కందిమళ్ళ సాంబశివరావు
స్వరూపం
కందిమళ్ళ సాంబశివరావు | |
---|---|
జననం | ఏప్రిల్ 5, 1960 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, రచయిత, పరిశోధకుడు , అధ్యాపకుడు |
తల్లిదండ్రులు | బలరామయ్య, తిరుపతమ్మ |
బంధువులు | రాధ (భార్య) |
కందిమళ్ళ సాంబశివరావు (ఏప్రిల్ 5, 1960) రంగస్థల నటుడు, రచయిత,[1] పరిశోధకుడు, అధ్యాపకుడు.[2] నాటకరంగ పరిశోధనకు భారతీయ నాటకరంగ చరిత్రలో తొలి డి.లిట్ అందుకున్నాడు.[3]
జననం
[మార్చు]సాంబశివరావు 1960, ఏప్రిల్ 5న బలరామయ్య, తిరుపతమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, కొలలపూడిలో జన్మించాడు.
ఉద్యోగం
[మార్చు]గుంటూరు జిల్లా, చిలకలూరిపేట కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.
నాటకరంగ ప్రస్థానం
[మార్చు]చిన్నతనం నుండే నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్న సాంబశివరావు, వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవాడు. నాటక సాహిత్యంపై అవగాహన ఏర్పరచుకున్న ఈయన తెలుగు నాటకరంగం - నూతన ధోరణలు, ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసి నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి పొందాడు. వివిధ సదస్సుల్లో, పత్రికలలో నాటకరంగానికి సంబంధించిన అనేక వ్యాసాలు రాశాడు. కళా సంస్థలకు కార్యదర్శిగా, గౌరవ సలహాదారునిగా, న్యాయనిర్ణేతగా సేవలందిస్తున్నాడు.
నటించినవి
- రాజీనామా
- ధర్మ సంరక్షణార్థం
- కల్పాంతం
- వాళ్ళిద్దరితో వీళ్ళు ముగ్గురు
- కుందేటి కొమ్ము
- దండమయా విశ్వంభర
- జగన్నాథ రథచక్రాలు
- సారా సంహారం
- ముద్రారాక్షసం
- నల్ల సముద్రం
- ప్రార్థన
- ఖడ్గసృష్టి
రచించినవి
ఇతర రచనలు
[మార్చు]- అభినయ భరతాచార్య చాట్ల శ్రీరాములు (చాట్ల శ్రీరాములు థియేటర్ ట్రస్ట్, హైదరాబాద్, 2010)
- గుంటూరు జిల్లా నాటకరంగ చరిత్ర (కందిమళ్ల రాధ, చిలకలూరిపేట, 2009)
- తెలుగు నాటక రంగం నూతన ధోరణులు-ప్రయోగాలు (కాకతీయ ప్రచురణ, చిలకలూరిపేట, 1995)
- సాక్షి గంగోత్రి పెదకాకాని పదిహేడళ్ళ ప్రత్యేక సంచిక (గంగోత్రి ప్రచురణలు, పెదకాకాని, 2007)
- భూమిక తెలుగునాట నాటకం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా, సాంస్కృతికశాఖ, 2016)
బహుమతులు - పురస్కారాలు
[మార్చు]- ఉత్తమ నాటక రచన పురస్కారం - ముద్రారాక్షసం (1997), అనగనగా ఆరు నాటికలు (2008) తెలుగు విశ్వవిద్యాలయం[7]
- ఉత్తమ నాటక రచన పురస్కారం - ఎన్.జి. రంగ ఫౌండేషన్ (1998)
- ఉత్తమ నాటక రచన పురస్కారం - ప్రజానాట్యమండలి
- ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[8]
- సరిలేరు నీకెవ్వరు విశిష్ట నాటక రచనా పురస్కారం - అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ (2014) [3]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, తెలంగాణ, హైదరాబాద్ (13 October 2016). "కళాపిపాసి కేవీఆర్". Retrieved 5 April 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ కందిమళ్ళ సాంబశివరావు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.633.
- ↑ 3.0 3.1 అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్, 25 వార్షికోత్సవ కరదీపిక. "విశిష్ట సాహితీమూర్తులు" (PDF). www.avkf.org. p. 14. Archived from the original (PDF) on 4 November 2019. Retrieved 5 April 2018.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ మాగంటి. "సహాయ నిరాకరణోద్యమం - చీరాల, పేరాల సత్యాగ్రహం". www.maganti.org. Retrieved 5 April 2018.
- ↑ గుంటూరు కళాపరిషత్ బ్లాగు. "గుంటూరు కళాపరిషత్ 21వ వార్షిక నాటకోత్సవాలు". www.gunturkalaparishat.blogspot.in. Retrieved 5 April 2018.[permanent dead link]
- ↑ Chilakaluripet blog. "3rd day competitions in C.R.Club auditorium". www.chilakaluripet1.blogspot.in. Retrieved 5 April 2018.[permanent dead link]
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం, సాహితీ పురస్కారాలు. "నాటకం, నాటిక" (PDF). www.teluguuniversity.ac.in. p. 9. Archived from the original (PDF) on 9 September 2017. Retrieved 5 April 2018.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 April 2020. Retrieved 17 April 2020.
వర్గాలు:
- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using ethnicity
- Pages using div col with unknown parameters
- తెలుగు రంగస్థల నటులు
- 1960 జననాలు
- తెలుగు రంగస్థల దర్శకులు
- తెలుగువారు
- ప్రకాశం జిల్లా కథా రచయితలు
- ప్రకాశం జిల్లా రచయితలు
- ప్రకాశం జిల్లా రంగస్థల నటులు
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు