భట్టి విక్రమార్క
స్వరూపం
| భట్టి విక్రమార్క (1960 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | జంపన చంద్రశేఖరరావు |
|---|---|
| నిర్మాణం | పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణమూర్తి |
| కథ | అనిసెట్టి సుబ్బారావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, కాంతారావు, అంజలీదేవి |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, జిక్కి, ఎ.పి.కోమల |
| నృత్యాలు | వెంపటి సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి |
| గీతరచన | అనిసెట్టి సుబ్బారావు |
| సంభాషణలు | అనిసెట్టి సుబ్బారావు |
| ఛాయాగ్రహణం | ఆది ఇరానీ |
| కూర్పు | ఎన్.ఎమ్.శంకర్ |
| నిర్మాణ సంస్థ | పి.వి.వి.ఎస్.ఎం. ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం తాలూకాలోని దంగేరు జమీందారీ కుటుంబానికి చెందిన శ్రీ పోలిశెట్టి వీర వెంకట సత్య నారాయణ మూర్తి ఈ చిత్రమును తమ పి.వి.వి.ఎస్.ఎం. ప్రొడక్షన్స్ బ్యానరుపై 1960 సం..లో నిర్మించి ఆయన తల్లిదండ్రులు దంగేరు జమీందార్లు, భూస్వాములు, మల్లవరం ఎస్టేటుదార్లు అయిన శ్రీ పోలిశెట్టి వెంకటరత్నం నాయుడు, వెంకాయమ్మ దంపతులకు అంకితమిచ్చాడు. ఈ చిత్రము అప్పట్లో విజయవంతమై, మంచి పేరు తెచ్చుకుని శత దినోత్సవము జరుపుకున్నది.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- నందమూరి తారక రామారావు - విక్రమార్క మహారాజు
- కాంతారావు - భట్టి
- అంజలీ దేవి - ప్రభావతీ దేవి, చంద్రసేన మహారాజు కుమార్తె
- ఎస్.వి.రంగారావు - మాంత్రికుడు
- రేలంగి వెంకట్రామయ్య - తిరకాసు, శిల్పాచార్యుడు
- వల్లూరి బాలకృష్ణ - మాంత్రికుని శిష్యుడు
- నాగభూషణం - ప్రచండుడు
- ముక్కామల
- గిరిజ - అరకాసు, తిరకాసు భార్య
- కుచల కుమారి
- కాంచన
- సంధ్య
- సీత
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: జంపన చంద్రశేఖరరావు
- కథ:అనిశెట్టి సుబ్బారావు
- మాటలు_ పాటలు:అనిశెట్టి సుబ్బారావు
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- నేపథ్య గాయకులు: ఎ.పి.కోమల, పి.లీల, జిక్కి, పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం
- ఛాయా గ్రహణం: ఆది ఎం ఇరానీ
- నృత్యాలు: వెంపటి సత్యం_ పసుమర్తి కృష్ణమూర్తి
- కూర్పు: ఎన్.ఎం.శంకర్
- నిర్మాత: పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణ మూర్తి
- నిర్మాణ సంస్థ: పి. వి. వి ఎస్. ఎం.ప్రొడక్షన్స్
- విడుదల:1960.
పాటలు
[మార్చు]- ఓ నెలరాజా, వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ - ఘంటసాల, పి.సుశీల
- ఓ శైల సుతా మాతా పతి పదసేవ నిరతము నీవా - జిక్కి బృందం
- ఓ సుందరీ అందమె విందురా పొందురా - పి.సుశీల
- కన్నెపిల్ల సొగసు చూడు మహారాజ వన్నెలాడి నగవు నాది - జిక్కి
- కొమ్ములు తిరిగిన మగవారు కొంగు తగిలితే పోలేరు - జిక్కి
- చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల . రచన: కాళిదాస్
- జాయిరే జంభారే ఒకసారి రావేమి సుందరీ - మాధవపెద్ది సత్యం, జిక్కి
- జై త్రిభువనైక రాజ రాజేంద్రా రాజేంద్రా జై.. జై జగజేగీయమాన - మాధవపద్ది సత్యం
- నటించనా జగాలనే జయించనా - పి.లీల, పి.సుశీల (రంభా ఊర్వశుల నృత్యగీతం)
- నినునమ్మి సేవించు మనుజుండు ధన్యుండు (పద్యం) - మాధవపెద్ది సత్యం
- మనసారా ప్రేమించినారా మరుకేళి కేళింపవేల - పి.సుశీల, ఎ.పి.కోమల
- శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
- సత్యామయా గురుడ నిత్యామయా, నిత్యామయా గురుడ సత్యామయా - మాధవపద్ది సత్యం
- వింతయైన విధి విలాసం ఇదేనా మనసంత చింతల - ఘంటసాల
మూలాలు
[మార్చు]- ఐ.ఎమ్.బి.డి.లో ఈ సినిమా పేజీ.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతంలో భట్టి విక్రమార్క సినిమా పాటల వివరాలు