Jump to content

కూచిభొట్ల శివరామకృష్ణయ్య

వికీపీడియా నుండి
(శివరామకృష్ణయ్య నుండి దారిమార్పు చెందింది)
కూచిభొట్ల శివరామకృష్ణయ్య
జననం
శివరామకృష్ణయ్య

1899
జాతీయతభారతదేశం
ఇతర పేర్లుడా.శివరామకృష్ణయ్య
వృత్తివైద్యులు, నటన
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హాస్యపాత్రలు

డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య (1899 - ) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు.[1]

వీరు తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామ వాస్తవ్యులు. వీరు వైద్యవిద్యలో పట్టభద్రులు.

వీరు కొంతకాలం కొంగర సీతారామయ్య గారు స్థాపించిన నాటక సమాజంలోను, రామవిలాస సభ లోను వివిధ పాత్రలు పోషించారు. దుర్యోధనుడు, రామదాసు, కబీరు, చాణక్యుడు, హిరణ్యకశిపుడు, కాశీపతి మొదలైన పాత్రలు ధరించి పేరుపొందారు.

వీరు మొదటగా నటించిన చలనచిత్రం భలే పెళ్ళి (1941). జీవన్ముక్తి (1942) సినిమాలో కథానాయకుడిగా కూడా నటించి మెప్పించారు. తర్వాత కాలంలో వీరు సుమారు 200 సినిమాలలో నటించారు. వీరు స్థూలకాయం కలిగివుండడం మూలంగా ఎక్కువగా హాస్య పాత్రలు ధరించేవారు.

నటించిన సినిమాలు-పాత్రలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. డాక్టర్ కూచిభట్ల శివరామకృష్ణయ్య, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, ద్వితీయ ముద్రణ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 275.

బయటి లింకులు

[మార్చు]