కొంగర సీతారామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంగర సీతారామయ్య
జననంకొంగర సీతారామయ్య
1891, మార్చి 3
నాలి తాలూకా మోరంపూడి గ్రామం
మరణం1978 ఏప్రిల్
ఇతర పేర్లుకొంగర సీతారామయ్య
ప్రసిద్ధిప్రముఖ రంగస్థల నటుడు,జాతీయవాది
తండ్రిజగ్గయ్య,
తల్లిరత్తమ్మ

కొంగర సీతారామయ్య ( మార్చి 3, 1891 - ఏప్రిల్, 1978) ప్రముఖ రంగస్థల నటుడు.

జననం[మార్చు]

కళలకు నెలవైన తెనాలి తాలూకా మోరంపూడి గ్రామంలో సామాన్య కర్షక కుటుంబములో జగ్గయ్య, రత్తమ్మ దంపతులకు 1891 మార్చి 3 న జన్మించాడు[1].

రంగస్థల ప్రస్థానం[మార్చు]

ఊరిబడిలో చదివిన సీతారామయ్య గ్రామంలోనే నాటక సమాజము స్థాపించి గయోపాఖ్యానము ప్రదర్శించడం మొదలుపెట్టాడు. గంభీర స్వరముతో సీతారామయ్య చెప్పే పదాలకు, పాడే పద్యాలకు ప్రేక్షకులు పరవశులయ్యేవారు. 1918-19లో పక్కనే ఉన్న దుగ్గిరాలలో శ్రీకృష్ణ విలాస సభ అనే నాటక సమాజము స్థాపించి, ఒక సభాస్థలి నిర్మించి, ఎంతో డబ్బు వ్యయము చేసి తెరలు వ్రాయించి లంకాదహనం, చిత్రనళీయం, బొబ్బిలి, చింతామణి, చంద్రహాస, సారంగధర, నాటకాలను జనరంజకముగా ప్రదర్శించాడు. పెనుతుఫాను తాకిడికి రంగస్థలము, పైరేకులు, హాలు శిథిలమయ్యాయి. పట్టుదలతో తెనాలి చేరి మరలా విశేషముగా డబ్బు ఖర్చుపెట్టి రంగస్థలం నిర్మించాడు. దానికి శ్రీకృష్ణ సౌందర్య భవనం అనే పేరు పెట్టాడు. కొంతకాలానికి దాని పేరు సీతారామ విలాస సభగా మార్చాడు. స్వంత బృందాన్ని తయారు చేశాడు. రామదాసు, ప్రతాపరుద్రీయం, పృధ్వీరాజు, హరిశ్చంద్ర, లంకాదహనం, శ్రీకృష్ణతులాభారం మున్నగు నాటకాలన్నింటిలో సీతారామయ్యే నాయకగా నటించాడు. రంగస్థల నటులెందరో సీతారామ విలాస సభ సమాజములో సభ్యులు. అందరికీ గొప్ప పారితోషికాలు ఇచ్చేవాడు. ఎందరో కవులకు, గాయకులకు, పండితులకు, మిత్రులకు ఎనలేని దానాలు చేశాడు. సీతారామయ్య జాతీయవాది. ఎందరో దేశభక్తులను రహస్యంగా ఆదరించాడు. సామ్రాజ్యవాదాని ధిక్కరించిన దేశభక్తుడు. తెల్లని దుస్తులతో, తెల్లగుర్రం ఎక్కి భోగాలనుభవించిన వ్యక్తి, లక్షలాది విలువచేసే యావదాస్తిని కళాపోషణకు, కళాసేవకు అర్పించిన వదాన్యుడు.[2]

మరణం[మార్చు]

తన గళాన్ని, నటకౌశలాన్ని కొడుకు కొంగర జగ్గయ్యకు వారసత్వముగా ఇచ్చిన సీతారామయ్య 1978 ఏప్రిల్ శ్రీరామనవమి నాడు మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 145
  2. ఉత్తమ నాటక సమాజం శ్రీకృష్ణ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 30 జనవరి 2017, పుట.14