వి. రామచంద్రరావు
వి. రామచంద్రరావు | |
---|---|
జననం | ఓరుగంటి రామచంద్రారావు 1926 మార్చి 13 లక్ష్మీ పోలవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా |
మరణం | ఫిబ్రవరి 14, 1974 వేలూరు, తమిళనాడు, ఇండియా |
మరణ కారణం | గుండెపోటు |
వృత్తి | భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత |
ప్రసిద్ధి | అల్లూరి సీతారామరాజు |
వి. రామచంద్రరావు (1926 - 1974) భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]రామచంద్రరావు 1926, మార్చి 13న తూర్పు గోదావరి జిల్లా, లక్ష్మీ పోలవరంలో జన్మించాడు. కాకినాడ, చెన్నైలలో చదవుకున్నాడు.[1]
సినిరంగ ప్రస్థానం
[మార్చు]తాపీ చాణక్య సూచనమేరకు సినీరంగానికి వచ్చిన రామచంద్రరావు రోజులు మారాయి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఘట్టమనేని కృష్ణ కథానాయకుడిగా నటించిన మరపురాని కథ చిత్రంతో దర్శకుడిగా మారాడు. అప్పటినుండి కృష్ణతో అనుబంధం ఏర్పడింది. తను దర్శకత్వం వహించిన 17 చిత్రాలలో 11 చిత్రాలు కృష్ణ హీరోగా తీసినవి. వీరిద్దరి కలయికలో వచ్చిన అల్లూరి సీతారామరాజు చిత్రం ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా భారీ విజయాన్ని సాధించింది. రామచంద్రరావు దర్శకత్వంలో ఎడారిలో తప్పిపోయిన బాలుని కథతో వచ్చిన పాపం పసివాడు చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక విలక్షణ చిత్రంగా నిలిచింది.[2] ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హెలికాప్టరు ద్వారా కరపత్రాలను పంచారు. రామచంద్రరావు నిర్మించిన భద్రం కొడుకో చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది.[3]
చిత్రాల జాబితా
[మార్చు]- దర్శకుడిగా:
- పెన్నుం పొన్నుం (1974)
- అల్లురి సీతారామరాజు (1974)
- దేవుడు చేసిన మనుషులు (1973)
- గంగ మంగ (1973)
- అబ్బాయిగారు - అమ్మాయిగారు (1972)
- అమ్మమాట (1972)[4]
- పాపం పసివాడు (1972)
- పగబట్టిన పడుచు (1971)
- అసాధ్యుడు (1968)[5]
- నేనంటే నేనే (1968)
- మరపురాని కథ
- రచయితగా:
- దేవుడు చేసిన మనుషులు (స్క్రీన్ ప్లే)
మరణం
[మార్చు]అల్లూరి సీతారామరాజు చిత్రీకరణ మధ్యలోనే 1974, ఫిబ్రవరి 14న రాయవేలు ఆసుపత్రిలో రామచంద్రారావు (47) గుండెపోటుతో మరణించాడు. ఆయన చివరి కోరిక మేరకు మిగతా చిత్రాన్ని పూర్తిచేసిన కృష్ణ, చిత్ర టైటిల్స్ లో దర్శకుడిగా రామచంద్రారావు పేరునే వేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ ETV, ETV Talkies. "Special story on veteran Tollywood director V. Ramachandra Rao". www.youtube.com. ETV Andhra Pradesh. Retrieved 3 December 2017.
- ↑ విశాలాంధ్ర (19 June 2010). "ఎడారిలో తప్పిపోయిన బాలుని కథ". యర్నాగుల సుధాకరరావు. Retrieved 3 December 2017.[permanent dead link]
- ↑ bookmyshow, person. "V. Ramachandra Rao". in.bookmyshow.com. Retrieved 3 December 2017.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (14 May 2017). "అమ్మ సినిమాలు". వినాయకరావు. Retrieved 3 December 2017.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link] - ↑ నమస్తే తెలంగాణ (13 August 2016). "సూపర్ హిట్ పెయిర్ జంటగా 'బెలూన్'". Retrieved 3 December 2017.[permanent dead link]