Jump to content

మరుపక్కమ్

వికీపీడియా నుండి
మరుపక్కమ్
మరుపక్కమ్ సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్. సేతుమాధవన్
స్క్రీన్ ప్లే కె.ఎస్. సేతుమాధవన్
దీనిపై ఆధారితంఇందిరా పార్థసారథి రాసిన ఉచి వెయిల్ నవల
తారాగణంశివకుమార్
రాధ
జయభారతి
ఛాయాగ్రహణండి. వసంత్ కుమార్
కూర్పుజి. వెంకిటరామన్
సంగీతంఎల్. వైద్యనాథన్
నిర్మాణ
సంస్థలు
నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
దూరదర్శన్
విడుదల తేదీ
1991, అక్టోబరు 4
సినిమా నిడివి
85 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతమిళం
బడ్జెట్14 లక్షలు

మరుపక్కమ్, 1991, అక్టోబరు 4న విడుదలైన తమిళ సినిమా. కె.ఎస్. సేతుమాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివకుమార్, రాధ, జయభారతి తదితరులు నటించగా, ఎల్. వైద్యనాథన్ సంగీతాన్ని సమకూర్చాడు.[2] ఇందిరా పార్థసారథి రాసిన ఉచి వెయిల్ అనే తమిళ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[3] నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దూరదర్శన్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి.[4]

38వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లోటస్ అవార్డు గెలిచిన మొదటి తమిళ చిత్రంగా నిలిచింది. 2003లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సేతుమాధవన్ గౌరవార్ధంగా ప్రదర్శించబడింది.[5]

నటవర్గం

[మార్చు]
  • శివకుమార్ (వెంబు అయ్యర్‌)
  • రాధ (అవయం)
  • జయభారతి (జానకి)
  • సేకర్ (అంబి)
  • గోపి (మూర్తి)[6]
  • వీరరాఘవన్ (వైద్యుడు)[6]
  • యువశ్రీ (స్వీటీ)[6]

అవార్డులు

[మార్చు]

1991లో జరిగిన 38వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు మూడు అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రం గోల్డెన్ లోటస్ అవార్డు , ఉత్తమ స్క్రీన్ ప్లే సిల్వర్ లోటస్ అవార్డు (సేతుమాధవన్), స్పెషల్ జ్యూరీ అవార్డు/స్పెషల్ మెన్షన్ (జయభారతి) సిల్వర్ లోటస్ అవార్డులు వచ్చాయి.[7] ఉత్తమ చిత్ర పురస్కారం పొందిన తొలి తమిళ సినిమా ఇది.[8] శివకుమార్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం విభాగంలో అమితాబ్ బచ్చన్ (అగ్నిపథ్ సినిమా) చేతిలో ఓడిపోయాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. "38th National Film Festival 1991". International Film Festival of India. Archived from the original on 5 November 2013. Retrieved 19 June 2021.
  2. "Marupakkam (1991)". Indiancine.ma. Retrieved 2021-06-19.
  3. "Quest for change... and an urge to accept challenge". The Indian Express. 18 May 1991. pp. 19, 22.{{cite news}}: CS1 maint: url-status (link)
  4. "Marupakkam (The Other Side)". The Indian Express. 6 March 1992. p. 4.
  5. "Tribute paid to Veteram film maker Sethumadhavan". Zee News. 10 October 2003. Archived from the original on 4 November 2019. Retrieved 19 June 2021.
  6. 6.0 6.1 6.2 Dhananjayan 2014, p. 316.
  7. "The other side". The Indian Express. 18 May 1991. p. 19.
  8. Baskaran 2013, p. 164.
  9. "கடைசி நேரத்தில் சிவகுமாருக்கு கைநழுவிய தேசிய விருது" [Sivakumar missed his National Award at the last minute]. Dinamalar. 31 March 2017. Archived from the original on 12 June 2017. Retrieved 19 June 2021.

గ్రంథ పట్టిక

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]