Jump to content

జంపన చంద్రశేఖరరావు

వికీపీడియా నుండి
జంపన నిర్మించిన మేనరికం సినిమా పోస్టర్.

జంపన చంద్రశేఖరరావు ప్రముఖ ప్రజా రచయిత, తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత.

వీరు ఏలూరులో జన్మించి, విద్యాభ్యాసం చేసి, తెలుగులో ఎం.ఎ. పట్టా పొందారు. అక్కడి సి.ఆర్.రెడ్డి కళాశాలలో కొంతకాలం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరు చెన్నైకి మకాం మార్చి నవలా రచలను చేశారు. కొవ్వలి లక్ష్మీనరసింహారావు నవలలు రైళ్ళలో విపరీతంగా ఖర్చవడం చూసి వీరి పద్ధతిలో తానూ అలాంటి నవలలను ఎక్కువగా రాశారు. ఆరోజుల్లో కొవ్వలి, జంపన నవలలను చదవని వారు అరుదు. వీరు రాసిన నవలలలో ఎవరి పెళ్లాం? (1940), నల్లకళ్ల అమ్మాయి (1947), వెంకటేశ్వర మహాత్మ్యం, ఊర్వశి అనే నాటకం (1948), ఆకలి అనే ఖండకావ్య సంపుటి ముఖ్యమైనవి. వీరు అపరాధ పరిశోధన నవలలు అనేకం రాశారు. స్త్రీ పురుష సంబంధాలు, వివాహ సమస్యలు వీరి రచనలలో ప్రాధాన్యం వహించిన అంశాలు. సరళమైన భాష, ఉత్కంఠభరితమైన కథాకథన విధానం వీరి రచనలకు ప్రజాదరణ చేకూర్చాయి.

వీరు 1953లో చెన్నైలో హృద్రోగంతో పరమపదించారు.

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • చంద్రశేఖరరావు, జంపన, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 173.

బయటి లింకులు

[మార్చు]