సూర్యకళ
సూర్యకళ(01జనవరి1942_30జూన్2014) పాతతరం చలన చిత్ర నటీమణులలో సూర్యకళ ఒకరు. రామిరెడ్డి, సుభద్రల దంపతులకు కాకినాడలో జన్మించారు. బాల్యం నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందారు. సినీరంగంపై ఆసక్తితో చెన్నై చేరుకున్న సూర్యకళ ‘నా చెల్లెలు’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటిగా మంచి గుర్తింపు పొందారామె. ఏయన్నార్, అంజలీ దేవి నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించారు. ‘బాల నాగమ్మ’లో ను,'ఉషాపరిణయం' లోను ముఖ్య పాత్రలు పోషించి మంచిపేరు తెచ్చుకున్నారు. తమిళంలో శివాజీగణేశన్ నటించిన ‘అందనాళ్’ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు. సూర్యకళ మొత్తం 500 చిత్రాలకు పైగా నటించారు సూర్యకళ.
సూర్యకళ తమిళ చిత్రం అన్బు ఎంగేతో తారాపథంలోకి వచ్చింది. కె.బాలాజీ, పండరీ బాయి, దేవిక, ఎస్.ఎస్.రాజేంద్రన్ నటించిన ఈ సినిమాలో సూర్యకళపై చిత్రించిన మిన్నల్ పూచ్చి జాకెట్ అన్న పాట ప్రసిద్ధి చెందింది. అయితే సూర్యకళ సినీరంగంలో అగ్రస్థాయికి చేరుకోలేక పోయింది. ఆ తరువాత కనుమరుగై చిన్నాచితకా వేషాలు వేసింది.తరువాత తమిళ సీరియల్స్ లోను ఆమె నటించారు.[1]
మరణం
[మార్చు]ఈవిడ చెన్నై నుంగంబాక్కంలోని వల్లువర్కోట్టం కాలనీలో నివసించే వారు. ఆమె భర్త సెల్వరాజ్ కొన్నేళ్ల క్రితమే మరణించారు. వీరికి పద్మశ్రీ అనే కూతురు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడి కె.సూర్యకళ (72) 2014, జూన్ 30 సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో చెన్నై లో కన్నుమూశారు. [2]
చిత్ర సమాహారం
[మార్చు]తెలుగు చిత్రాలు
[మార్చు]- నా చెల్లెలు 1953
- జాతక ఫలం 1954
- భక్త మార్కండేయ 1956
- శ్రీగౌరీ మహాత్మ్యం 1956
- భలే అమ్మాయిలు 1957లో రాధమ్మ
- సతీ సావిత్రి 1957
- వినాయక చవితి 1957
- సువర్ణసుందరి 1957
- ఎం.ఎల్.ఏ. 1957
- శ్రీకృష్ణమాయ 1958 లో సత్యభామ
- శ్రీకృష్ణ గారడి 1958
- రేణుకాదేవి మహాత్మ్యం 1960 అతిథి పాత్ర
- ఉషాపరిణయం 1961లో చిత్రలేఖ
- మంచి మనసులు 1962 లో మల్లిక
- శ్రీ సత్యనారాయణ మహత్మ్యం 1964
- జ్వాలాద్వీప రహస్యం 1965
- శ్రీమతి 1966
- రక్త సిందూరం 1967
- వీరాంజనేయ 1968
- దేవదాసు 1974
- మల్లెపువ్వు(1978)
- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం 1991
- చంటి 1992 అతిథి పాత్ర