ఎస్.పి.కోదండపాణి
ఎస్.పి.కోదండపాణి | |
---|---|
జననం | శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి 1932 గుంటూరు |
మరణం | 1974 ఏప్రిల్ 5 |
వృత్తి | సంగీత దర్శకుడు |
ఎస్.పి.కోదండపాణి (1932 - 1974) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. వీరి పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి. వీరు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ వంటి కొన్ని పాటలు పాడారు కూడా.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించాడు. అతని బాల్యం గుంటూరులో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరిలోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నాడు. అద్దేపల్లి రామారావు చిత్రం నా ఇల్లులో బృందగానంలో మొదటి సారిగా 1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణామూర్తి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకుడిగాను పనిచేశాడు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి. మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగాడు.
హాస్యనటుడు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో కన్నకొడుకు చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయాడు.
పద్మనాభం చిత్రం శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ద్వారా ఇతను 1967లో ఈనాటి ఉత్తమ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను తెలుగు తెరకు పరిచయం చేశాడు.
చిరకాలం గుర్తుండే పాటలు
[మార్చు]- బొమ్మను చేసి ప్రాణం పోసి - దేవత
- ఇది మల్లెల వేళయనీ - సుఖదుఃఖాలు
- జగమే రామమయం - శ్రీరామకథ
- చుక్కలన్ని చూస్తున్నాయీ - జ్వాలాద్వీప రహస్యం
చిత్రాలు
[మార్చు]- గాంధీ పుట్టిన దేశం (1973)
- పండంటి కాపురం (1972) (సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
- తాతా మనవడు (1972)
- అదృష్ట దేవత (1972)
- బస్తీ బుల్ బుల్ (1971)
- కథానాయిక మొల్ల (1970)
- గోపాలుడు భూపాలుడు (1969)
- మంచి మిత్రులు (1969)
- శ్రీ రామ కథ (1969)
- పేదరాశి పెద్దమ్మ కథ (1968)
- నేనంటే నేనే (1968)
- భలే మొనగాడు (1968)
- అగ్గిమీద గుగ్గిలం (1968)
- మంచి కుటుంబం (1968)
- రణభేరి (1968)
- అపూర్వ పిరవైగళ్ (Apoorva Piravaigal) (1967)
- సత్యమే జయం (1967)
- శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
- మంచి కుటుంబం (1967)
- ఇద్దరు మొనగాళ్లు (1967)
- భూలోకంలో యమలోకం (1966)
- లోగుట్టు పెరుమాళ్ళకెరుక (1966)
- పొట్టి ప్లీడరు (1966)
- ఆటబొమ్మలు (1966)
- ఆకాశ రామన్న (1965)
- కథానాయకుని కథ (1965)
- పక్కలో బల్లెం (1965)
- దేవత (1965)
- జ్వాలాద్వీప రహస్యం (1965)
- కీలు బొమ్మలు (1965)
- తోటలో పిల్ల కోటలో రాణి (1964)
- బంగారు తిమ్మరాజు (1964)
- మంచి రోజులు వస్తాయి (1963)
- గురువును మించిన శిష్యుడు (1963)
- ఏకైక వీరుడు (1962)
- పదండి ముందుకు (1962)
- విప్లవ వీరుడు (1961) (తమిళం డబ్బింగ్)
- కన్నకొడుకు (1961)
- సంతానం (1955) (సహాయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
- నా ఇల్లు (1953) నేపథ్య గాయకుడు (కోరస్)
బయటి లింకులు
[మార్చు]- ఐ.ఎమ్.డి.బి.లో కోదండపాణి పేజీ.
- [ఛిమట మ్యూజిక్ వారి స్వర్ణయుగ సంగీత దర్శకులు]