Jump to content

గుమస్తా

వికీపీడియా నుండి
గుమస్తా
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.ఎమ్.కృష్ణస్వామి
నిర్మాణ సంస్థ అరుణ ఫిల్మ్స్
భాష తెలుగు

గుమాస్తా 1953లో విడుదలైన తెలుగు సినిమా. అరుణా పిక్చర్స్ పతాకం కింద వి.సి.సుబ్బరామన్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్.ఎం. కృష్ణస్వామి దర్శకత్వం వహించాడు. చిత్తూరు వి.నాగయ్య, రామశర్మ, పండరీబాయి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వి.నాగయ్య, జి.రామనాథం లు సంగీతాన్నందించాడు.[1] ఇది ఆత్రేయ రచించిన "ఎన్.జి.ఓ." అనే నాటిక ఆధారంగా నిర్మించబడినది.

తారాగణం

[మార్చు]
  • చిత్తూరు వి.నాగయ్య,
  • రామశర్మ,
  • శివరాం,
  • పండరీబాయి,
  • బి. జయమ్మ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • రచయిత: ఆచార్య ఆత్రేయ;
  • సినిమాటోగ్రాఫర్: ఆర్.ఎం. కృష్ణస్వామి;
  • స్వరకర్త: సి.ఎన్. పాండురంగం, చిత్తోర్ వి. నాగయ్య, G. రామనాథన్;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
  • దర్శకత్వం: ఆర్.ఎమ్.కృష్ణస్వామి
  • కథ, మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ
  • సంగీతం: వి.నాగయ్య, జి.రామనాథం
  • నృత్యం: మాథవన్, గోడ్ గాంకర్
  • ఫైట్స్: లోకనాథన్, పెరుమాళ్ రాజు
  • ఎడిటింగ్: పి.వి.మాణీక్యం బాల్
  • ఆపరేటివ్ కెమేరామన్: మధుసూధన్
  • నిర్మాత: వి.సి.సుబ్బరామన్

రంగనాధం గుమాస్తా. పెద్ద కుటుంబీకుడు. మంచం పట్టి పడున్న తండ్రి, చదువుకొంటూన్న తమ్ముడు గోపీ, పెళ్ళీడు మించిపోతున్న చెల్లెలు సుశీల, ఇద్దరు పసికందులు, ఇంత భారంలో సగం మోయటాని కొప్పుకొని నలుగుతూన్న భార్య సీత - ఇదీ ఆ సంసారం. మోటారు షెడ్లో కాపురం.

కాలేజీ జీతం కట్టలేదు – గోపీ పేరు కొట్టేశారు. ఇంట్లో పప్పుగింజ లేదు. ఈ సంబరంలో బంధువుల రాక, ఆ వచ్చే బంధువుల కొక అబ్బాయి వున్నాడు. సుశీలను చేసుకుంటా రేమో నని ముసలి తండ్రి వుబలాటం. బంధువులకోసం అప్పు చేసి సామాన్లు పట్రమ్మంటాడు రంగనాధం. మనకున్న పచ్చడి మెతుకులు పెడదా మంటాడు గోపీ. మర్యాదలూ, మొహ మాటాలు మా నేయ మంటాడు. అదెవ్వరికీ గిట్టదులు సరే తల తగి ళ్తే తెలుస్తుందంటాడు గోపీ, నాకిటిదాకా వచ్చిన బంధు వులు, గోపీ అప్పుల వాళ్ళతో దెబ్బలాటం చూచి, ఇంట్లోకి రాకుండానే వెళ్ళారు. పాలమనిషి. రంగనాధం ఆఫీసుకు వెళ్ళి అల్లరి చేసింది. రంగనాధం యింటికొచ్చి, అత్తమీద కోపం దు తమీద అన్నట్లు, పాపం జ యిల్లాలి మీద ఎగిరిపడ్డాడు.

పక్కింటి అబ్బాయి “రవి” కలిగినవాళ్ల గా రాబోవు బిడ్డ. అతనికి గుండె జబ్బుంది. 'షం. దుఃఖం ఏది అధిక మైనా గుండెనొప్పి వస్తుంది. డాక్టర్ పెళ్లి మానేయాలని. సలహా యిచ్చాడు. ఇది ఆ అబ్బాయికి తెలియదు. సుశీ

కొళాయి నీళ్ల కోసం రోజూ వస్తూంటే దూరాడు. మేమం చాడు. పెళ్లి చేసుకోంచే బ్రతక లేనని తన స్నేహితుడు "బ్రదర్ : ద్వారా తల్లికి తెలియజేశాడు. "పెళ్లి చేస్తే బ్రతకడు అన్నాడే "డాక్టర్ అన్నాడ్రి గురుమూర్తి. "తఁ. అంతా దాని ఆకృష్టం. డాక్టర్లు ఎన్నైనా చెప్తారు. ఆకృష్టముంటే అన్నీ "బాగవుతాయి" అన్నది తల్లి.

పెళ్లి సంబంధం కుదిరింది. అందరూ సంతోషించారు. సుశీల అదృష్టవంతురాలు అన్నారు.

సులకు అయితే నూచి చావాలని కళ్ళలో ప్రాణాలు నిలుపుకున్న ముసలి తండ్రి ముహూర్త పత్రిక సుచగానే పట్టరాని సంతోషంతో కళ్లుమూశాడు. అందరూ అదృష్టం అలాగుంది అన్నారు.

పెళ్లి వేటలమీద వున్నారు రవి మళ్ళీ గోపీ పరిగెత్తు కొచ్చి, రంగనాధాన్ని అవతిలో తీసుకువెళ్లాడు. “అన్నయ్యా! ఈ పెళ్లి ఆపేసెయ్, రవికి గుండె జబ్బందిట. పెళ్లి చేయ కూడదని చాక్టర్ చెప్పా. మనల్ని వాళ్లు మోసం "చేశారు" అన్నాడు. "ఎలా ఆవు కొముఠా, వీటలమీద పెళ్లి. శుభమా అంటూ ముహూర్తం పెట్టుకున్నా మో నాన్నపోయాడు. ఇప్పుడి పెళ్లి అప్పేస్తే ఇంకెవరన్నా దాన్ని చేసుకుంటారా?" అన్నాడు రంగు, ఈ మూఢనమ్మకాలతో మళ్ళీ బ్రతుకు నాశనం చేస్తామా?" అన్నాడు గోకి, లంకా దాని అదృష్టం" అన్నారు రంగ. గోలచేయుద్దని బ్రతిమా లాడు. గోపి వెల్లి అపేసేవాణి, కానీ సమయం మించిపోయింది.

పెళ్లి మండపానికి వెళ్లేలోగా మూడుముళ్లు పడిపోయినయ్. అందరితోపాటు అక్షతలు చల్లాడు తానూ.

పెళ్లి సంబరాలలో నవ్వి నవ్వి గుండె నొప్పి వచ్చి పడి పోయాడు రవి. కార్యం అవేశారు. ఇక్క మీదినుంచి కదల కూడదన్నాడు డాక్టరు. మళ్లీ అందరూ పిల్ల అదృష్టం అంతే అన్నారు.

రాత్రి అందరూ నిద్రపోతున్నారు. రవి నిద్రరాక లేచి బైటకొచ్చాడు. తన రాత తలచుకొని కన్నీరు కారుస్తున్న సుళీ కనిపించింది. కాస్సేపు కబుర్లు చెప్పుకొని ఎవరి గదిలోకి వాళ్ళు. వెళ్లారు. రవికక్కడ వండపట్టలేదు. సుళీ గదిలోకి వచ్చాడు. సుశీలను అంత దగ్గరగా చూట్టం అదే మొదటిసారి. ఆ వేశానికి లోవయ్యాడు. సుశీల ఎంత బ్రతిమాలినా వినలేదు రవి. ప్రొద్దున్నే గుండెజబ్బు అధికమై రవి చనిపోయాడు.

“ఆ పిల్ల అదృష్టం అంతే అన్నారు అందరూ,

కొడుకైనా కోడలైనా సుశీయే కదా అని యింట్లోనే వుంచుకున్నారు అలా చూను.

పెళ్లి ఖర్చులకని వెయ్యి రూపాయిలు. ఓ స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చాడు రంగనాధం. అదిగాక చిల్లర అప్పులు

కూడా అయినయి. స్నేహితుడికి విప్పిస్తానన్న గడువు దగ్గర కొస్తోంది. చిల్లర అప్పులవాళ్లు గోల చేస్తున్నారు. గుప్తాగారి ఇనౌకంటాక్సు కేసు కాగితాలు రంగనాధం దగ్గరకొచ్చాయి. ఈ విషయం తెలిసి శర్మద్వారా వెయ్యి రూపాయలు యిచ్చిపని నేను సర్దమన్నాడు. వద్దంటున్నా బల్ల మీద పెట్టి వెళ్లాడు నోట్ల కట్ట. సరిగ్గా ఆ సమయానికి స్నేహితుడొచ్చి డబ్బివ్వమని నిష్ఠూర పెట్టాడు. వేరే దారి దేశ ఆ నెయ్యి రూపాయలు యిచ్చేశాడు రంగనాధం. లందం క్రింద లెక్క కట్టవద్దనీ, డబ్బు లిప్పి యిచ్చేస్తానని, "కేసులో తానేమీ చేయలేడని ఖచ్చితంగా చెప్పాడు గుప్తాగారికి రంగ నాధం. గుప్తగారి 'కేను పోయింది. గుప్తాగారు రంగనాధం మీద రిపోర్టు చేశారు. ఫలితం పుద్యోగం వూడిపోయింది, ఇల్లు ఖాళీ చేయనున్నాడు గుప్తా, పిల్లా కాపురం పెట్టాడు రంగనాధం. సత్రంలో

సుశీ నెల తప్పింది. అత్తగారు మామగారు సుశీల గర్భం కావటానికి వీల్లేదన్నారు. యదార్థం చెప్పినా ఎవ్వరూ జమ్మ స్థితిలో లేదు. "పెళ్లి అయింది. ఆ రాత్రి మూసిన కన్ను "తెరవకుండా పడున్నాడు. ప్రొద్దున్నే పోయాడు. ఎలా సాధ్యం. ప్రశ్న సురగట్టి అన్న గారింటికి పంపేశారు.

రంగనాధం "లోకా న్నేలా నమ్మిస్తాం" అని తల బాదు కున్నారు. అన్నదమ్ము లెగ్గరికీ సం॥ విషయంగా అభిప్రాయ భేదాలేర్పడ్డాయి. సుశీలను తీసుకుని గోపీ వెళ్లిపోయాడు.

రంగనాధం కాలికి బలపాలు కట్టుకొని తిరిగాడు నౌకరీ కోసం, ఎక్కడ చూచినా అప్పులు. ఆదాయం లేదు. సీత వంటమనిషిగా చేరింది కాలం గడవటానికి, భర్త బాధపడతా డం అబద్ధాలు చెప్పి పనిలోకి వెళ్ళివస్తుంది.

ఆ నాడు వినాయక చవితి. పిల్లలు వినాయకుడి బొమ్మ కొనివ్వమని, పూజచేసుకోవాలని కోరు పెడుతున్నారు. నీత స్వరంలో మంచం పట్టింది. రంగనాధం తాను చిన్నప్పుడు, కట్టుకున్న గాలిమేడలు, ఆశలు నాముకు వేసుకుంటున్నాడు. పనిలోకి రాలేదు అని బంట్రోతును తరిదూరు యజమానులు సీత దగ్గిరకి. అప్పుడు తెలిసింది రంగ నాధానికి సీత వంటపని చేస్తూ యిన్నాళ్ళు గడిపిందని. యిక భరించ లేక పోయాడు. వినాయకుడి బొమ్మ నడిగే పిల్లల్ని తీసుకొని గబగబ ఎక్కడికో వెళ్లాడు. సీత విస్తుపోయి చూస్తూంది. కాస్సే పటికల్లా చెల్లిని నాన్న బావిలో వేసేశాడు" అని అరుస్తూ కుర్రాడు వచ్చాడు, నీతి గొలుమంది. పిల్లలను చంపిన నేరానికి రంగనాధానికి 14 ఏళ్ళ కఠినశిక్ష వేశారు. సీత కుర్రాణ్ణి వెంట పెట్టుకుని అవూరు వదలి వెళ్ళింది. మిల్లులో పని చేసుకుంటూ కుర్రాణ్ణి చదివిస్తూంది.

గోపి పూరగాయల వ్యాపారం పెట్టాడు. మెల్ల మెల్లగా పెద్దవాడవుతున్నాడు. వదినా వాళ్ళకోసం గాలిస్తున్నారు. సుశీ అడపిల్లను కని పెంచింది. పిల్లకు పెళ్ళి జొచ్చింది. రాణి కంకర్లకు ప్రేమల నా లేర్పడ్డాయి. తన బిడ్డ బ్రతుకూ తనలా ఎక్కడవుతుంది అన్న భయం బొద్దీ వెంటనే పెళ్ళి ఏర్పాట్లు చేసింది సుకీ. రంగనాధం విడుదలై వచ్చాడు. అందరూ పెళ్లి సంబరంలో వున్నారు.

"పెళ్ళికి రవి తల్లిదండ్రులు కూడా శంకర్ తల్లిదండ్రుల విలువునివాద వచ్చారు. సుశీలను చూసింది రవి తల్లి. అడ్డు పువడింది. పెళ్లికి నా అమ్మాయి కట్టుకున్న మొగుడికి పుట్టింది. బాగు" అని శంకర్ ఢిల్లీలో సుశీల కధ చెప్పింది. పీటలమీద పెళ్లి ఆ పోయింది. [2]



పాటల జాబితా

[మార్చు]

1.అయ్యగారి పెళ్ళానికి అన్ని కళలు తెలియాలి, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.ఏ.ఎం.రాజా, పి.లీల

2.ఆశలే అడియాసలై నడివేసవి, రచన: ఆత్రేయ, గానం.పి . లీల

3.ఓయీ పరుగెక్కడికోయీ ప్రపంచ , రచన: ఆత్రేయ, గానం.నాగయ్య

4.కూలేరా ధూళిగా మారేరా ఇదే , రచన: ఆత్రేయ, గానం.పి. సుశీల

5.డ్యాన్స్ బేబీ డ్యాన్స్ జీవితమొకటే , రచన: ఆత్రేయ, గానం.ఎ.ఎం.రాజా, పి.లీల

6.శంకరీ జగదీశ్వరీ గౌరీ దయాసాగరీ, రచన: ఆత్రేయ, గానం.ఎం.ఎల్.వసంతకుమారి

7.శోకాల లోకాల ఆకొన్న పాకలో, రచన: ఆత్రేయ

8 . షోకిలాడి అల్లునికి సూటూ బూటు కావాలా, రచన: ఆత్రేయ.

మూలాలు

[మార్చు]
  1. "Gumasta (1953)". Indiancine.ma. Retrieved 2023-01-18.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2023-01-18.

3.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గుమస్తా&oldid=4306167" నుండి వెలికితీశారు