Jump to content

గాలిమేడలు

వికీపీడియా నుండి
గాలిమేడలు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఆర్.పంతులు
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
ఎస్.వి. రంగారావు,
జగ్గయ్య
సంగీతం టి.జి.లింగప్ప
నిర్మాణ సంస్థ పద్మిని పిక్చర్స్
భాష తెలుగు

గాలిమేడలు బి.ఆర్.పంతులు దర్శకత్వంలో 1962, ఫిబ్రవరి 9న విడుదలైన తెలుగు సినిమా. ఇదే సినిమాను గాలిగోపుర పేరుతో రాజ్‌కుమార్, లీలావతి జంటగా కన్నడభాషలో ఇదే నిర్మాణసంస్థ తెలుగుతో పాటు ఏకకాలంలో నిర్మించింది.

పాత్రలు

[మార్చు]
పాత్రధారి పాత్ర
ఎన్.టి.రామారావు కృష్ణుడు
దేవిక లక్ష్మి
ఎస్.వి.రంగారావు పానకాల స్వామి
ఎమ్.వి.రాజమ్మ శాంతమ్మ
వి.నాగయ్య రంగనాథం
కె.జగ్గయ్య మోహన్
జయంతి నిమ్మి
రాజనాల సింహాచలం
రమాదేవి వెంకాయమ్మ
బి.విశ్వనాథం నాగయ్య
రమణారెడ్డి ఫ్లాట్‌ఫారం
సురభి బాలసరస్వతి కనకం
పేకేటి శివరాం అతిథి నటుడు
రాజేశ్వరి

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు, నిర్మాత: బి.ఆర్.పంతులు
  • మాటలు: డి.వి.నరసరాజు
  • పాటలు: సముద్రాల, కొసరాజు, ఆదిశేషారెడ్డి, రామ్‌చంద్
  • సంగీతం: టి.జి.లింగప్ప
  • ఛాయాగ్రహణం:డబ్ల్యూ.ఆర్.సుబ్బారావు
  • శబ్దగ్రహణం: పి.వి.కోటేశ్వరరావు

ఒకానొక గ్రామంలో రంగనాథం, పానకాలస్వామి అనే మిత్రద్వయం ఉంటుంది. రంగనాథం క్షయవ్యాధితో బాధపడుతుంటాడు. చికిత్సకై ఆసుపత్రిలో చేరుతూ తల్లిలేని తన కుమారుని జాగ్రత్తగా పెంచి పెద్దవాణ్ణి చేయవలసిందిగా కోరుతాడు. అందుకోసం పదివేల రూపాయలు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకుని చౌకగా భూములు కొనుక్కుని వ్యవసాయం చేయాలనే ఆశతో పానకాల స్వామి రంగూన్ వెడుతున్నానని ఓ పెద్ద్ అబద్ధంచెప్పి తెలంగాణాకు పోయి కొంత భూమి కొని కొంత కౌలుకు తీసుకొంటాడు. పెద్ద మోతుబరి రైతు అవుతాడు పానకాలస్వామి. సంతానం లేని పానకాలస్వామికి ఓ పిల్లవాడు కూడా జన్మించాడు. తాను పెంచిన కృష్ణుణ్ణి వ్యవసాయంలో పెట్టి కన్నకొడుకు మోహన్‌ను హైదరాబాదులో చదువు చెప్పిస్తూ వచ్చాడు. చదువు సంధ్యలు లేకున్నా కృష్ణుడు బుద్ధిమంతుడు. చదువుకుంటున్న మోహన్ తాను లక్షాధికారిఅని నాటకమాడి ఓ జమీందారు కుమార్తె నిర్మలను వలలో వేసుకుంటాడు. గ్రామంలో నాగన్న అనే రైతు తన కూతురు లక్ష్మిని మోహన్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. దానికేం భాగ్యమని పానకాలస్వామి నాగన్న దగ్గర మోహన్ చదువుకోసమని రెండువేలు గుంజుతాడు. అయితే లక్ష్మి కృష్ణులు అంతకు ముందే ప్రేమించుకున్న సంగతి తెలిసిన పానకాలస్వామి కృష్ణుడిని ఇంటినుండి వెళ్ళగొడతాడు. అదే సమయంలో జమీందారు కుమార్తెతో ఆ గ్రామానికి భూముల వ్యవహారాలు చూసుకోవడానికి వస్తాడు. ఆ సమయంలో వారితో పాటు మోహన్ కూడా ఉండడం చూసి, మోహన్ వేసిన ఎత్తుగడకు ఆనందించిన పానకాలస్వామి నాగన్న బెడద వదిలించుకునేందుకు పథకం వేస్తాడు. కృష్ణుని అన్వేషణకై లక్ష్మిని హైదరాబాదుకు పంపిస్తాడు. జమీందారు ఆస్తినంతా కాజేయాలనే ఆశతో తన ఆస్తిని అరవై వేలకు అమ్మివేసి ఆడబ్బును ఖర్చుపెట్టి నిమ్మి,మోహన్‌ల పెళ్లి జరిపిస్తాడు. కుమార్తె లక్ష్మిని వెదుకుకుంటూ వచ్చిన నాగన్న మోహన్ ఎవరైనదీ జమీందారుకు వెల్లడిస్తాడు. జమీందారు ఆగ్రహోదగ్రుడై పానకాల స్వామిని, ఆయన భార్య శాంతమ్మను ఇంటినుండి వెళ్ళగొట్టి త్రోసివేస్తాడు. ఆ ఘర్షణలో పానకాలస్వామి మేడమీద నుండి క్రిందపడి కాలువిరుగ కొట్టుకుంటాడు. ఆస్తి అంతా పోయి బూట్ పాలిషింగ్ వృత్తిగా చేసుకుంటాడు. ఆసుపత్రిలో రోగ విముక్తి పొంది వచ్చిన రంగనాథం పానకాలస్వామి రంగూన్ వెళ్ళినట్లు తెలుసుకుని అక్కడకు వెళ్ళి వ్యాపారంలో లక్షలు గడించి తిరిగి స్వదేశానికి వచ్చి హైదరాబాదులో స్థిరపడతాడు. ఒక సందర్భంలో కృష్ణుని మంచితనాన్ని గ్రహించి తనకు నౌకరుగా పెట్టుకుంటాడు. కన్నకొడుకుని పోగొట్టుకొన్న విచారం తగ్గటం కోసం ఒక అనాథశరణాలయాన్ని కట్టించడంలో రంగనాథం కృష్ణున్నే మేస్త్రీగా నియమిస్తాడు. అక్కడికే పనికోసం వచ్చిన శాంతమ్మను కృష్ణుడు గుర్తిస్తాడు. రంగనాథం సంగతి తెలుసుకున్న మోహన్ తనే అతని కొడుకు అని నాటకమాడబోతాడు. రంగనాథం ఇంటికి వస్తాడు. కృష్ణుడు ఇక మోహన్ దౌష్ట్యం సహించలేక అక్కడి నుండి వెళ్ళిపొమ్మని హెచ్చరిస్తాడు. తెల్లవారగానే వెళ్లిపోతానని చెప్పిన మోహన్ రంగనాథం డబ్బును ఎత్తుకుపోవడానికి చేసిన ప్రయత్నం తుది క్షణంలో రంగనాథం మేలుకోవడంతో విఫలమౌతుంది. కృష్ణుడు మోహన్ కలబడి కొట్టుకొంటున్న సమయంలో శాంతమ్మ, పానకాలస్వామి, లక్ష్మి అక్కడకు రావడంతో రంగనాథం కృష్ణుడు తన కొడుకే అని గ్రహిస్తాడు. లక్ష్మి కృష్ణుల పెళ్లితో కథ సుఖాంతమవుతుంది[1].

పాటలు

[మార్చు]
  1. ఆశే విరిసే మనసే తనిసే నవజీవనమే ఫలియించెనులే - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
  2. ఈ మూగ చూపేలా బావా మాటడగా నేరవా - రేణుక, ఘంటసాల . రచన: సముద్రాల.
  3. ఓ రాయుడో జానపదాలు వేసుకుంటు ఈలపాట పాడుకుంటు - మాధవపెద్ది, ఎస్. జానకి బృందం, రచన: ఆదిశేషారెడ్డి
  4. కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా నిన్ను కన్నకొడుకు - జె.వి.రాఘవులు, రచన: ఆదిశేషారెడ్డీ
  5. టీ షాపులోని పిల్లా షోకైన కొంటెపిల్లా ఈ కొంటెచూపులు - పిఠాపురం, కె. రాణి , రచన:కొసరాజు
  6. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో - ఘంటసాల . రచన:సముద్రాల
  7. మంచి మాటేరా రారా చెలియ మనసు తెలుసుకోరా పిలుపు వినరారా - రేణుక, రచన: శ్రీరామ్ చంద్
  8. నవరాగాలు పాడింది ఏలా మది నాట్యాలు ఆడింది చాలా - పి.బి.శ్రీనివాస్, సుశీల, రచన: శ్రీరామ్ చంద్.
  9. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము (బిట్),రాజనాల, రచన: రామదాసు కీర్తన.

మూలాలు

[మార్చు]
  1. రాధాకృష్ణ (18 February 1962). "గాలిమేడలు చిత్రసమీక్ష". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 14 నవంబరు 2020. Retrieved 20 February 2020.

బయటి లింకులు

[మార్చు]