Jump to content

జయభారతి(నటి)

వికీపీడియా నుండి
జయభారతి
జయభారతి
జననం
లక్ష్మీ భారతి

1954
ఈరోడ్, మద్రాసు రాష్ట్రము, భారతదేశం (ప్రస్తుతం తమిళనాడు, భారతదేశం)
జాతీయతభారతీయురాలు
జీవిత భాగస్వామి
  • హరి పోతన్
    (m. 1973; div. 1974)
  • సత్తార్
    (m. 1979; died 2019)
పిల్లలుక్రిష్ జె.సత్తార్ (జ. 1984)
తల్లిదండ్రులు
  • శివశంకరన్ పిళ్లై
  • శారద

జయభారతి (జననం 1954) దక్షిణ భారత సినిమా నటి. ఈమె ప్రధానంగా మలయాళ సినిమాలలో నటించింది. 1966లో ఈమె తన 13వ యేట సినిమా  కెరీర్‌ను ప్రారంభించింది. ఈమె రెండు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి పురస్కారాలు అందుకొంది.[1]

1971లో ప్రేమ్‌ నజీర్ సరసన పి.వేణు దర్శకత్వాన సి.ఐ.డి.నజీర్ సినిమాతో హీరోయిన్‌గా మారింది జయభారతి. ఆ తరువాత మలయాళంలో ఈమె  అత్యంత విజయవంతమైన నటిగా ఎదిగింది.  అప్పటి పెద్ద హీరోలైన మధు, విన్సెంట్, జయన్, ఎం.జి.సోమన్, కమల్ హాసన్రజనీకాంత్ వంటి వారి సరసన నటించింది. 1970, 80లలో  జయభారతి-ఎం.జి.సోమన్ ఉత్తమ జంటగా పేరు పొందింది. ఈమె మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో కూడా కనిపించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

జయభారతి అసలు పేరు లక్ష్మీభారతి. ఈమె శివశంకరపిళ్లై, శారద దంపతులకు తమిళనాడులోని ఈరోడ్‌లో 1954లో జన్మించింది. ఈమె తన ఐదవ యేట నుండే కళామండలం నటరాజన్, రాజారాం, వళువూర్ సామ్రాజ్ పిళ్లైల వద్ద నృత్యం, నటనలలో శిక్షణ పొందింది. మలయాళ నటుడు జయన్ ఈమె సమీప బంధువు. ఈమె 1966లో సినిమాలలో నటించడం ప్రారంభించింది. సుమారు 400 సినిమాలలో నటించింది. ఈమె భరతన్‌ దర్శకత్వంలో నటించిన రతినిర్వేదమ్మలయాళ సినిమా రంగాన్ని ఒక మలుపు తిప్పింది. ఈ సినిమాలో ఈమె నటించిన శృంగార దృశ్యాలు ప్రేక్షకుల గుండెలలో కోరికలు పుట్టించింది. అంతవరకు సమాంతర సినిమాలకు మారుపేరుగా ఉన్న మలయాళ సినిమా రంగం ఈ సినిమాతో పోర్న్ స్థాయికి దిగజారిందనే విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గొప్ప విజయవంతమై చరిత్రను సృష్టించింది.

ఈమె 1973లో హరి పోతన్‌ను వివాహం చేసుకుంది కానీ 1974లో విడాకులు తీసుకుంది. తిరిగి 1979లో మలయాళ నటుడు సత్తార్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట 1987లో విడిపోయింది. వీరికి 1984లో క్రిష్ జె.సత్తార్ (ఉన్నికృష్ణన్) జన్మించాడు.

తెలుగు సినిమాల జాబితా

[మార్చు]

జయభారతి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

  1. లక్ష్మి (2006 సినిమా) - 2006
  2. ముత్తు (డబ్బింగ్ సినిమా) -1995
  3. స్వామియే శరణం అయ్యప్ప (డబ్బింగ్ సినిమా) -1981
  4. అల్లావుద్దీన్ అద్భుత దీపం (డబ్బింగ్ సినిమా) -1979
  5. శృంగార లీల (డబ్బింగ్ సినిమా) -1976
  6. సికింద్రాబాద్ సి.ఐ.డి. (డబ్బింగ్ సినిమా) -1971
  7. పూలపిల్ల (డబ్బింగ్ సినిమా) -1968
  8. అనుభవించు రాజా అనుభవించు (డబ్బింగ్ సినిమా) -1968

తమిళ సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kerala State Film Awards". Archived from the original on 2016-03-03. Retrieved 2017-03-20.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.