కాంతా రావు (నటుడు)

వికీపీడియా నుండి
(తాడేపల్లి కాంతారావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాంతారావు
తాడేపల్లి లక్ష్మీ కాంతారావు
జననం
తాడేపల్లి లక్ష్మీకాంతా రావు

(1923-11-16)1923 నవంబరు 16
మరణం2009 మార్చి 22(2009-03-22) (వయసు 85)
మరణ కారణంక్యాన్సర్
ఇతర పేర్లునట ప్రపూర్ణ,
కత్తుల కాంతారావు,
ఆంధ్రా ఎం.జి.ఆర్
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు1950 - 1990
జీవిత భాగస్వామిసుశీల, హైమవతి[1]
పిల్లలునలుగురు మగపిల్లలు ప్రతాప్, కేశవ, రాజా, సత్యం - ఒక కూతురు సుశీల
తల్లిదండ్రులు
  • కేశవరావు (తండ్రి)
  • సీతారామమ్మ (తల్లి)
పురస్కారాలురఘుపతి వెంకయ్య అవార్డు,
రాష్ట్రపతి అవార్డు,
నంది అవార్డు

కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (1923 నవంబరు 16 - 2009 మార్చి 22) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత.[2][3]

జననం

[మార్చు]

కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామములో జన్మించాడు.[4]

సినీ ప్రస్థానం

[మార్చు]

తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.[5] ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు". ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".

కాంతారావు కుమారుడు రాజా, సుడిగుండాలు సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.[6]

చిత్ర సమాహారం

[మార్చు]

నటుడిగా

[మార్చు]
సం చిత్రం పాత్ర దర్శకులు వివరాలు
2004 మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
2003 కబీర్‌దాస్ వీ. వీ. రాజు
1999 పోస్ట్‌మ్యాన్ ముప్పలనేని శివ
1994 ముగ్గురు మొనగాళ్లు కె. రాఘవేంద్రరావు
1991 అల్లుడు దిద్దిన కాపురం ఘట్టమనేని కృష్ణ
1989 ముత్యమంత ముద్దు రవిరాజా పినిశెట్టి
1986 ప్యార్ కా సిందూర్ బాపు హిందీ చిత్రం
శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం శ్యామ కె. వాసు
1985 విజేత వెంకయ్య ఎ. కొదండరామిరెడ్డి
1981 ఊరికిచ్చిన మాట మన్నవ బాలయ్య
రాధాకళ్యాణం బాపు
సతీ సావిత్రి పి. సుబ్బారావు
1980 కాళి ఐ. వి. శశి
వంశవృక్షం బాపు
చండీప్రియ వి. మధుసూదన రావు
సరదా రాముడు రాజా రావు కె. వాసు
1979 మా ఊరి దేవత వేజెళ్ళ సత్యనారాయణ
యుగంధర్ కె.ఎస్.ఆర్.దాస్
1978 మన ఊరి పాండవులు ధర్మయ్య బాపు
సొమ్మొకడిది సోకొకడిది కె.బాలచందర్
1977 అందమె ఆనందం సింగీతం శ్రీనివాసరావు
1976 సీతా స్వయంవర్ బాపు హిందీ చిత్రం
శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ బాపు, చక్రపాణి
1975 అలఖ్ నిరంజన్ బాబుభాయ్ మిస్త్రి హిందీ చిత్రం
ఇల్లు - వాకిలి పి.డి.ప్రసాద్
గుణవంతుడు ఆదుర్తి సుబ్బారావు
ముత్యాల ముగ్గు రాజా రావుబహద్దుర్ బాపు
యమగోల ఇంద్రుడు తాతినేని రామారావు
1974 అల్లూరి సీతారామరాజు పడాలు వి.రామచంద్రరావు
దేవదాసు విజయనిర్మల
శ్రీ రామాంజనేయ యుద్ధం నారదుడు బాపు
1973 దేవుడు చేసిన మనుషులు వి. రామచంద్రరావు
నేరము శిక్ష రాజశేఖరం కె.విశ్వనాధ్
1972 బాల భారతం పాండు రాజు కమలాకర కామేశ్వరరావు
1971 శ్రీ కృష్ణ సత్య నారదుడు కదిరి వెంకట రెడ్డి
1969 ఏకవీర వీరభూపతి చిత్తజల్లు శ్రీనివాసరావు
గండర గండడు కె.ఎస్.ఆర్.దాస్
సప్తస్వరాలు వేదాంతం రాఘవయ్య
1968 బంగారు గాజులు చిత్తజల్లు శ్రీనివాసరావు
రాజయోగం కె.ఎస్.ఆర్.దాస్
రణభేరి గిడుతూరి సూర్యం
1967 చిక్కడు దొరకడు దొరకడు బి.విఠలాచార్య
రహస్యం వేదాంతం రాఘవయ్య
1966 పల్నాటి యుద్ధం అలరాజు గుత్తా రామినీడు
శ్రీకృష్ణ పాండవీయం నారదుడు నందమూరి తారక రామారావు
శ్రీకృష్ణ తులాభారం నారదుడు కమలాకర కామేశ్వరరావు
1965 పాండవ వనవాసం శ్రీకృష్ణుడు కమలాకర కామేశ్వరరావు
1964 బబ్రువాహన శ్రీకృష్ణుడు సముద్రాల రాఘవాచార్య
1963 నర్తనశాల శ్రీకృష్ణుడు కమలాకర కామేశ్వరరావు
లవకుశ లక్ష్మణుడు సి.పుల్లయ్య, చిత్తజల్లు శ్రీనివాసరావు
వాల్మీకి చిత్తజల్లు శ్రీనివాసరావు
శ్రీకృష్ణార్జున యుద్ధము నారదుడు కె.వి.రెడ్డి
ఎదురీత వైద్యుడు బి.ఎస్. నారాయణ
1962 రక్త సంబంధం ఆనంద్ వి.మధుసూదన్ రావు
భీష్మ శాల్వుడు బి.ఎ.సుబ్బారావు
1961 సీతారామ కళ్యాణం నారదుడు నందమూరి తారక రామారావు
శభాష్ రాజా పి.ఎస్.రామకృష్ణారావు
బికారి రాముడు రాముడు, మోహన్ పాలగుమ్మి పద్మరాజు
ఉషా పరిణయం అనిరుద్ధుడు కె.బి.నాగభూషణం
1960 భట్టి విక్రమార్క భట్టి జంపన చంద్రశేఖరరావు
చివరకు మిగిలేది భాస్కర్ గుత్తా రామినీడు
దీపావళి నారదుడు రజనీకాంత్ సబ్నవిస్
మాంగల్యం బి.ఎస్. నారాయణ
సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి ఎస్.డి.లాల్
శాంతి నివాసం చిత్తజల్లు శ్రీనివాసరావు
1955 జయసింహ జయసింహుడు డి.యోగానంద్
1953 ప్రతిజ్ఞ ప్రతాప్ హెచ్.ఎం.రెడ్డి
1951 నిర్దోషి హెచ్.ఎం.రెడ్డి

నిర్మాతగా

[మార్చు]

మరణం

[మార్చు]

కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులోని యశోద హాస్పిటల్లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు.

శత జయంతి

[మార్చు]

కాంతారావు శతజయంతి సందర్భంగా 2022, నవంబరు 16న ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించాడు.[7] తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ర‌వీంద్ర భార‌తిలోని పైడి జ‌య‌రాజ్ ప్రివ్యూ థియేట‌ర్‌లో కాంతారావు శ‌త జ‌యంతోత్స‌వం నిర్వ‌హించబడింది. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కాంతారావు కుమారుడు రాజా పాల్గొని కాంతారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం, కాంతారావు నటించిన 'రణభేరి' సినిమా ప్రదర్శన జరిగింది.[8]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 November 2014). "ఆ మూడు కోరికలూ తీరకుండానే వెళ్లిపోయారు!". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
  2. Sakshi (19 February 2020). "కత్తిలా బతికి వెళ్లిపోయారు..." Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  3. "సుతిమెత్తని కత్తి హీరో!". 22 December 2019. Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
  4. http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html
  5. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009
  6. "మన జానపద కథానాయకుడు". 14 November 2015. Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
  7. telugu, NT News (2022-11-17). "కాంతారావుకు సీఎం నివాళి". www.ntnews.com. Archived from the original on 2022-11-17. Retrieved 2022-11-17.
  8. telugu, NT News (2022-11-16). "ఘనంగా సినీ నటుడు కాంతారావు శత జయంతోత్సవం". www.ntnews.com. Archived from the original on 2022-11-16. Retrieved 2022-11-17.

బయటి లింకులు

[మార్చు]