పేకేటి శివరాం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పేకేటి శివరాం
Peketi.jpg
పేకేటి శివరాం
జననం పేకేటి శివరామ సుబ్బారావు
అక్టోబరు 8, 1918
పేకేరు, పశ్చిమ గోదావరి జిల్లా
మరణం డిసెంబరు 30, 2006
చెన్నై, తమిళనాడు
వృత్తి నటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామి ప్రభావతి
పిల్లలు 4 కుమారులు ‍మరియు 4 కుమార్తెలు

పేకేటి శివరామ్ (పేకేటి శివరామ సుబ్బారావు) (అక్టోబరు 8, 1918 - డిసెంబరు 30, 2006) ప్రముఖ తెలుగు సినిమా నటుడు.

జననం[మార్చు]

ఈయన అక్టోబరు 8, 1918 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో జన్మించాడు. ఇతడు 1953లో కన్నతల్లి సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తెలుగు తమిళ, కన్నడ సినిమాల్లో ఆయన నటించాడు. దేవదాసు లోని పాత్ర ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాల సంఖ్య తక్కువే. నటుడిగానే కాక, ప్రొడక్షను మేనేజరుగా కూడా ఆయన పనిచేసాడు.

వీరికి నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు. ప్రముఖ కళా దర్శకుడు పేకేటి రంగా వీరి కుమారుడే.. తమిళ నటుడు ప్రశాంత్ వీరి మనుమడు.

మరణం[మార్చు]

పేకేటి 2006 డిసెంబర్ 30 తేదీన చెన్నైలో మరణించాడు.

చిత్ర సమాహారం[మార్చు]

ఇతడు నటించిన చిత్రాల పాక్షిక జాబితా:

సంవత్సరం సినిమా భాష ధరించిన పాత్ర
1953 కన్నతల్లి తెలుగు నటుడు
దేవదాసు తెలుగు భగవాన్ పాత్రధారి
గుమస్తా తెలుగు నటుడు
1954 రేచుక్క తెలుగు నటుడు
వద్దంటే డబ్బు తెలుగు నటుడు
1955 కన్యాశుల్కం తెలుగు పోలీసు పాత్రధారి
అనార్కలి తెలుగు నటుడు
1956 చిరంజీవులు తెలుగు నటుడు/రత్నం
ఏది నిజం తెలుగు నటుడు/అతిథి
1957 సువర్ణ సుందరి తెలుగు వసంతుడు పాత్రధారి
భాగ్యరేఖ తెలుగు నటుడు
పాండురంగ మహత్యం తెలుగు నటుడు
వీర కంకణం తెలుగు నటుడు
1958 పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు తేజం పాత్రధారి
1959 ఇల్లరికం తెలుగు నటుడు
జయభేరి తెలుగు నటుడు
1960 శ్రీ వెంకటేశ్వర మహత్యం తెలుగు నటుడు
1962 గులేబకావళి కథ తెలుగు నటుడు
1961 ఉషా పరిణయం తెలుగు నటుడు
1962 గాలిమేడలు తెలుగు అతిథి నటుడు
1964 బభ్రువాహన తెలుగు నటుడు
మురళీకృష్ణ తెలుగు నటుడు
వెలుగు నీడలు తెలుగు నటుడు
1967 చక్ర తీర్థ కన్నడం దర్శకుడు
1968 చుట్టరికాలు తెలుగు దర్శకత్వం
1969 పునర్జన్మ కన్నడం దర్శకుడు
భలే అబ్బాయిలు తెలుగు దర్శకత్వం
1971 కులగౌరవ కన్నడం దర్శకుడు
Bala Bandhana కన్నడం దర్శకుడు
1974 అల్లూరి సీతారామరాజు తెలుగు నటుడు- బ్రేకన్
1975 Dari Tappida Maga కన్నడం దర్శకుడు
1976 Sutrada Bombe కన్నడం దర్శకుడు
1978 Maathu Thappadha Maga కన్నడం దర్శకుడు

బయటి లింకులు[మార్చు]