నెల్లూరు కాంతారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నెల్లూరు కాంతారావు ఒక చలన చిత్ర నటుడు. అనేక సినిమాలలో ప్రతినాయక పాత్ర పోషించాడు. టైగర్ ప్రొడక్షన్స్ అనే చిత్రనిర్మాణ సంస్థను ఎస్.హెచ్.హుసేన్ అనే వ్యక్తితో కలిసి స్థాపించి కొన్ని చిత్రాలను నిర్మించాడు. ఇతనికి నెల్లూరులో కనకమహల్ అనే సినిమా ప్రదర్శనశాల కూడా ఉండేది.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు నెల్లూరులో 1931, జనవరి 24న జన్మించాడు. చిన్నతనం నుండే శరీరవ్యాయామం చేస్తూ, దేహధారుఢ్యాన్ని పెంచుకుని, కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఎందరో వస్తాదులను ఓడించాడు. 'ఆంధ్రా టైగర్' అనే బిరుదును పొందాడు. నెల్లూరులో ఉన్న కనక్‌మహల్ థియేటర్‌లో ఇతడు ఒక భాగస్వామి. రేచుక్క-పగటిచుక్క సినిమాలో వస్తాదు పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించి నటుడిగా, నిర్మాతగా మారాడు. పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే ఇతడు ఎందరికో స్నేహపాత్రుడైనాడు. అంతగా అనుభవం లేకున్నా కేవలం తన మంచితనంతోనే నిర్మాతగా మారి అసాధ్యుడు, అఖండుడు లాంటి సినిమాలను నిర్మించాడు. ఇతడు 1970, అక్టోబరు 8వ తేదీ నూజివీడులో ఆసుపత్రిలో మరణించాడు[1].

చిత్రరంగం[మార్చు]

నటుడిగా[మార్చు]

నర్తనశాల చిత్రంలో మల్లయోధుని వేషంలో నెల్లూరు కాంతారావు నటించిన సన్నివేశం
 1. బొబ్బిలి యుద్ధం (1964) - మల్లయోధుడు
 2. అంతస్తులు (1965)
 3. జమీందార్ (1965) - మూర్తి
 4. జ్వాలాద్వీప రహస్యం (1965)
 5. నర్తనశాల (1965) - మల్లయోధుడు
 6. పాండవ వనవాసం (1965) - కిమీరుడు
 7. వీరాభిమన్యు (1965) - ఘటోత్కచుడు
 8. గూఢచారి 116 (1966)
 9. అసాధ్యుడు (1967)
 10. ఇద్దరు మొనగాళ్లు (1967)
 11. వింత కాపురం (1968)
 12. ప్రేమ మనసులు (1969)
 13. అఖండుడు (1970)
 14. అగ్నిపరీక్ష (1970)
 15. రౌడీరాణి (1970)
 16. అల్లుడే మేనల్లుడు (1970)
 17. అందరికీ మొనగాడు (1971)
 18. భలేపాప (1971)

నిర్మాతగా[మార్చు]

 1. సర్వర్ సుందరం (1966)
 2. నువ్వే (1967)
 3. అసాధ్యుడు (1967)
 4. అఖండుడు (1970)

మూలాలు[మార్చు]

 1. సంపాదకుడు (1 November 1970). "నెల్లూరు కాంతారావు మృతి". విజయచిత్ర. 5 (5): 29. |access-date= requires |url= (help)

బయటి లింకులు[మార్చు]