Jump to content

నా చెల్లెలు

వికీపీడియా నుండి
నా చెల్లెలు
(1953 తెలుగు సినిమా)

చందమామ పత్రికలో నా చెల్లెలు ప్రకటన
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం జి. వరలక్ష్మి,
సూర్యకళ,
రామశర్మ,
అమరనాధ్,
బలిజేపల్లి
నిర్మాణ సంస్థ అశోక్ పిక్చర్స్
భాష తెలుగు

నా చెల్లెలు, 1953లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తమిళంలో బాగా విజయనంతమైన "ఎన్ తంగై" అనే సినిమాను "నా చెల్లెలు" పేరుతో తెలుగులోకి అనువదించారు. రేవతి స్టూడియోస్‌లో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ఇందులో ఆదర్శవంతురాలైన గృహిణిగా వరలక్ష్మి, ఆమెకు కోపదారి భర్తగా రామశర్మ, అతని తమ్ముడుగా అమరనాధ్ నటించారు. కవితా కళానిధి బలిజేపల్లి కూడా ఈ సినిమాలో ఒక వేషం వేశాడు.[1]

అశోక్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. సి.ఎన్. పాండురంగం సంగీతాన్నందించాడు.[2]

తారాగణం

[మార్చు]
  • జి. వరలక్ష్మి
  • సూర్య కాళ
  • అనసూయ
  • కోటిరత్నం
  • బలిజేపల్లి
  • అమర్‌నాథ్
  • రామశర్మ
  • చలం
  • పండితారావు
  • గణపతి భట్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
  • స్టూడియో: అశోక పిక్చర్స్
  • ఛాయాగ్రాహకుడు: బి.ఎస్. రంగా
  • కూర్పు: చిత్రపు నారాయణ మూర్తి
  • స్వరకర్త: సి.ఎన్. పాండురంగం
  • విడుదల తేదీ: జనవరి 29, 1953

మూలాలు

[మార్చు]
  1. రూపవాణిలో వార్త[permanent dead link]
  2. "Naa Chellelu (1953)". Indiancine.ma. Retrieved 2020-08-25.

బాహ్య లంకెలు

[మార్చు]