వాల్మీకి (1963 సినిమా)
స్వరూపం
వాల్మికి తెలుగు చలన చిత్రం 1963 ఫిబ్రవరి 9 న విడుదల.చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో, నందమూరి తారక రామారావు, రాజసులోచన,జంటగా నటించిన ఈ చిత్రానికి , కథ సముద్రాల రాఘవాచార్యులు అందించారు .సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.
| వాల్మీకి (1963 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సి. ఎస్. రావు |
|---|---|
| నిర్మాణం | ఎస్.కె.హబీబుల్లా |
| కథ | సముద్రాల రాఘవాచార్య |
| తారాగణం | నందమూరి తారక రామారావు, కాంతారావు, రాజసులోచన, కె. రఘురామయ్య, లీలావతి, రాజనాల |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, ఎ.పి.కోమల, రాఘవులు, సత్యం |
| గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
| సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
| ఛాయాగ్రహణం | ఎం.ఎ.రెహమాన్ |
| కూర్పు | కె.గోవిందస్వామి |
| నిర్మాణ సంస్థ | జూపిటర్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- నందమూరి తారక రామారావు - వాల్మీకి
- కాంతారావు
- రాజసులోచన
- కె. రఘురామయ్య
- లీలావతి - కళ్యాణి, యువరాణి
- రాజనాల
- మిక్కిలినేని - మహారాజు
- ఏ.వి.సుబ్బారావు
- పద్మనాభం
- శివరామకృష్ణయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: చిత్తజల్లు శ్రీనివాసరావు
- కధ, మాటలు:సముద్రాల రాఘవాచార్య
- సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
- పాటలు:సముద్రాల రాఘవాచార్య
- నేపథ్య గాయకులు: కల్యాణం రఘురామయ్య, ఘంటసాల వెంకటేశ్వరరావు, శిష్ట్లా జానకి, జె.వి.రాఘవులు, పులపాక సుశీల, ఎ.పి.కోమల
- నిర్మాత: ఎస్.కె.హాబీబుల్లా
- నిర్మాణ సంస్థ:జుపిటర్ పిక్చర్స్
- విడుదల:09:02:1963.
- ఛాయా గ్రహణం: ఎం.ఎ రెహమాన్
- ఎడిటింగ్: గోవిందస్వామి
పాటలు
[మార్చు]- అందచందాలలోన పరువుపంతాలలోన నేను నాసాటి - పి.సుశీల బృందం, రచన:సముద్రాల రాఘవాచార్యులు.
- అనురాగమిలా కొనసాగవలె లలనా హోయి ఇది మగవాని - ఘంటసాల, పి.సుశీల
- ఓం నమోనారాయాణాయ ఓం నమోనారాయాణాయ - కె. రఘురామయ్య, ఘంటసాల
- కాంతుడు ప్రాణముగ నెంచు కన్నెవలపు నాశము (పద్యం) - ఎస్. జానకి
- జయజయజయ నటరాజా భుజగశయన - ఘంటసాల బృందం
- కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం (శ్లోకం) - ఘంటసాల, రచన: వాల్మీకి
- తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన ( పద్యం) - కె. రఘురామయ్య
- మా విషాద ప్రతిష్ఠాం త్వమగమస్యా (శ్లోకం) - ఘంటసాల, రచన: వాల్మీకి
- ముదము కనేదెపుడే మదిలోని ఆశతీరె - ఎస్.జానకి
- రాతిగుండెయెనీది మారాడవేల మూగనోములు (పద్యం) - ఘంటసాల, రచన: వాల్మీకి
- శ్రీరామాయణ కావ్యకథ జీవనతారక మంత్రసుధా - ఘంటసాల
- హరేనారాయణా పావనా సృష్టిస్ధితిలయ మూలకారణా - కె. రఘురామయ్య
- హరియే వెలయునుగా భువిని హరయే వెలయునుగా - ఘంటసాల బృందం
- పరమ తారక మంత్ర ప్రభావమెల్ల వలచుకొన్నావు ,(పద్యం), కె.రఘురామయ్య
- తాళలేనే నే తాళలేనే రావే పదవే, జె. వి.రాఘవులు ఎ. పి. కోమల
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)