Jump to content

ముత్యాలముగ్గు

వికీపీడియా నుండి
(ముత్యాల ముగ్గు నుండి దారిమార్పు చెందింది)
ముత్యాలముగ్గు
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు
తారాగణం శ్రీధర్ ,
సంగీత
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన సి. నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆరుద్ర
నిర్మాణ సంస్థ శ్రీరామ చిత్ర
భాష తెలుగు

ముత్యాలముగ్గు 1975 లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. బాపు దర్శకత్వం, ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావు గోపాలరావు నటనలో ఒక కలికితురాయి.

చిత్రకథ

[మార్చు]

ఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా (అల్లు రామలింగయ్య) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు - కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమెను భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: బాపు

సంగీతం: కె వి మహదేవన్

నిర్మాత: మద్దాలి వెంకటలక్ష్మీ నరసింహారావు

నిర్మాణ సంస్థ: శ్రీరామ చిత్ర

సాహిత్యం: సి నారాయణ రెడ్డి,ఆరుద్ర, గుంటూరు శేషేంద్ర శర్మ

నేపథ్య గానం:మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వి .రామకృష్ణ, పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ

ఛాయాగ్రహణం: ఇషాన్ ఆర్య

విడుదల:25:07:1975.


  • జాతీయ పురస్కారం
  • 1976: రజత కమలం
  • 1976: ఇషాన్ ఆర్య, ఉత్తమ ఛాయాగ్రాహకుడు

పాటలు

[మార్చు]
  • ఏదో ఏదో అన్నది, ఈ మసక వెలుతురు, గూటిపడవలో విన్నది, కొత్త పెళ్ళి కూతురు, రచన:ఆరుద్ర, గానం. విస్సంరాజు రామకృష్ణ దాస్
  • నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నులలో నీరు తుడిచి కమ్మని కథ చెప్పింది.రచన: (గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఏకైక చిత్రగీతం), గానం. పి సుశీల
  • ఎంతటి రసికుడవో తెలిసెరా.... ఎంతసేపు నీ తుంటరి చూపు, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పులపాక సుశీల
  • ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా, మత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయా, రచన : ఆరుద్ర, గానం - పి.సుశీల
  • శ్రీరామ జయరామ సీతా రామ ,రచన: ఆరుద్ర, గానం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  • గోగులు పూచే గోగులు కాచే ఓలచ్చ గుమ్మడి,రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
  • శ్రీరాఘవం దశరదాత్మజ మప్రమేయం సీతాపతిం(శ్లోకం), గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

హిట్టయిన "డయలాగులు"

[మార్చు]

ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. వాటిని తూర్పు గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.

  • సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!....సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ? ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
  • సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
  • వాడికి స్త్రీజాతిమీద నమ్మకం పోయింది. నాకు మనుషులమీదే నమ్మకంపోయింది. (కాంతారావు ముక్కామల తో)
  • సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. (సంగీత కాంతారావు తో)

సినిమా బొమ్మల కొలువు

[మార్చు]

సినిగోయర్.కమ్ వారి సౌజన్యంతో

వనరులు

[మార్చు]
  • లో వ్యాసం, చిత్రాలు
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

మూలాలు

[మార్చు]
  1. "పి.వెంకటేశ్వర రావు మృతి." andhrajyothy. Archived from the original on 2022-03-10. Retrieved 2022-03-10.