Jump to content

దక్షయజ్ఞం (1962 సినిమా)

వికీపీడియా నుండి
దక్షయజ్ఞం
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం కడారు నాగభూషణం
నిర్మాణం కడారు నాగభూషణం,
కన్నాంబ
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
ఎస్.వి.రంగారావు,
కన్నాంబ,
చిత్తూరు నాగయ్య,
రాజనాల,
కళ్యాణం రఘురామయ్య,
రాజశ్రీ,
పద్మనాభం,
పి.సూరిబాబు,
బి.రామకృష్ణ,
బాలకృష్ణ,
మిక్కిలినేని,
శివరామకృష్ణయ్య,
ఛాయాదేవి
సంగీతం సాలూరు హనుమంతరావు
నేపథ్య గానం ఎస్.జానకి,
జయలక్ష్మి,
ఎం.ఎల్.వసంతకుమారి,
పి.బి.శ్రీనివాస్,
పి.లీల,
పి.సూరిబాబు,
జమునారాణి,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
పి.సుశీల
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
సంభాషణలు ఆరుద్ర
ఛాయాగ్రహణం లక్ష్మణ్ గోరే
కూర్పు ఎస్.కె.గోపాల్
నిర్మాణ సంస్థ వరలక్ష్మి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దక్షయజ్ఞం కడారు నాగభూషణం, కన్నాంబ 1962 మే 10 న విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా.కడారు నాగభూషణం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నందమూరి తారక రామారావు, దేవిక, కన్నాంబ, ఎస్. వి. రంగారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం సాలూరి హనుమంతరావు అందించారు .

దక్షప్రజాపతి బ్రహ్మపుత్రుడు. తన సృజనాత్మక శక్తిచే చతుర్దశ భువనాలమీద అధికారాన్ని పొందగలిగాడు. శంకరుని భక్తుడైన దక్షుడు ఆదిశక్తిని తన కూతురుగా పొందగలిగాడు. ఆమెయే సతీదేవి. సతీదేవి బాల్యం నుండి శంకరుని ప్రేమించి అతడినే భర్తగా భావించసాగింది. అశ్వని, భరణి మొదలైన 27 నక్షత్ర బాలలు దక్షుని దత్తపుత్రికలు. వీరి వివాహాన్ని చూడవచ్చిన సందర్భంలో సతీదేవి శంకరునికి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆమెను తప్పకుండా సతిగా స్వీకరిస్తానని శివుడు మాట ఇస్తాడు.

మిగిలిన నక్షత్రకాంతలను ఆదరించక చంద్రుడు రోహిణీలోలుడై కాలం గడపటంతో తమకు అన్యాయం జరిగిందని వారంతా దక్షునికి చెబుతారు. దక్షుడు కోపించగా ఆయన భార్య వైరిణి సామరస్యంగా వారి కాపురాలను చక్కదిద్దమని కోరింది. భార్యలనందరినీ సమాన ప్రేమతో చూడమని దక్షుడు చంద్రునికి సలహా ఇవ్వగా, ఇది నా స్వంత వ్యవహారం నీ జోక్యం అక్కరలేదని చంద్రుడు దక్షునికి కటువుగా సమాధానం చెబుతాడు. దానికి కోపోద్రిక్తుడైన దక్షుడు చంద్రుని క్షయ గ్రస్తుడు కమ్మని శాపం ఇస్తాడు. చంద్రుడు శివుని శరణు కోరతాడు. శివుడు చంద్రునికి అభయమిస్తాడు. నారదుని ద్వారా ఈ సంగతి తెలుసుకున్న దక్షుడు కోపావేశంతో శివుని వద్దకు వచ్చి వాదనకు దిగుతాడు. ఇరువురూ కోపంతా ఆయుధాలు తీస్తారు. విష్ణువు వచ్చి వారిద్దరికీ రాజీ కుదురుస్తాడు. ఫలితంగా చంద్రునకు వృద్ధి క్షయాలు (కృష్ణ శుక్ల పక్షాలు) సంభవించాయి. శివుడు చంద్రశేఖరుడైనాడు.

దక్షునికి శివునిపై కోపం పోలేదు. సతీదేవి స్వయంవరానికి శివుని ఆహ్వానించకుండా అతని ప్రతిమ ఒకచోట పెట్టి స్వయంవరం నిర్వహిస్తాడు. సతి ఆ ప్రతిమ మెడలోనే హారం వేస్తుంది. దక్షుడు ఆమెను చంపబోతాడు. శివుడు ప్రత్యక్షమై సతిని కైలాసానికి తీసుకుపోయి వైభవంగా వివాహం చేసుకుంటాడు. విశ్వశాంతికై సప్తరుషులు తలపెట్టిన యాగానికి దక్షుడు రాగా శివుడు లేచినిలబడక అవమానించాడని కుపితుడైన దక్షుడు నిరీశ్వరయాగం తలపెడతాడు[1].

సతి ఆడపిల్ల కనుక తండ్రి ఆహ్వానించకపోయినా పుట్టింటి మమకారంతో యజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానం పాలై దేహత్యాగం చేస్తుంది. శివుడు తాండవమాడి వీరభద్రుణ్ణి సృష్టించి యాగాన్ని ధ్వంసం చేయమని పంపుతాడు. వీరభద్రుడు దక్షుని తల నరికి యాగగుండంలో పడవేస్తాడు. కాని అతని భార్య పాతివ్రత్య మహిమ వల్ల తిరిగి సజీవుడై లెంపలు వేసుకుంటాడు.[2]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఆరుద్ర రచించాడు.[3]

  1. ఇది చక్కని లోకము ఈ చల్లని సమయము - ఎస్. జానకి,పి.బి. శ్రీనివాస్ బృందం
  2. ఏమిసేయుదు దేవదేవా ప్రేమ విఫలమాయెనే నేను - పి.లీల
  3. కమనీయం కైలాసం కాంతుని సన్నిధిని కలలు ఫలించి కవితలు పాడెను - సుశీల
  4. కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా - కె. రఘురామయ్య
  5. కరుణామూర్తులు మీ త్రిమూర్తులు జగత్‌కల్యాణ (పద్యం) - కె. రఘురామయ్య
  6. కోయిలా తెలుపవటే కోరిన జతగాడు రానేరాడా కొసరుచు మనసార - సుశీల
  7. జాబిలి ఓహోహో జాబిలి పిలిచే నీ చెలికొసరే కోమలి - కె.జమునారాణి, పి.బి.శ్రీనివాస్
  8. దక్షా మూర్ఖుడ పాపచిత్త ఖలుడా (పద్యం) - పి.సూరిబాబు
  9. నమోనమో నటరాజా నమామి మంగళతేజా - ఎం.మల్లేశ్వరరావు భాగవతార్
  10. నవరసభావల నటియించ గలవా నటరాజు మదికూడ - పి.లీల, రాధా జయలక్ష్మి
  11. నీ పాదసంసేవ దయసేయవా నిజభక్తమందార సదాశివా - పి.లీల
  12. పశువా నన్ను శపింతువా ప్రమధ నీ ప్రాభల్యమెక్కడ (పద్యం) - మాధవపెద్ది
  13. మంగళం మహనీయతేజా మంగళం మానసరాజా -ఎం.మల్లేశ్వరరావు బృందం
  14. హరహర మహదేవా శంభో అక్షయలింగవిభో - పి.సూరిబాబు బృందం

మూలాలు

[మార్చు]
  1. రాధాకృష్ణ (18 May 1962). "చిత్ర సమీక్ష - దక్షయజ్ఞం". ఆంధ్రపభ దినపత్రిక. Retrieved 23 February 2020.[permanent dead link]
  2. కృష్ణానంద్ (13 May 1962). "చిత్ర సమీక్ష దక్షయజ్ఞం". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 23 February 2020.[permanent dead link]
  3. కొల్లూరి భాస్కరరావు. "దక్షయజ్ఞం - 1962". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 23 ఫిబ్రవరి 2020. Retrieved 23 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)