పాలడుగు దుర్గా ప్రసాద్
Jump to navigation
Jump to search
పాలడుగు దుర్గాప్రసాద్ | |
---|---|
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | పి.డి.ప్రసాద్ |
వృత్తి | సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1971-1986 |
గుర్తించదగిన సేవలు | వెంకటేశ్వర వైభవం పెద్దన్నయ్య జీవిత రంగం |
జీవిత భాగస్వామి | పాలడుగు లక్ష్మి |
పి.డి.ప్రసాద్ గా ప్రసిద్ధిచెందిన పాలడుగు దుర్గా ప్రసాద్ (Paladugu Durga Prasad) తెలుగు సినిమా దర్శకుడు. ఇతని సినిమాలలో వెంకటేశ్వర వైభవం (1971), పెద్దన్నయ్య (1976), జీవిత రంగం (1974) మొదలైనవి చెప్పుకోదగ్గవి. ఇతడు నందమూరి తారకరామారావు ప్రియ శిష్యుడు. ఇతడు సుమారు 15 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అంతకు ముందు అనేక చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా, సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. ఇతడు అనేక నాటక పోటీలలో పాల్గొన్నాడు. నాటక రచయితగా, దర్శకునిగా గుర్తింపు పొందాడు. ఇతడు కొన్ని తెలుగు సినిమాలలో నటించాడు కూడా.[1]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]ఇతడు దర్శకత్వం వహించిన సినిమా వివరాలు
సంవత్సరం | సినిమా | నటీనటులు | నిర్మాత | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1971 | వెంకటేశ్వర వైభవం | |||
1974 | జీవిత రంగము | రామకృష్ణ, గుమ్మడి, చంద్రమోహన్, చంద్రకళ, సావిత్రి | గుళ్ళపల్లి నాగేశ్వరరావు | |
1975 | ఇల్లు - వాకిలి | కాంతారావు, చంద్రమోహన్, గిరిబాబు, రాజసులోచన |
డి.లక్ష్మీకాంత రావు, యం.సత్యనారాయణ రెడ్డి | |
1976 | పెద్దన్నయ్య | జగ్గయ్య, చంద్రమోహన్, రావు గోపాలరావు, ప్రభ, సంగీత |
||
1986 | లవ్ మాస్టర్ | కపిల్ దేవ్, రాగిణి రావు, భీమేశ్వరరావు, జయప్రకాశ్ రెడ్డి |
ఎన్.బంగార్రాజు, దాసరి రాజశేఖరరెడ్డి |
మూలాలు
[మార్చు]- ↑ Lambert M. Surhone, Mariam T. Tennoe. Paladugu Durga Prasad. Betascript Publishing. ISBN 978-613-2-24146-7. Retrieved 17 June 2020.