నిర్దోషి (1951 సినిమా)
స్వరూపం
నిర్దోషి (1951 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | హెచ్.ఎం.రెడ్డి |
నిర్మాణం | హెచ్.ఎం.రెడ్డి |
తారాగణం | కాంతారావు, ముక్కామల (విజయ్), అంజలీదేవి (నిర్మల), జి. వరలక్ష్మి (తార), కోన ప్రభాకరరావు, చంద్రశేఖర్, మధు |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి |
నిర్మాణ సంస్థ | రోహిణి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నిర్దోషి1951 ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు సాంఘికచిత్రం. రోహిణి బ్యానర్ లో తయారైన ఈ చిత్రానిని నిర్మాత, దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి. కాంతారావు, ముక్కామల, అంజలీదేవి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు, పద్మనాభ శాస్త్రి, హె.ఆర్ లు సంగీతాన్నందించారు. అంతవరకు దుష్ట పాత్రలను పోషించిన ముక్కామల ఈ సినిమాలో కథానాయకునిగా తన నటి జీవితాన్ని ప్రారంభించాడు. కాంతారావు వెండితెరపై కనిపించే తొలిచిత్రం ఇది. ఇందులో అతను పల్లెటూరి రైతు పాత్రలో కొద్ది నిముషాలు నటించాడు. ఈ సినిమా ద్వారా మధు అనే నూతన బాలనటుడ్ని వెండి తెరకు పరిచయం చేసారు.[1] ఈ చిత్రం పరాజయం పాలై హెచ్.ఎం.రెడ్డి గారికి నష్టాలను మిగిల్చింది.
నట బృందం
[మార్చు]- ముక్కామల కృష్ణమూర్తి - విజయ్
- అంజలి దేవి - నిర్మల, ప్రమీళ
- జి వరలక్ష్మి - తార
- లక్ష్మీ కాంతం - కాంత
- రామమ్మ - నిర్మల తల్లి (లక్ష్మమ్మ)
- కోన ప్రభాకర రావు - చంద్రయ్య
- దొరైస్వామి - వెంకయ్య
- ఎ.చంద్రశేఖర్ - కుమార్
- మధు -నూతన బాలనటుడు
- పండిత్ రావు - రాజా వాసుదేవరావు
- శ్రీనివాసన్ - గోపా
- లింగం సుబ్బారావు - మల్లయ్య
- రామదాసు - సూరయ్య
సంకేతిక బృందం
[మార్చు]- దర్శకత్వం - ఎచ్ ఎం రెడ్డి
- నిర్మాణ సంస్థ - రోహిణి పిక్చర్స్
- చాయాగ్రహణం - పీ ఎల్ రాయ్
- కథ మాటలు: కె.జి.శార్మ, శ్రీశ్రీ, సదా శివ బ్రహ్మం, ఆత్రేయ
- పాటలు: కె.జి.శర్మ, శ్రీశ్రీ
- సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పద్మనాభ శాస్త్రి, హె.ఆర్
- ఛాయాగ్రహణం: పి.ఎల్.రాయ్
- శాబ్దగ్రహణం: కె.రామచంద్రన్
- ఆర్టు డైరక్టర్: సి.హెచ్.ఈ.ప్రసాద్
- నృత్యం: వెంపటి సత్యం
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : జి.అశత్ధామ
- మేకప్: ఎన్.మంగయ్య
- స్టిల్ ఫోటోగ్రఫీ: డి.వి.ఎన్.మణ్యం
- ప్రొడక్షన్ ఇన్ ఛార్జ్ : ఎం.ఎల్.పురుషోత్తమరెడ్డి
- ఎడిటింగ్: ఎం.ఎన్.పార్థసారథి
- ప్రోసెసైంగ్: ధరేన్ దాస్ గుప్తా
- సయూక్త దర్శకులు: డి.ఎల్.రామచంద్ర, హెచ్.వి.భాషా
పాటలు
[మార్చు]సంగీతం - ఘంటసాల వెంకెటశ్వర రావు, ఎచ్ ఆర్ పద్మనాభ శాస్త్రీ
- చూలాలు సీతమ్మ కానలకు నడిచె - ఘంటసాల
- నేనే జాణగా నెరజాణగా మోహిని గానా - జి. వరలక్ష్మి
- లోకమయ్యా లోకము మాయదారి లోకము మాయదారి మాయదారి - ఎ.వి. సరస్వతి
- లాలి లాలి చిన్నారి లాలి లాలీ మన పాప సాటి లేదు జగతి చిన్నారి పాపాయీ - సుందరమ్మ
- స్వాగతం స్వాగతం పతి సామ్రాజ్యమే సంసారం - ఘంటసాల, సుందరమ్మ , రచన: కే. జీ. శర్మ, శ్రీ శ్రీ
- సఖా నా రాజు నీవోయి తరించే ప్రేమ మనదోయీ - జి. వరలక్ష్మి
- హృదయమే నీతి ఈ జగతికి జ్యోతి ఇదే హారతి మా భారతి - జిక్కి, ఘంటసాల
మూలాలు
[మార్చు]- ↑ "Nirdoshi (1951)". Indiancine.ma. Retrieved 2025-03-22.
పాటల వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)