ఉషాపరిణయం (సినిమా)
(ఉషా పరిణయం నుండి దారిమార్పు చెందింది)
ఉషాపరిణయం (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
---|---|
నిర్మాణం | కె.బి.నాగభూషణం |
తారాగణం | తాడేపల్లి కాంతారావు, జమున, ఎస్.వి. రంగారావు, కన్నాంబ, కల్యాణం రఘురామయ్య, రాజనాల కాళేశ్వరరావు పి.సూరిబాబు |
సంగీతం | ఎస్. హనుమంతరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సూరిబాబు, కళ్యాణం రఘురామయ్య, కె.జమునారాణి, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, పి.బి.శ్రీనివాస్, పి.లీల |
గీతరచన | సదాశివబ్రహ్మం, సముద్రాల |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజ రాజేశ్వరీ ఫిలిం కంపెనీ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఉషాపరిణయం (Usha Parinayam) 1961 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకం మీద కడారు నాగభూషణం, కన్నాంబ దర్శక నిర్మాత, నటులుగా నిర్మించిన పౌరాణిక చిత్రం.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]పాత్ర | నటీనటులు |
---|---|
అనిరుద్ధుడు | తాడేపల్లి కాంతారావు |
ఉష | జమున |
బాణాసురుడు | ఎస్.వి. రంగారావు |
బాణాసురుని భార్య | కన్నాంబ |
కృష్ణుడు | కళ్యాణం రఘురామయ్య |
నారదుడు | పి.సూరిబాబు |
శివుడు | రాజనాల కాళేశ్వరరావు |
కోలాహలం | రేలంగి వెంకట్రామయ్య |
ఇంద్రుడు | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
రాజగురువు | ముక్కామల కృష్ణమూర్తి |
పేకేటి శివరాం |
పాటలు
[మార్చు]ఈ సినిమాలో 23 పాటలు, పద్యాలు ఉన్నాయి.
- అదిగో మనప్రేమ చెలువారు సీమ - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి
- అందాలు చిందేటి ఈ వనసీమలో ఆనందడోలల ఊగెదమా - కె.జమునారాణి బృందం
- ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం) - పి. సూరిబాబు
- ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో - పిఠాపురం నాగేశ్వరరావు,?
- కరునారసభరితా సరసజలోచన జననీ జగదంబా - పి. లీల
- జయజయ శ్రీ రాజరాజేశ్వరి మము దయజూడుమా నిను సేవింతుమో - కె. జమునారాణి
- జయ మహదేవా శంభో గిరిజారమణా శివపరాత్పరా - మాధవపెద్ది సత్యం, పి. లీల బృందం
- నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం) - కె. రఘురామయ్య
- నిన్నే వలచితినోయి ఓ బావా నిన్నే పిలిచితినోయి - కె.జమునారాణి
- న్యాయమిదేనా చంద్రుడా నీ న్యాయమిదేనా అసహాయను నను - పి.సుశీల
- పాలాక్షుండు మహోగ్రమూర్తి (పద్యం) - మాధవపెద్ది సత్యం
- బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం ) - పి. సూరిబాబు
- బ్రతికి ఫలంబేమి ఏకాకినై ఇటుపై ఎడబాటులాయే - పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి
- మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు) - పి.సూరిబాబు, మాధవపెద్ది సత్యం
- మన ప్రేమగాధ అమరకథ అనుపమై నిలచి - ఘంటసాల, పి. లీల, రచన: సదాశివ బ్రహ్మం
- సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా - పి. సూరిబాబు
- శుభోదయమున సమాగమంది మనొఙ్ఞరూపా మమ్మేలరా - కె. జమునారాణి బృందం
- శ్రీమన్ మహాదేవ దేవ పరంజ్యోతి (దండకం) - మాధవపెద్ది సత్యం
- నను బ్రోవ రావేల నా స్వామి , కె.జమునా రాణి
- భక్తి పాశంబు కడు బలవత్తరంబు హరిహారులకైన (పద్యం), కె.రఘురామయ్య
- సురులు మునివరులైన నిను తెలియగలరా కృష్ణా, పి.సూరిబాబు
- వందే శంభుo ఉమాపతిo సురగురుం వందే జగత్కారణం (పద్యం),మాధవపెద్ది
- నీకున్ బుత్రుడు నాకు పౌత్రుడు గదా(పద్యం), కె.రఘురామయ్య .
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)