ప్రేమజీవులు
ప్రేమజీవులు (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాణం | జి.రామం చంద్రశేఖర్ |
తారాగణం | ఘట్టమనేని కృష్ణ, కాంతారావు, రాజశ్రీ |
సంగీతం | విజయా కృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | సంజీవి ఫిలిమ్స్ |
భాష | తెలుగు |
ప్రేమజీవులు 1971లో మార్చి 5 విడుదలైన తెలుగు సినిమా. 1967లో కె.ఎస్.సేతుమాధవన్ దర్శకత్వంలో ప్రేమ్ నజీర్, జయభారతి ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ చిత్రం నాదన్ పెణ్ణు ఈ సినిమాకు మూలం.
కథ
[మార్చు]ఒక కుగ్రామంలో ముగ్గురిమధ్య నడిచిన ఉదాత్తమైన ప్రేమ కథే ఈ ప్రేమజీవులు. అంధుడైన ముత్తయ్యను కూతురు బేబి పోషిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఆ ఊళ్లో ఉంటున్న చుట్టలకొట్టు భీమన్న బేబి రూపలావణ్యాలవైపు ఆకర్షితుడై ఆమెను ప్రేమిస్తాడు. ఆ వూరి తాళ్ళ సొసైటీకి సెక్రెటరీగా కొత్తగా వచ్చిన బాబును బేబి ప్రేమిస్తుంది. బాబు కూడా ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ఒక రోజు భీమన్నకు వీరిరువురి సంగతి తెలిసి నిరాశ పడతాడు. కాని ముత్తయ్య తన కూతురు బేబిని భీమన్నకే ఇచ్చి పెళ్ళి చేస్తాననడంతో భీమన్న మనసులో తిరిగి బేబి పట్ల ఆశ చిగురుస్తుంది. పెళ్ళి ఏర్పాట్లన్నీ పూర్తి అవుతాయి. భీమన్న కొత్త సంసారానికి కావలసిన ఏర్పాట్లతో ఇంటిని తీర్చిదిద్దుకుంటాడు. బేబి కోసం తన మతం కూడా మార్చుకుంటాడు. తీరా చర్చిలో పెళ్ళికి వెళ్లేసరికి అక్కడ ఫాదర్‌కు తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని బేబి చెబ్తుంది. ఈ సంఘటనకు ముందుగానే బాబు బేబితో వివాహానికి తన తల్లిదండ్రులను ఒప్పించడానికి ఊరువెళతాడు. అతని తల్లిదండ్రులు బేబితో వివాహానికి ఒప్పుకోరు. భీమన్న అవమానంతో, నిరాశతో కృశించిపోతాడు. బేబి బాబు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అనుకోని పరిస్థితులలో ముత్తయ్య మరణిస్తాడు. అప్పుడు బేబి పరిస్థితి ఏమిటి అనేది మిగతా కథ[1].
నటీనటులు
[మార్చు]- కాంతారావు - భీమన్న
- కృష్ణ - బాబు
- రాజశ్రీ - బేబి
- ధూళిపాళ - ముత్తయ్య
- రాజబాబు
- కె.కె.శర్మ
- అల్లు రామలింగయ్య
- బాలకృష్ణ
- సంధ్యారాణి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: కె.ఎస్.ఆర్.దాస్
- మాటలు: విద్వాన్ కణ్వశ్రీ
- గేయరచయితలు: సినారె, కొసరాజు, దాశరథి
- సంగీతం: విజయా కృష్ణమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలు, పి.సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి,పిఠాపురం, రాఘవులు, విజయలక్ష్మీ కన్నారావు
- ఛాయాగ్రహణం: అన్నయ్య
- కూర్పు: కె.గోపాలరావు
- కళ: కళాకార్
పాటలు
[మార్చు]- అబలని ఎందుకని పుట్టించేవని ఆ దేవుణ్ణి ఎవ్వరడిగేది - పి.సుశీల - డా. సినారె
- ఇది ఎన్నడు వీడని కౌగిలి మన ఎదలను కలిపిన రాతిరి - ఎస్.పి.బాలు - రచన: డా.సినారె
- కొట్టేడయ్యా ఛాన్స్ కొట్టేడయ్యా మొనగాడయ్యా - పిఠాపురం,రాఘవులు బృందం - రచన: కొసరాజు
- చిగురువేసేనే చిలిపి కోరిక ఎగసిపోయేనే మనసు ఆగక - పి.సుశీల - రచన: డా.సినారె
- దయచూడు ఏసుప్రభువా నీవారి కావరావా - విజయలక్ష్మీ కన్నారావు - రచన: దాశరథి
- పిల్లా ఓ పిల్లా నీకు ఒళ్ళంతా సిగ్గేసిగ్గు నిగనిగ బుగ్గల్లో - ఎల్.ఆర్.ఈశ్వరి - డా. సినారె
- మీద కొబ్బరిచెట్టు కింద చెరువు గట్టు - ఎస్.పి. బాలు,విజయలక్ష్మీ కన్నారావు - రచన: డా.సినారె
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)