సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం కాంతారావు,
దేవిక,
రాజనాల,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
గిరిజ,
కైకాల సత్యనారాయణ
నేపథ్య గానం పిఠాపురం,
పి.బి.శ్రీనివాస్,
ఎస్.జానకి,
జమునారాణి,
పి.సుశీల,
మాధవపెద్ది సత్యం
గీతరచన ఆత్రేయ, కొసరాజు
సంభాషణలు ఆత్రేయ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు లోని ఒక కథ ఆధారంగా ఈ చిత్రం కథ తయారయ్యింది.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

కథాసంగ్రహం[మార్చు]

స్త్రీ వ్యామోహం వల్ల మంత్రశక్తులన్నీ కోల్ఫోయిన మాంత్రికుడొకడు తన మనోరథ సిద్ధికై ఆదిత్యపురపు యువరాణి అపూర్వ చింతామణికి ఆచార్యస్థానాన్ని సంపాదిస్తాడు. తన చతురోపాయం వల్ల చింతామణిని పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటాడు. యుక్త వయస్కురాలైన చింతామణి వివాహ విషయాన్ని ఆధారంగా చేసుకుని తన అమానుషమైన శిరచ్ఛేద కార్యక్రమానికి పూనుకొని చింతామణిని వరించ వచ్చినవారికి విషమ సమస్యను సృష్టిస్తాడు. అతిలోక సుందరియైన అపూర్వ చింతామణి అందానికి ఆకర్షితులై అనేకమంది రాజకుమారులు ఆమెను వరించడానికి వచ్చి తమ శిరస్సులను అర్పిస్తూ వచ్చారు. ఇలా శిరస్సులను సమర్పించిన 999 మందిలో కైవల్యపుర రాకుమారు ఆరుగురు కూడా ఉన్నారు. ఈ విషయం ఏడవవాడైన ప్రతాపశీలునకు చాలాకాలం వరకూ తెలియకుండా మభ్యపెడతారు. ఒకనాడు ప్రసంగవశాన ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతాపశీలుడు తల్లిదండ్రులను ఒప్పించి తన అన్నల దుర్మరణానికి కారకురాలైన ఆ హంతకిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తన సహచరుడైన కాళితో కలిసి ఆదిత్యపురానికి వెళతాడు. అపూర్వచింతామణి అడుగుతూ వచ్చిన మూడు ప్రశ్నలు ముందుగా తెలుసుకునే ఉద్దేశ్యంతో చింతామణి ఉద్యానవనంలో తోటమాలివద్ద కొలువుకు చేరతారు. మొదట్లో చింతామణి ఉద్యానవనంలో కాళి, ప్రతాపులకు ప్రవేశం ఇవ్వని తోటమాలి నుండి కాళి యుక్తిగా అనుమతిని సంపాదించి ఉద్యానవనం అంతా తిరుగుతుంటారు. కాళి తోటమాలి కుమార్తె రత్నంతో ప్రేమకలాపాలు ఆరంభిస్తాడు. ఒకనాడు చింతామణి, ఆమె చెలికత్తె కమలాక్షి విహారం చేస్తూ ఉండగా వారికి కాళి, ప్రతాపులు తారసిల్లుతారు. తొలివలపులోనే కమలాక్షి, ప్రతాపుల మధ్య వలపు అంకురిస్తుంది. కమలాక్షి ద్వారా ప్రతాపుడు చింతామణి అడిగే మూడు ప్రశ్నలు, వాటికి సమాధానం లభించే మూడు నగరాల పేర్లు తెలుసుకుని ఆ నగరాలకు బయలుదేరుతారు ప్రతాపుడు అతని సహచరుడు. దారిలో అనేక కష్టాలకు లోనై చివరకు కాళీమాత అనుగ్రహాన్ని పొంది మొదటి ప్రశ్నకు సంబంధించిన మతివదన పురానికి చేరుకుంటాడు. అక్కడ ఒక తోటమాలి వలన ఆ నగర పాలకుడైన సత్యశీల మహారాజు జీవితచరిత్రను తెలుసుకుని తన మొదటి ప్రశ్నకు, సత్యశీలుని జీవితానికీ సంబంధం ఉన్నట్లు గ్రహించి అతడిని కలుస్తాడు. ప్రశ్నను తెలుసుకున్న సత్యశీల మహారాజు ఉగ్రుడై ఆ ప్రశ్నకు ప్రత్యక్షంగా తానే సమాధానం చెబుతానని వాగ్దానం చేస్తాడు. మిగిలిన ప్రశ్నలకు కూడా సమధానం తెలుసుకుని వెంటబెట్టుకుని వెళతానని చెప్పి సంపంగిపురానికి బయలుదేరాడు. సంపంగిపుర రాణి చంపకవతి కూడా తానే ప్రత్యక్షంగా సమాధానం చెబుతానని అంటుంది. మూడవ ప్రశ్న సమాధానం కోసం నదీశీలపురం చక్రవర్తి మతివదన చక్రవర్తి మూడవ ప్రశ్న వినగానే కోపంతో కత్తిని ప్రతాపశీలుని మెడపై మోపాడు. మొదటి ప్రశ్నకు సత్యశీల మహారాజుకూ, రెండవ ప్రశ్నకు చంపకవతీదేవికి, మూడవ ప్రశ్నకు మతివదన చక్రవర్తికీ ఉన్న సంబంధమేమిటి? సన్యాసి అభీష్టం నెరవేరిందా? వెయ్యవ తల ఎవరిది? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు చిత్రం పతాక సన్నివేశంలో తెలుస్తుంది.[1]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చాడు[1].

క్ర.సం పాట రచయిత గాయకులు
1 "వరవీణా మృదుపాణీ వనరుహ లోచనురాణీ" ఆత్రేయ పి.సుశీల
2 "రాకురాకు రాకురాకు దగ్గరకు రాకుర గారాల బావ" ఆత్రేయ స్వర్ణలత
3 "గూటిలోన చిలుక గూడు వదిలి రాదు గోరువంక కాచివున్నాది అన్నయ్యా" ఆత్రేయ పిఠాపురం, పి.బి.శ్రీనివాస్
4 "అనురాగములో మనయోగములో మరిమరి మురిసే ఈ జగము" ఆత్రేయ పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
5 "ఎక్కడోడి వెక్కడోడివి ఓ చిన్నవాడ ఇక్కడొచ్చి చిక్కుకొంటివి " ఆత్రేయ పిఠాపురం, స్వర్ణలత
6 "హే భద్రకాళీ హే భదేకాళీ జగన్మోహినీ దుష్ట సంహారిణీ " కొసరాజు మాధవపెద్ది
7 "బస్తీమీద సవాలు మామా బడాయికొట్టే బంగారు మామా " కొసరాజు మాధవపెద్ది, జమునారాణి
8 "రంగైన బంగారు బొమ్మా చక్కని బొమ్మా " కొసరాజు మాధవపెద్ది, జమునారాణి
9 "అనురాగానికి కనులేలేవని ఆర్యులు అన్నారు " ఆత్రేయ ఎస్.జానకి, పి.సుశీల
10 "అందాలున్నవి కన్నులలో అవి అల్లరి చేసెను వెన్నెలలో " ఆత్రేయ పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 టి.ఆర్.సుందరం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి పాటల పుస్తకం. p. 12. Retrieved 28 August 2020.

ఇతర లింకులు[మార్చు]