నాటక విజ్ఞాన సర్వస్వం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడినద విజ్ఞాన సర్వస్వం సంపుటాలలో నాటక విజ్ఞాన సర్వస్వం 8వది.
సంపుటంలోని అంశాలు
[మార్చు]నాటకరంగంలో వివిధ శాఖల గురించిన విజ్ఞాన సముదాయాన్ని ఒక్కచోట సమీకరించి, అటు పరిశోధకులకు తోడ్పడే పరామర్శ గ్రంథంగాను, ఇటు నాటాకాభిమానులైన సామాన్య పాఠకులకు కరదీపికగాను ఉపయుక్తంగా ఉండే రీతిలో ఈ నాటక విజ్ఞాన సర్వస్వం రూపొందించారు.
ఈ సంపుటంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. మొదటిభాగం సమీక్షా వ్యాస సమన్వితం. రెండవది కారాది వ్యాసాల వివరణ. వివిధ దేశాలలో నాటకరంగ ఆవిర్భావ వికాస దశల గురించి వివరించే వ్యాసాలతో పాటు, రంగస్థల సేవకు అంకితమైన కళాకారుల, కళాపోషకుల జీవిత విశేషాలు, నాటక రయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, ప్రసిద్ధ నాటక సమాజాలు, నాటక గ్రంథాల గురించి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది.
నాటకరంగానికి పరిమితమైన ప్రస్తుత సంపుటాన్ని తనదైన ప్రణాళికతో 1960 నాటికి నాటక విజ్ఞాన సర్వస్వం పేరుతో మౌలికంగా తయారుచేసినవారు కీ.శే. శ్రీనివాస చక్రవర్తి గారు. వీరు తెలుగు నాటకరంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ, భారతీయ, ప్రపంచ నాటకరంగాలను స్పృశించి వదిలేశారు. భారతీయ నాటకరంగంలోని, ప్రపంచ నాటకరంగంలోని ప్రముఖుల గురించి ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిచేత రాయించడం జరిగింది. ఈ సంపుటంలో 80 మంది రచయితలు పాలుపంచుకున్నారు. ప్రాచ్చ-పాశ్చాత్య నాటక సాహిత్యంమీద, రంగస్థల పరిణామ దశల మీద కూలంకషంగా పరిశోధన చేసి పట్టుసాధించి తెలుగులో అనేక గ్రంథాలు, పరిశోధక వ్యాసాలు వెలువరించి నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన సుప్రసిద్ధ పరిశోధకులు, ప్రస్తుత నాటక విజ్ఞాన సర్వస్వం సంపుటానికి మౌలిక రూపానిచ్చిన కీ.శే. శ్రీనివాస చక్రవర్తికి (1911-1976) అంకితమిచ్చారు.
ఆధునిక నాటకరంగంలో విప్లవాత్మకమైన మార్పులెన్నో జరిగిన దృష్ట్యా 1960 నుండి 2006 వరకు సమకాలీన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఏర్పడింది.
మారుతున్న కాలానికి, అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా, సమకాలీన నాటకరంలోని ప్రముఖ వ్యక్తులను, సమాజాలను, నాటకరచనా విధానం, ప్రదర్శనా పద్ధతుల్లో చోటుచేసుకున్న మార్పులను ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని ఇందులో ఎన్నో కొత్త అంశాలను చేర్చడం జరిగింది.
నాటకరంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలు, నంది అవార్దు గ్రహీతలు, ఎన్.టి.ఆర్ రంగస్థల పురస్కార గ్రహీతల పేర్లను కూడా చేర్చడం జరిగింది.
నాటకరంగంలో కృషి చేసిన కొంతమంది ప్రసిద్ధ కళాకారుల, నాటకకర్తల జీవిత విశేషాలు ఎక్కడా గ్రంథస్థం కాకపోవడంవల్ల వారి గురించి సరైన వివరాలు లభించకపోవడంతో ఆనాడు వారితో నటించిన సహ నటుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా కొన్ని వివరాలు సేకరించి ఈ సంపుటంలో చేర్చడం జరిగింది. జననమరణ తేదీలు, తల్లిదండ్రుల పేర్లు, స్వస్థలం మొదలైన వివరాలు లభించిన వివరాలలనే ఇక్కడ ఇవ్వడం జరిగింది.
నాటకరంగంలో 20,25 సంవత్సరాలకు పైబడి ఏదోఒక విభాగంలో సేవలు అందించిన కళామూర్తులను మాత్రమే ఇందులో చేర్చారు.
సంపాదకవర్గం
[మార్చు]నిర్వాహక సంపాదకులు - ఆచార్య కె. ఆనందన్; సంపాదకులు - కీ.శే. పి.వి. రమణ, జి.ఎస్. ప్రసాదరెడ్డి; సంగ్రాహక సంపాదకులు - గండవరం సుబ్బరామిరెడ్డి; సహాయ సంపాదకులు - డి. మల్లన్న; సమన్వయ సంపాదకులు - జి. చెన్నకేశవరెడ్డి.
వ్యాస రచయితలు
[మార్చు]- 1. అడబాల (హైదరాబాద్)
- 2. అన్నప్ప (హైదరాబాద్)
- 3. అయ్యదేవర పురుషోత్తమరావు (హైదరాబాద్)
- 4. కొళ్లాగుంట ఆనందన్ (హైదరాబాద్)
- 5. ఇంటూరి వెంకటేశ్వరరావు (మద్రాస్)
- 6. నాగేశ్వరరావు. జి (హైదరాబాద్)
- 7. ఉమారాణి. కె (సిద్ధిపేట, మెదక్ జిల్లా)
- 8. నెమలికంటి తారకరామారావు (హైదరాబాద్)
- 9. నేతి పరమేశ్వర శర్మ (తెనాలి, గుంటూరు జిల్లా)
- 10. మహీధర రామశాస్త్రి (ఒరిస్సా)
- 11. ఎం.ఎస్వీ. సత్యనారాయణబాబు (గుడివాడ, కృష్ణా జిల్లా)
- 12. ఎమ్. గురుప్రసాదరావు (షాద్నగర్, మహబూబ్ నగర్ జిల్లా)
- 13. కీ.శే ఎస్.కె. ఆంజనేయులు (సికింద్రాబాద్)
- 14. కందిమళ్ళ సాంబశివరావు (చిలకలూరిపేట, గుంటూరు జిల్లా)
- 15. కీ.శే కప్పగంతుల మల్లికార్జునరావు (హైదరాబాద్)
- 16. ఐ.వి. కాంతలక్ష్మి (హైదరాబాద్)
- 17. కీ.శే జి.కృష్ణ (హైదరాబాద్)
- 18. కె. గోపాలకృష్ణమూర్తి (హైదరాబాద్)
- 19. కొత్తపల్లి బంగారరాజు (విశాఖపట్టణం)
- 20. గంటి శ్రీరామమూర్తి (అనకాపల్లి)
- 21. గండవరం సుబ్బరామిరెడ్డి (సికింద్రాబాద్)
- 22. ఎస్. గంగప్ప (గుంటూరు)
- 23. గద్దె శ్రీనివాసరావు (హైదరాబాద్)
- 24. పగడాల చంద్రశేఖర్ (హైదరాబాద్)
- 25. చన్నాప్రగడ తిరుపతిరావు (బెంగళూరు)
- 26. చాట్ల శ్రీరాములు (హైదరాబాద్)
- 27. జి. చెన్నకేశవరెడ్డి (హైదరాబాద్)
- 28. సి. జయలక్ష్మి (బెంగళూరు)
- 29. జి. అశ్వత్థ నారాయణ (బెంగళూరు)
- 30. జి.ఎస్.ఎన్. శాస్త్రి (హైదరాబాద్)
- 31. జె. మునిరత్నం (తిరుపతి)
- 32. జొన్నలగడ్డ వేంకటేశ్వరశాస్త్రి (హైదరాబాద్)
- 33. కీ.శే. ఎస్వీ జోగారావు (విశాఖపట్టణం)
- 34. డి.ఎస్.ఎన్. మూర్తి (హైదరాబాద్)
- 35. డి. లక్ష్మణరావు (కాకినాడ)
- 36. డి.వి. పాండురంగారావు (హైదరాబాద్)
- 37. దాసరి నల్లన్న (హైదరాబాద్)
- 38. దుగ్గిరాల సోమేశ్వరరావు (హైదరాబాద్)
- 39. టి. నాగరాజ శెట్టి (హైదరాబాద్)
- 40. బి. నాగిరెడ్డి (సికింద్రాబాద్)
- 41. పప్పు వేణు గోపాలరావు (చెన్నై)
- 42. పాలగుమ్మి విశ్వనాథం (హైదరాబాద్)
- 43. పి.ఎస్. గోపాలకృష్ణ (హైదరాబాద్)
- 44. పి.జె. సుధాకర్ (హైదరాబాద్)
- 45. పగడాల లక్ష్మీనారాయణ (వికారాబాద్)
- 46. పోలి విజయరాఘవరెడ్డి (హైదరాబాద్)
- 47. కీ.శే. పోణంగి శ్రీరామ అప్పారావు (హైదరాబాద్)
- 48. కీ.శే. పోలవరపు సూర్యప్రకాశరావు (విజయవాడ)
- 49. డి.వి.బి. ప్రభావతి (హైదరాబాద్)
- 50. జి.ఎస్. ప్రసాదరెడ్డి (హైదరాబాద్)
- 51. కీ.శే. బూదరాజు రాధాకృష్ణ (హైదరాబాద్)
- 52. బిట్టు వెంకటేశ్వర్లు (హైదరాబాద్)
- 53. ఈసాస్ బేగ్ (హైదరాబాద్)
- 54. కీ.శే. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు (హైదరాబాద్)
- 55. బోయిన వెంకటేశ్వరరావు (బందరు)
- 56. జి. భరద్వాజ (హైదరాబాద్)
- 57. ముక్తేవి భారతి (సికింద్రాబాద్)
- 58. పి.భార్గవీరావ్ (హైదరాబాద్)
- 59. అక్కిరాజు రమాపతిరావు (హైదరాబాద్)
- 60. మన్నె శ్రీనివాసరావు (రేపల్లె)
- 61. మల్లేశం (సిద్ధిపేట)
- 62. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (విజయవాడ)
- 63. ముదిగంటి సుజాతారెడ్డి (హైదరాబాద్)
- 64. కీ.శే. పి.వి. రమణ (హైదరాబాద్)
- 65. వి. రమాంజనీ కుమారి (హైదరాబాద్)
- 66. ఎన్. రవీంద్రారెడ్డి (హైదరాబాద్)
- 67. వాసన్ (తిరుపతి)
- 68. వెల్దండ నిత్యానందరావు (హైదరాబాద్)
- 69. జి. శేఖర్ బాబు (హైదరాబాద్)
- 70. శేషం వెంకట నరసింహాచార్యులు (హైదరాబాద్)
- 71. శోభా దేశ్ ముఖ్ (హైదరాబాద్)
- 72. కీ.శే. శ్రీనివాస చక్రవర్తి (హైదరాబాద్)
- 73. ఎస్ శ్రీ పెరుంబుదేరి లక్ష్మణమూర్తి (వరంగల్లు)
- 74. ఎన్.సి.రామానుజచారి (చెన్నై)
- 75. వై.ఆర్. సరోజా నిర్మల (హైదరాబాద్)
- 76. సి.వి.కె. రావు (చర్ల, ఖమ్మం)
- 77. కీ.శే. చిలకమర్తి సత్యనారాయణ (బందరు)
- 78. తెన్నేటి సుధాదేవి (హైదరాబాద్).
మూలాలు
[మార్చు]- నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008.
- విశాలాంధ్ర వెబ్ లో నాటకరంగ శిల్పి శ్రీనివాస చక్రవర్తి వ్యాసంలో నాటక విజ్ఞాన సర్వస్వం పుస్తకం గురించిన వ్యాఖ్య[permanent dead link]