అసాధ్యుడు (1968 సినిమా)
Jump to navigation
Jump to search
అసాద్యుడు, తెలుగు చలన చిత్రం1968 లో విడుదల.టైగర్ ప్రొడక్టన్ పతాకం పై నిర్మాతలు, నెల్లూరు కాంతారావు, ఎస్ హెచ్. హుస్సేన్ నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు వి రామచంద్రరావు. ఘట్టమనేని కృష్ణ, కె ఆర్. విజయ, వాణీశ్రీ, రామకృష్ణ , ముఖ్య తారాగణం.సంగీతం టీ. చలపతి రావు అందించారు.
అసాధ్యుడు (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి. రామచంద్రరావు |
---|---|
నిర్మాణం | నెల్లూరు కాంతారావు, ఎస్.హెచ్. హుస్సేన్ |
తారాగణం | కృష్ణ, కె.ఆర్.విజయ |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | టైగర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- కె.ఆర్. విజయ
- నెల్లూరు కాంతారావు
- జి. రామకృష్ణ
- చలం
- వాణిశ్రీ
- రావి కొండలరావు
- రమాప్రభ
- రోజారమణి
- ముక్కామల
- వల్లూరి బాలకృష్ణ
- పెరుమాళ్ళు
- భీమరాజు
- వల్లం నరసింహారావు
- కోళ్ళ సత్యం
- చంద్రమోహన్
- ప్రభాకర్‌రెడ్డి
- చలపతిరావు
పాటలు
[మార్చు]- అల్లూరి సీతారామరాజు (నాటకం) - వల్లం నరసింహారావు (వాఖ్యానం) - గోపాలం, వసంత బృందం - రచన: శ్రీశ్రీ
- ఇలా ఇలా ఉంటుందని ఏదో ఏదో అవుతుందని - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
- కలలే కన్నానురా వగతో ఉన్నానురా త్వరగా రావేమిరా - ఎస్. జానకి - రచన: దాశరథి
- చిట్టెమ్మ చిన్నమ్మ చూడవమ్మా నన్ను ఔనన్నా కదన్నా - పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
- నిన్నుచూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా - పిఠాపురం, మాధవపెద్ది సత్యం - రచన: కొసరాజు
- వెళ్ళగలిగితే వెళ్ళు వెళ్ళు వెళ్ళు నన్ను వదలి కదల లేవు కాళ్ళు - ఘంటసాల - రచన: ఆరుద్ర
- సైరానా రాజా హుషార్ హుషార్ నిద్ర లే లేవర - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది సత్యం బృందం - రచన: ఆరుద్ర