Jump to content

ఇల్లు - వాకిలి

వికీపీడియా నుండి
ఇల్లు - వాకిలి
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.డి.ప్రసాద్
తారాగణం కాంతారావు,
చంద్రమోహన్,
గిరిబాబు
రావి కొండలరావు
రాజసులోచన
కె.విజయ
సంగీతం బి.శంకర్
నిర్మాణ సంస్థ మేఘాలయా మూవీస్
విడుదల తేదీ అక్టోబర్ 2, 1975
భాష తెలుగు

ఇల్లు - వాకిలి 1975లో మేఘాలయా మూవీస్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు పి.డి.ప్రసాద్ దర్శకుడు.

నటీనటులు

[మార్చు]
  • నాగభూషణం
  • కాంతారావు
  • చంద్రమోహన్
  • గిరిబాబు
  • రావి కొండలరావు
  • సారథి
  • రాజసులోచన
  • సత్యప్రియ
  • కె.విజయ

సాంకేతికవర్గం

[మార్చు]
  • మాటలు : ఎన్.ఆర్.నంది
  • సంగీతం : బి.శంకర్
  • ఛాయాగ్రహణం : సుఖ్‌దేవ్
  • కూర్పు : అంకిరెడ్డి
  • కళ : వి.కృష్ణమూర్తి
  • దర్శకుడు: పి.డి.ప్రసాద్
  • నిర్మాతలు: డి.లక్ష్మీకాంతరావు, యం.సత్యనారాయణరెడ్డి

అదొక ఇల్లు. ఇంటిని చక్కదిద్దుకోవలసిన ఇల్లాలు జానకమ్మ పాశ్చాత్య నాగరికతా వ్యామోహం ఎక్కువగా కలిగిన స్త్రీ. సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. మిథ్యా ప్రతిష్ఠకు పోయి సంసారాన్ని అప్పులపాలు చేసుకునే ఆధునిక మహిళామణి. జానకమ్మ పెద్దకొడుకు అనిల్ కుమార్ జల్సారాయుడు. ఆడపిల్లల అమాయకత్వంతో ఆటలాడుకునే సరదా కలవాడు. కూతురు ప్రేమ డ్యాన్స్ మాస్టర్ చంద్రభూషణ్‌తో ప్రేమలో పడింది. జానకమ్మ మొగుడు సీతాపతి మంచితనం అనే అసమర్థతతో ఇంట్లో వాళ్ళను గదమాయించలేక యాతనపడుతుంటాడు. ఆరేళ్ళ బాబీ ఒక్కడే ఆ ఇంట్లో ఆలోచన కలిగిన వాడు.

మేజర్ రంగనాథం మానసికంగా కలిగిన షాక్‌తో పిచ్చాసుపత్రి పాలవుతాడు. అక్కడి నుండి వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఉంటాడు. సీతాపతి బాబాయి రామనాథం కోటీశ్వరుడు. రంగూన్‌లో వజ్రాల వ్యాపారం చేసి డబ్బు సంపాదించి, స్వదేశానికి తిరిగివచ్చి సీతాపతి దగ్గర స్థిరపడిపోవాలనే ఉద్దేశంతో వస్తాడు. సరిగ్గా అదే సమయంలో మేజర్ రంగనాథం పిచ్చాసుపత్రి నుండి పారిపోతాడు. రంగనాథం పోలికకలున్న రామనాథాన్ని పోలీసులు రైల్వేస్టేషనులో చూసి పిచ్చాసుపత్రికి లాక్కుపోయారు. స్టేషన్‌కు వచ్చిన సీతాపతి రంగనాథాన్ని రామనాథం అనుకుని ఇంటికి తీసుకు వెళతాడు.పిచ్చాసుపత్రి నుండి వచ్చిన రంగనాథం అంతకంటే హీనంగా ఉన్న ఆ ఇంటినీ, ఇంటిలోని మనుషులను చూసి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదని అనుకుంటాడు. అయితే అమాయకుడైన బాబీని చూసి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో జరుగుతున్న అఘాయిత్యాలను చూసి రంగనాథం తట్టుకోలేకపోతాడు. ఆ ఇంటిని సరిదిద్దాలంటే ముందు ఇల్లాలు జానకమ్మను సరిదిద్దాలని నిర్ణయించుకుంటాడు. పథకం ప్రకారం ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులలో పరివర్తన తీసుకువస్తాడు.

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]