నేనంటే నేనే
నేనంటే నేనే (1968 తెలుగు సినిమా) | |
నేనంటే నేనే సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి. రామచంద్రరావు |
తారాగణం | కృష్ణ, కాంచన |
సంగీతం | ఎస్.పీ. కోదండపాణి |
నిర్మాణ సంస్థ | సుజాత ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పి.మల్లిఖార్జునరావు 1968లో సుజాత ఫిలిమ్స్ బేనర్‌పై నిర్మించిన చిత్రము ‘నేనంటే నేనే’. ఓరుగంటి రామచంద్రరావు ఈ సినిమా దర్శకుడు. ఈ సినిమా 1967లో విడుదలైన ‘నాన్’ అనే తమిళ చిత్రం ఆధారంగా రూపొందించబడింది.
నటీనటులు
[మార్చు]- జూనియర్ ఎ.వి. సుబ్బారావు - రాజా రఘునాథరావు
- శ్రీరంజని (జూనియర్) - కామాక్షమ్మ
- కృష్ణంరాజు - ఆనంద్
- చంద్రమోహన్ - కుమార్
- వి. రామచంద్రరావు - ఉద్దండం
- కాంచన
- సూర్యకాంతం - సుకుమారి
- కే.వి. చలం - బాజాలు
- రావి కొండలరావు - దివాన్
- ఘట్టమనేని కృష్ణ - శేఖరం
- నాగభూషణం - భూషణం
- రాధాకుమారి - మోహిని
- నెల్లూరు కాంతారావు - భూపతి
- సంధ్యారాణి - సరళ
- సుంకర లక్ష్మి
- మాస్టర్ విశ్వేశ్వరరావు
- రమేష్
- మోహన్‌దాస్
- డి.నారాయణ
- కోళ్ళ సత్యం
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ-టిఎన్ బాలు
- కళ-ఎస్ కృష్ణారావు,
- ఫొటోగ్రఫీ- ఎస్ వెంకటరత్నం
- కూర్పు-ఎన్‌ఎస్ ప్రకాశం
- సంగీతం- ఎస్.పి. కోదండపాణి
- దర్శకత్వం- వి. రామచంద్రరావు
- నిర్మాత- పి.ఎన్.బాబ్జీ
కథ
[మార్చు]రంగాపురం రాజా రఘునాథరావు (జూనియర్ సుబ్బారావు) కొడుకు కుమార్‌రాజా. అతని పుట్టినరోజు పార్టీకి పిలిచిన స్నేహితులను తండ్రి వెళ్ళగొడతాడు. దాంతో తండ్రిపై కోపంతో కుమార్ ఎస్టేటు విడిచి వెళ్లిపోతాడు. రంగూన్‌లో కామాక్షమ్మ (జూ.శ్రీరంజని)వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. ఆమె సొంత కొడుకు ఆనంద్ (కృష్ణంరాజు)కంటే కుమార్ (చంద్రమోహన్)ను ఎక్కువగా అభిమానిస్తుంది. బంగ్లా నుంచి కుమార్ వెళ్లిపోయాక రాజా రఘునాథరావుకు ఒక కుమార్తె జన్మిస్తుంది. అనంతర కాలంలో రాణీ మరణించటం, కుమార్ ఎంత కాలానికీ ఇంటికి తిరిగి రాకపోవటంతో రాజా రఘునాథరావు బెంగ పెట్టుకుంటాడు. తన ఆస్తిని నమ్మకమైన ముగ్గురు ట్రస్టీలు ఉద్దండం (వి రామచంద్రరావు), సుకుమారి (సూర్యకాంతం), బాజాలు (కెవి చలం), దివాన్ (రావికొండలరావు)కు అప్పగిస్తూ కుమార్ వివరాలు అందచేస్తాడు. కుమార్ ఆచూకీ తెలుసుకుని ఆస్తిని, చెల్లెలిని అప్పగించమని కోరతాడు. అలాగే దివాన్ కుమార్తె గీత (కాంచన)తో కుమార్‌కు వివాహం జరిపించమని కోరుతూ మరణిస్తాడు. రఘునాథరావు మరణించటంతో తానే రాజ్‌కుమార్ అంటూ ఆనంద్ (కృష్ణంరాజు), శేఖరం (కృష్ణ), భూషణం, అతని భార్య మోహిని (నాగభూషణం, రాధాకుమారి) బంగళాకు వస్తారు. వీరికితోడు భూపతి (నెల్లూరి కాంతారావు)అనే పెద్ద గుండా తన ముఠాతో ఆనంద్‌కు అండగా వుండి ఆస్తి కాజేయాలని కుట్రలు పన్నుతాడు. ఆ క్రమంలో కుమార్ (చంద్రమోహన్)ను బంధించటం జరుగుతుంది. దాంతో కథ పలు మలుపులు తిరిగి శేఖర్, భూషణం కారణంగా నిజం తెలుస్తుంది. అసలైన కుమార్ చంద్రమోహన్ అని, ఆస్తికి వారసుడుగా అతనిని నిర్ణయించటంతో చిత్రం సుఖాంతమవుతుంది[1].
పాటలు
[మార్చు]- అనుకున్నది ఒక్కటి
- నా మాట నమ్మితివేం.. కత్తి గుండెల్లో దిగబోదులే
- ఒకే ఒక గులాబిపై వాలిన తుమ్మెదలెన్నో - సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
- అంబవో శక్తి ఓ హోహో - ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్య, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
- ఓ చిన్నదాన నన్ను విడిచి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: కొసరాజు
- ఘుంతలకిడి గుమ్మా -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- చాలదా ఈ చోటు రాదులే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల- రచన: దాశరథి
- నువ్వే నువ్వే నన్ను చేరుకోవా - ఎస్.జానకి - రచన: సి.నా.రె
- భలే భలే నరసింహస్వామినిరా - ఎస్.పి.బాలు, కౌసల్య- రచన: అప్పలాచార్య
విశేషాలు
[మార్చు]ఈ చిత్రాన్ని నిర్మాత వాసూమీనన్, వాసు స్టూడియోస్ బేనర్‌పై, టి రామన్న దర్శకత్వంలో హిందీలో ‘వారిస్’ పేరుతో నిర్మించాడు. జితేంద్ర, హేమమాలిని జంటగా నటించగా, ప్రేమ్‌చోప్రా, తెలుగులో కృష్ణంరాజు పాత్రను ధరించారు. సంగీతం ఆర్‌డి బర్మన్ సమకూర్చిన ‘వారిస్’ హిందీ చిత్రం 12-12-1969న విడుదలై విజయం సాధించింది. 3 భాషల్లోనూ చిత్రం విజయవంతం కావటం కథాబలాన్ని స్పష్టం చేస్తుంది.