రౌడీరాణి

వికీపీడియా నుండి
(రౌడీ రాణి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రౌడీరాణి
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం విజయలలిత,
రాజబాబు,
సత్యనారాయణ,
ప్రభాకరరెడ్డి,
త్యాగరాజు,
జ్యోతిలక్ష్మి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.సుశీల
గీతరచన వీటూరి,
దాశరథి,
శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ సౌభాగ్య కళాచిత్ర
భాష తెలుగు

రౌడీరాణి విజయలలిత కథానాయికగా వెలువడిన క్రైమ్‌ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా తెలుగులో ఇలాంటి సినిమాలకు మార్గదర్శకంగా నిలిచింది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో అట్లూరి శేషగిరిరావు నిర్మించిన ఈ సినిమా 1970, అక్టోబర్ 23న విడుదలయ్యింది.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

కథ[మార్చు]

జమీందారు జగన్నాథరావును, అతని భార్యను, కూతురును, కొడుకును బందిపోటు దొంగలు దారుణంగా హత్యచేసి దోచుకుంటారు. దొంగల చేతుల్లోనుండి చిన్నారి కూతురు రాణి మాత్రం తప్పించుకుంటుంది. ఇంటి నౌకరు శిక్షణలో అందమైన రౌడీ రాణిగా పెరుగుతుంది. రాణికి తన కుటుంబాన్ని చంపిన నలుగురు హంతకుల పోలికలు బాగా గుర్తున్నాయి. ప్రతీకార వాంఛతో వారిని తుదముట్టించడానికి ఓ గుర్రం మీద బయలుదేరుతుంది.

ఆ నలుగురు హంతకులలో ఒకడైన భీమరాజు మెక్సికన్ స్టైల్లో ఒక క్లబ్బును నడుపుతూ బ్యాంకులను దోచుకుంటూ ఉంటాడు. రెండవవాడైన రత్తయ్య బందిపోటు దొంగతనంలో స్థిరపడిపోయి, పల్లెపడుచులను చెరపడుతూ ఉంటాడు. మూడవ వాడైన నాగులు తన భయంకరమైన రూపాన్ని మార్చుకుని దయానిధి అనే ప్రజాసేవకునిగా చలామణీ అవుతుంటాడు. రైలు దోపిడీలు కూడా చేస్తుంటాడు. నాలుగో వ్యక్తి పాపారావు నిజంగా పాపాలరాయుడే. రాణి తన సహాయకుడు ఏడుకొండలు సహాయంతో ఈ నలుగురినీ ఎలా శిక్షించిందీ చిత్రంలోని తరువాతి కథ[1].

పాటలు[మార్చు]

  1. ఇంతలేసి కన్నులున్న సిన్నదాన్నిరో వింత వింత వన్నెలున్న - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: వీటూరి
  2. ఐ లవ్ యు యూ యూ నిషావాలా హేయ్ మిస్టర్ - ఎల్.ఆర్.ఈశ్వరి కోరస్ - రచన: వీటూరి
  3. గులాబి ఉన్నది నీ ఎదుటే చలాకి ఉన్నది నీ కొరకే - ఎల్.ఆర్.ఈశ్వరి - దాశరథి
  4. మనదేశంలో ఉన్నారు మహానుభావులు ఒక నాడు - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: శ్రీశ్రీ

విశేషాలు[మార్చు]

కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ఇదే చిత్రాన్ని హిందీ భాషలో విజయలలితను కథానాయికగా రాణీ మేరా నామ్‌ పేరుతో 1972లో పునర్నిమించారు. ఈ చిత్రంలో శ్రీదేవి బాలతారగా తొలిసారి హిందీ సినిమాలో నటించింది.

మూలాలు[మార్చు]

  1. వీరాజీ (23 October 1970). "చిత్ర సమీక్ష: రౌడీరాణి". ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived from the original on 1 జూలై 2020. Retrieved 30 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=రౌడీరాణి&oldid=3609083" నుండి వెలికితీశారు