Jump to content

సువర్ణసుందరి

వికీపీడియా నుండి
(సువర్ణ సుందరి నుండి దారిమార్పు చెందింది)
సువర్ణసుందరి
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీ దేవి,
రాజసులోచన ,
కాంచన,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రమణారెడ్డి,
రేలంగి,
సి.ఎస్.అర్.ఆంజనేయులు,
పేకేటి శివరాం,
గిరిజ
సంగీతం పి.ఆదినారాయణ రావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, జిక్కి
గీతరచన సముద్రాల రాఘవాచార్య
కొసరాజు
ఛాయాగ్రహణం ఎం.ఎ.రహమాన్
నిర్మాణ సంస్థ అంజలీ పిక్చర్స్
విడుదల తేదీ మే 10,1957
భాష తెలుగు

సువర్ణసుందరి, 1957లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత నటీమణి అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావు ఈ సినిమాను తమ స్వంత నిర్మాణ సంస్థ "అంజలీ పిక్చర్స్" పై నిర్మించారు. ఆదినారాయణరావు కూర్చిన సంగీతం ఈ సినిమా ఘన విజయానికి చాలా తోడ్పడింది. ముఖ్యంగా "హాయి హాయిగా ఆమని సాగే", "పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా" వంటి పాటలు ఎంతోకాలంగా సినిమా సంగీతాభిమానులను అలరించాయి.

చిత్రకథ

[మార్చు]

ఒకానొక అడవిలో విద్య పూర్తి చేసుకొని తన రాజ్యానికి వెళ్ళేందుకు సిద్దమైన రాకుమారుడు జయంత్ (అక్కినేని నాగేశ్వరరావు) కు తన ప్రేమించానని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతుంది గురువు కుమార్తె. ఆమె తనకు విద్యనొసగిన గురువు కుమార్తె అని ఆమెను సోదరిగానే భావించానని చెపుతాడు జయంతుడు. ఆమె ఉక్రోషంతో బట్తలు చించుకొని జుత్తు చెరుపుకొని అందరినీ పిలిచి అల్లరి చేస్తుంది. అతడు తనను మానభంగం చేసాడని చెపుతుంది. తనను పట్తబోయిన వాళ్ళను కొట్టి తప్పించుకు పారిపోతాడు జయంత్. గురువు విషయం తెలుసుకొని తన కుమార్తెను తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి అతడి కుమారుని శిక్షించమంటాడు. రాజు ధర్మానికి భద్దుడై తన కుమారుని పట్టి బంధించమని చెపుతాడు. మిత్రుడైన మంత్రి కుమారుని ద్వారా విషయం తెలిసి కొంతకాలం తరువాత నిజం తెలుస్తుందని తరువాత మెల్లగా రావచ్చని చెప్పిన అతడి మాటలతో అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి వెళ్ళి ఒక పల్లెలో ముగ్గురు ఆకతాయీల మటలతో ఒక రాక్షస గుహలోకి వెళతాడు. అక్కడ మానవ శిరస్సు, పాము శరీరం కల వ్యక్తితో తలపడి తరువాత అతడి శాప కథ విని అతడికి సహాయపడేమ్దుకు అక్కడే అగ్నిగుండములో దూకి ఆత్మార్పణ చేసుకొంటాడు. దానితో శపవిమోచనం అయిన ఆ వ్యక్తి దేవరూపం ధరించి జయంతుడికి ఎగిరే చాప, కోరిన ఆహారాన్ని ఇచ్చే కమండలం, ఎవరినైనా ధండిమ్చే ధండం బహుకరిస్తాడు.

సువర్ణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము

జయంతుణికి ఈ మూడు వస్తువులూ ఇవ్వడం చూసిన ఆకతాయిలు ముగ్గురూ అతడిని వెనుకపాటున కొట్టి చెరువు ఒడ్డున పడవేసి వస్తువులను తీసుకొనిపోతారు. తరువాత రాత్రికి అతడికి చెరువులోని నీటి వలన మెలకువ వస్తుంది. దానితో పాటు వాతావరణం హాయిగా మారి అక్కడకు ఆకాసం నుండి కొందరు దేవకన్యలు రావ్దం జరుగుతుంది. వారి మధ్య కల సుమ్దరిని చూసిన జయంతుడు అమెను ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా పొందాలని వారు విడిచిన దేవతా వస్త్రాల వద్ద కల ఆమె వస్త్రాన్ని పట్టుకొని సృహలేనివాడిగా నటిస్తాడు. వారు తిరిగి వెళ్ళాలనుకొన్నపుడు ఆమె తన వస్త్రాన్ని తీసికొనదానికి వచ్చి అతడిని చూస్తుంది. అతడిని విడిచి చెలులతో వెళ్ళుటకు మనస్కరించక అక్కడె ఆగిపోతుంది. వారిద్దరూ గాంధర్య పద్ధతిలో వివాహం చేసుకొంటారు. కొంతకాలం ఉన్న తరువాత ఆమె తను తిరిగి ఇంద్ర సభకు వెళ్ళలని చెప్పి అతడికి ఒక వేణువు ఇచ్చి దానిని వాయించినపుడు తాను వస్తానని చెప్పి వెళుతుంది.

సువర్ణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము

సువర్ణసుందరి ఇంద్రుని సభనందు నాట్యం చేయుచున్నపుడు జయంతుడు వేణువు ఊదటం వలన ఆమె రాలేక సభలో నాట్యం చేయలేక పడిపోతుంది. ఆమెను పరీక్షీంచిన ఇంద్రుడు ఆమె గర్భవతి అని తెలుసుకొంటాడు. దేవసభ నియమాలను తప్పినందుకు ఆమె మానవ కన్యగా మారిపోవాలని, ఆమె ఆమెను మరచిపోతాడని ఆమె భర్తను తాకిన మరుక్షణం అతడు శిలగా మారిపోతాడని శాపం ఇస్తాడు. మరుక్షణం ఆమె భూమిపై పడి అక్కడే ఒక బిడ్దను కంటుంది, తరువాత ఆమెని చెరబట్టాలని వెంబడించిన ఒకని నుండి పారిపోతూ బిడ్దడిని పోగొట్టుకొంటుంది. ఆ సందర్భంలో భర్త కనిపించినా అతడిని సమీపించుటకు భయపడుతుంది. ఆమె కొడుకు ఒక పసువుల కాపరి వద్ద పెరుగుతూ తన అమ్మానాన్నల గురించి అడుగుతాడు. అతడు చనిపోతూ అతని తలిదండ్రులను వెతకమని చెప్పి పోతాడు. బాలుడు వెతుకుతూ ఒక గుహలో కల పార్వతీ పరమేశ్వరుల ప్రతిమల వద్ద సృహ కోల్పోతాడు. పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై అతడిని లాలిస్తరు. తన తలిదండ్రుల గురించి అడిగిన అతడికి తామే అతని తలిదండ్రులమని చెపుతారు. ఒకానొక సందర్భంలో జయంతుడు, సువర్ణ సుందరి అక్కడ కలుసుకొంటారు. ఆ సందర్భంలో ఆమె జయంతుని ముట్టుకోవడంతో అతడు శీలలా మారిపోతాడు. అక్కడ ఉన్న బాలుడు పార్వతి పరమేశ్వరులను వేడినా రాకపోయే సరికి తల పగలగొట్టుకొను ప్రయత్నమున పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై అతడు వారి కుమారుడే అని తెలిపి ఇంద్రలోకమున కల కలువ తెచ్చి జయంతుని తలపై ఉంచితే శాపవిమోచనము జరుగుతుందని తెలియచేస్తారు. బాలుడు అది తెచ్చి తన తండ్రికి శాపవిమోచనము కావిస్తాడు. వారు తిరిగి తమ రాజ్యానికి వెళ్ళడంతో కథ సమాప్తం అవుతుంది.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
జగదీశ్వరా పాహి పరమేశ్వరా దేవాపుర సంహారా దీరా నటశేఖరా త్రాహి కరుణాకరా వాహి సురశేఖరా సముద్రాల పి.ఆదినారాయణరావు పి.సుశీల, బృందం
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా పలుచన సలుపకురా సముద్రాల పి.ఆదినారాయణరావు పి.సుశీల, బృందం
హాయి హాయిగా ఆమని సాగే సోయగాల గన ఓయీ సఖా హాయీ సఖా సముద్రాల పి.ఆదినారాయణరావు ఘంటసాల, జిక్కి
నీ నీడలోనా నిలిచేనురా నినుకొలిచేనురా, యువతీ మనోజా ఏనాటికైనా నీదానరా సముద్రాల పి.ఆదినారాయణరావు పి.సుశీల
  1. అమ్మా అమ్మా అమ్మా .. అమ్మా అమ్మా అని - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
  2. ఏరా మనతో గెల్చే ధీరుల్వెరురా రణశూరులెవ్వరురా - మాధవపెద్ది, పిఠాపురం
  3. కొమ్మనురా విరుల రెమ్మనురా నినుగన్న - పి.లీల, వేదాంతం రాఘవయ్య - రచన: సముద్రాల సీనియర్
  4. జగదీశ్వరా పాహి పరమేశ్వరా దేవా గిరిజావరా - జిక్కి బృందం* - రచన: సముద్రాల సీనియర్
  5. జగదీశ్వరా పాహి పరమేశ్వరా దేవా గిరిజావరా శశి - పి. సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
  6. ధిల్లాన ... ఈ వసుధలో నీకు సాటి దైవం - ఎ.పి. కోమల - రచన: సముద్రాల సీనియర్
  7. నా చిట్టి పాప నా కంటి పాప ననుగన్న - పి. సుశీల, ఎం. ఎస్. రామారావు - రచన: సముద్రాల సీనియర్
  8. నీ నీడలోన నిలిచేనురా నిను కొలిచేనురా యువతీమనోజా - పి. సుశీల - రచన: సముద్రాల సీనియర్
  9. పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ - పి. సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
  10. బంగారు వన్నెల రంగారు సంజా రంగేళి ఏతెంచెనే - పి.లీల బృందం - రచన: సముద్రాల సీనియర్
  11. బొమ్మాలమ్మా బొమ్మలు చూడండి బలే బొమ్మలు రండి - పి. సుశీల - రచన: సముద్రాల సీనియర్
  12. రారే వసంతుడు ఏతెంచె మళ్ళి ఈ రోజు పూబాల పెళ్ళి - ఎ.పి. కోమల బృందం
  13. లక్షీం క్షీరసముద్రరాజ తనాయాం శ్రీరంగధామేశ్వరీం (శ్లోకం) - ఘంటసాల
  14. శంభో నామొరా వినవా కరుణించరావా కాపాడలేవా - పి. సుశీల బృందం
  15. హాయి హాయిగా ఆమని సాగె సోయగాల గనఊగే - జిక్కి, ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006