సొమ్మొకడిది సోకొకడిది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సొమ్మొకడిది సోకొకడిది
(1979 తెలుగు సినిమా)
Sommokkadidhi Sokokadidhi (1979).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం బి.రాధామనోహరి
తారాగణం కమల్ హాసన్
జయసుధ
రోజారమణి
సంగీతం రాజన్ - నాగేంద్ర
ఛాయాగ్రహణం బాలు మహేంద్ర
కూర్పు డి.వాసు
నిర్మాణ సంస్థ శ్రీ బాలసుబ్రహ్మణ్య ఫిల్మ్స్
విడుదల తేదీ 1979 జనవరి 5 (1979-01-05)
భాష తెలుగు

సొమ్మొకడిది సోకొకడిది సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బి.రాధామనోహరి నిర్మాతగా శ్రీబాలసుబ్రహ్మణ్య ఫిలింస్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమాకు రాజన్ - నాగేంద్రలు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా 1979, జనవరి 5వ తేదీన విడుదలయ్యింది.[1] ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా తమిళ భాషలో ఇరు నిలవుగళ్ అనే పేరుతో, మలయాళ భాషలో జీవిక్కాన్ పదిక్కనం అనే పేరుతో డబ్ చేయబడింది. హిందీలో హమ్‌ దోనో అనే పేరుతో, కన్నడలో గడిబిడి కృష్ణ పేరుతో పునర్మించబడింది.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ: ఎస్.ఎల్.కల్యాణి
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
 • మాటలు: జంధ్యాల
 • ఛాయాగ్రహణం: బాలు మహేంద్ర
 • సంగీతం: రాజన్-నాగేంద్ర
 • నృత్యం: రఘు - గిరిజ, శివ సుబ్రహ్మణ్యం

పాటలు[మార్చు]

 1. అబ్బో నేరేడుపళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 2. ఆ పొన్ననీడలో ఈ కన్నెవాడలోవున్నావేచివున్నా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల
 3. ఆకాశం నీ హద్దురా అవకాశం వదలద్దురా పరువాల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 4. ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా అందమైన ఆడపిల్ల చెంతచేరి - పి.సుశీల
 5. తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]