస్సును కాంగ్రెస్ పత్రాలు ముద్రిస్తున్నారని ఆంగ్లేయులు మూసివేశారు. దాంతో బ్రతుకుదెరువు వెతుక్కుంటూ ఆయన కుటుంబం మద్రాసుకు మారింది. అక్కడ ఆయన కొద్ది రోజులు సినిమా సంబంధిత వార్తలతో తెలుగు సినిమా అనే పత్రిక నడిపాడు. కొంతకాలం తర్వాత దాన్ని మూసివేశారు. వృత్తిలో భాగంగా తన తండ్రి దగ్గరకు వచ్చే రచయితల ప్రభావంతో 14 ఏట నుంచే రచనలు ప్రారంభించాడు సాంబశివరావు. ఎస్.ఎస్.ఎల్.సీ వరకే చదివి, తర్వాత నార్ల వెంకటేశ్వర రావు దగ్గర విలేఖరిగా పని చేశాడు. తర్వాత తన ప్రవృత్తికి సరిపడని ఆ ఉద్యోగం మానేసి, తండ్రి మూసేసిన తెలుగు సినిమా పత్రికను తిరిగి ప్రారంభించాడు. ఈ పత్రిక మంచి ఆదరణ పొంది ఆయనకు ఆర్థికంగా లాభాలు కూడా తెచ్చి పెట్టింది. ఒకానొక దశలో మారిస్ మైనరు కారు కూడా కొన్నాడు. కానీ ఆ పత్రిక అన్నీ తానై నిర్వహించడం వలన, ఒక్కోసారి సమన్వయలోపంతో నాణ్యత కుంటుపడి, మరి కొన్నాళ్ళకు మూత పడింది. తర్వాత మంజూష అనే సాహిత్య పత్రిక ప్రారంభించాడు. కొన్నాళ్ళకు అది కూడా మూతపడింది. జీవనాధారం కోసం మళ్ళీ రచనలు ప్రారంభించాడు. అలా ఆయన రాసిన మొదటి రచన లక్షాధికారి హత్య. దాన్ని ప్రచురించడం కోసం ఒక సంస్థ కూడా ప్రారంభించాడు. తర్వాత రెండు దశాబ్దాలకుపైగా 90 దాకా నవలా రచన అప్రతిహతంగా సాగింది. తన రచనల నేపథ్యం కోసం మద్రాసులోని బ్రిటీష్ లైబ్రరీకి వెళ్ళి అధ్యయనం చేసేవాడు. డిటెక్టివ్ నవలలే కాక కొన్ని సాంఘిక నవలలు కూడా రాశాడు. కానీ డిటెక్టివ్ రచయితగా ముద్రపడటం వల్ల సాంఘిక నవలలు అంతగా ప్రాచుర్యం కాలేదు.

నవలలు

[మార్చు]

కొమ్మూరి 14 సంవత్సరాల వయసు నుండే కథలు రాయడం ప్రారంభించాడు. 1957-1980 మధ్యలో ఆయన విస్తృతంగా రచనలు చేశాడు. ఆంగ్ల రచయిత ఎడ్గర్ వాలేస్ ఆయనకు స్ఫూర్తి. భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహా రావు ఈయన రచనలను అభిమానించే వాడు. మల్లాది వెంకటకృష్ణమూర్తి కొమ్మూరి నుంచి స్ఫూర్తి పొందాడు.[2]

ఆయన డిటెక్టివ్ నవలల్లో కనిపించే పాత్రలు డిటెక్టివ్ యుగంధర్, అతని సహాయకుడు రాజు, పోలీసు ఇన్ స్పెక్టరు స్వరాజ్య రావు. వీటిలో చాలా నవలలు మద్రాసు పట్టణం నేపథ్యంలో రాసినవి. చాలా వరకు నవలలు హంతకులను, నేరస్థులను పట్టుకునేవి. కొన్ని నవలల్లో ఏజెంట్లు ఇతర దేశాల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనే కథలు. అప్పట్లో రాజకీయ అనిశ్చితి కారణంగా పొరుగు దేశాలతో ఇబ్బందులు రాకూడదని ఆయాదేశాల పేర్లు మార్చి పేరడీ పేర్లతో రాసేవాడు. నెం. 111 లాంటి సీరియల్ నంబర్లతో వచ్చే నవలలు సుమారు 15కి పైగా ఉన్నాయి. ఆయన రాసిన నవలలు చాలా ముందుచూపుతో రాసినవని పాఠకులు అభిప్రాయపడుతుంటారు.[4] పాఠకులకు సులువుగా అర్థమయ్యే ప్రత్యేకమైన రచనాశైలి అనేకమంది పాఠకులను ఆకర్షించింది. రచనల పరిమాణం కూడా అప్పటి డిటెక్టివ్ సాహిత్యం నియమాల ప్రకారం 100 నుంచి 150 పేజీల మధ్యలో ఉండేవి.

  1. 13 గంటలు కొట్టిన గడియారం
  2. 28 మెట్లు
  3. 666
  4. x303y
  5. x808
  6. అంతర్ధానమైన అందగత్తె
  7. అడ్డదారులున్నాయి జాగ్రత్త
  8. అడుగు పడితే అపాయం
  9. అడుగు ముందుకు వెయ్యక
  10. అడుగుజాడలు
  11. అడుగో అతనే దొంగ
  12. అడుగో అతనే హంతకుడు
  13. అతను అతను కాదు
  14. అనామకుడి హత్య
  15. అనుక్షణం ప్రమాదం
  16. అర్ధరాత్రి అతిథి
  17. అర్ధరాత్రి అరుపు
  18. అర్ధరాత్రి పిలుపు
  19. ఐదుగురు అనుమానితులు
  20. ఇదంతా ఎవరి కోసం
  21. ఇరవై నాలుగు గంటలలో
  22. ఉరితాడు
  23. ఎవరికీ చెప్పక
  24. ఎవరికోసం ఈ త్యాగం
  25. ఎర్రని గుర్తు
  26. ఒక చల్లని రాత్రి
  27. ఒక చీకటి రాత్రి
  28. ఒక వెన్నెల రాత్రి
  29. గణ గణ మోగిన గంట
  30. చచ్చి బతికిన మనిషి
  31. చావు కేక
  32. చావు తప్పితే చాలు
  33. చీకటికి వేయి కళ్ళు
  34. చెప్పిచేసిన హత్య
  35. చేతులు ఎత్తు
  36. జయచంద్రుడు
  37. తలుపు తెరిస్తే చస్తావు
  38. తొలిప్రేమ
  39. దొంగలున్నారు జాగ్రత్త
  40. ధారలుగా కారిన రక్తం వరదలుగా కారిన కన్నీరు
  41. ధైర్యం చాలదు
  42. నక్కి దాక్కుంది
  43. నన్ను క్షమించు
  44. నన్ను చంపకండి
  45. నాలుగు నల్లని చుక్కలు
  46. నెం. 111
  47. నెం. 121
  48. నెం. 222
  49. నెం. 333
  50. నెం. 375
  51. నెం. 444
  52. నెం. 456
  53. నెం. 555
  54. నెం. 616
  55. నెం. 678
  56. నెం. 777
  57. నెం. 787
  58. నెం. 818
  59. నెం. 888
  60. నెం. 911
  61. నెం. 999
  62. నెఫాలో కెప్టెన్ నరేష్
  63. నిన్నెందుకు ప్రేమించాలి
  64. నువ్వు ఎవరి కోసం
  65. నువ్వే కావాలి
  66. నువ్వే నా ప్రాణం
  67. నేను చావను
  68. నేను నేను కాను
  69. పట్టుకుంటే లక్ష
  70. పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు
  71. పాపం పిలిచింది
  72. పారిపోయిన ఖైదీ
  73. ప్రాక్టికల్ జోకర్
  74. ప్రాణానికి ప్రాణం
  75. ప్రమీలాదేవి హత్య
  76. ప్రపంచానికి 10 గంటల్లో ప్రమాదం
  77. ప్రమాదం జాగ్రత్త
  78. ప్రేమ కిరణం
  79. భయం లేదు
  80. భయం, భయం
  81. మతిపోయిన మనిషి
  82. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో
  83. ముందు నుయ్యి వెనుక గొయ్యి
  84. మోటారు కారులో శవం
  85. రాత్రి ఒంటి గంట
  86. లక్షా రెండు లక్షలా ఎంత కావాలి
  87. లక్షాధికారి హత్య
  88. లాకెట్ మర్మం
  89. వలలో చిక్కిన వనిత
  90. సుజాత

మూలాలు

[మార్చు]
  1. "Review: Kommuri Sambasiva Rao". beeafteryou.com. Archived from the original on 3 నవంబరు 2016. Retrieved 14 September 2016.
  2. 2.0 2.1 విపుల. Hyderabad: Ramoji Rao. August 2016. p. 86.
  3. రోహిణీ ప్రసాద్, కొడవటిగంటి (June 1, 2012). అణువుల శక్తి (PDF) (మొదటి ed.). హైదరాబాదు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. p. VI. Archived from the original (PDF) on 25 మార్చి 2017. Retrieved 14 September 2016.
  4. Parasa, Rajeswari (2020-08-29). "The world of Telugu pop fiction: Five writers you must read". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2026-02-10.