పొట్టి ప్లీడరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొట్టిప్లీడరు
(1966 తెలుగు సినిమా)
POTTI PLEADARU.jpg
చందమామ లో చలన చిత్రప్రకటన
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం పద్మనాభం,
గీతాంజలి,
శోభన్‌బాబు,
వాణిశ్రీ,
చిత్తూరు నాగయ్య,
రమణారెడ్డి,
నిర్మలమ్మ,
వల్లూరి బాలకృష్ణ,
రావికొండలరావు,
ప్రభాకరరెడ్డి,
ముక్కామల కృష్ణమూర్తి,
పేకేటీ శివరాం,
వంగర వెంకటసుబ్బయ్య,
పెరుమాళ్ళు,
డి.రామానాయుడు
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నిర్మాణ సంస్థ రేఖా & మురళీ ఆర్ట్స్
భాష తెలుగు

పొట్టి ప్లీడరు మే 5,1966లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మనాభం, గీతాంజలి, శోభన్‌బాబు, వాణిశ్రీ, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, నిర్మలమ్మ, వల్లూరి బాలకృష్ణ, రావికొండలరావు, ప్రభాకరరెడ్డి, ముక్కామల కృష్ణమూర్తి, పేకేటి శివరాం, వంగర వెంకటసుబ్బయ్య, పెరుమాళ్ళు, డి.రామానాయుడు నటించగా, ఎస్.పి.కోదండపాణి సంగీతం అందించారు.

పొట్టి ప్లీడర్ సంక్షిప్త చిత్ర కథ[మార్చు]

ఈ సినిమాలో (ప్రసాద్) పద్మనాభం.అతను పటణంలో లా చదివి, పరీక్ష రాసి,తన సొంత వూరు తిరిగి వస్తాడు. కొన్ని రోజుల తరువాత లా పరీక్ష ఫలితాలు వస్తాయి. అందులో ప్రసాద్ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణుడు అవుతాడు.కొంత కాలం తరువాత తన తల్లి మరణిస్తుంది. దానితో ప్రసాద్ ఇల్లు, పొలం అమ్మేసి ఊళ్ళొ బాకీలన్ని తీర్చేసి, లాయరు ప్రాక్టీసు కోసం పట్టణంలో వాళ్ళ మావయ్య ఇంటికి వస్తాడు. ప్రసాద్ కి తన మావయ్య శాంతి (గీతాంజలి) కూతురు అంటే చాలా ఇష్టం. కాని శాంతి (గీతాంజలి) , వాళ్ళింట్లోనే అద్దెకుండే రామారావు (శోభన్ బాబు) ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన ప్రసాద్ ఎంతో బాధపడతాడు .కాని తరువాత బాగా ఆలోచించి, వాళ్ళిద్దరికి పెళ్ళి చేస్తాడు. ప్రసాద్ మరొక సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి, తానే సొంతంగా కేసులు వాదించే స్థానానికి వస్తాడు. చివరికి తన మరదలి భర్తే హత్య చెయ్యకుండా, చేసినట్టుగా ఆధారాలు లభిస్తాయి. కాని ప్రసాద్ హత్య చెయ్యలేదని నిరూపిస్తాడు. ఆ తరువాత లాయరు గా ప్రసాద్ ఆ పట్టణంలో ప్రసాద్ ప్రస్సిద్ధి పొదుంతాడు.ఎలా అభివృద్దిని సాధించాడో తెలిపేదే ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో సినిమా ప్రారంభానికి ముందు పేర్లు కాకుండా, సినిమాకి పని చేసిన వారిని స్వయంగా పరిచయం చేయడం నిజంగా చాలా బాగుంది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

దర్శకత్వం: కె.హేమాంబరధరరావు సంగీతం: ఎస్.పి.కోదండపాణి నిర్మాణ సంస్థ: రేఖా & మురళీ ఆర్ట్స్

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18. |access-date= requires |url= (help)