చిలకమర్తి సత్యనారాయణ
స్వరూపం
చిలకమర్తి సత్యనారాయణ | |
---|---|
జననం | మార్చి 3, 1927 |
మరణం | 2004 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, నాటక రచయిత |
చిలకమర్తి సత్యనారాయణ (మార్చి 3, 1927 - 2004) రంగస్థల నటుడు, రచయిత. సుప్రసిద్ధ నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం ఈయనకు పెదనాన్న.[1]
జననం - ఉద్యోగం
[మార్చు]సత్యనారాయణ 1927, మార్చి 3న తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంలో జన్మించాడు.
నాటకరంగ ప్రస్థానం
[మార్చు]1956 వరకు ముంబాయిలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో ఆర్.ఎం. సింగ్, శంభుమిత్ర, రిత్వీఘటక్ వంటి ప్రముఖ నటుల దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. వారి ప్రోత్సాహంతో ఎ.కె. హంగల్, నత్యేకప్పు, బాలరాజ్ సహానీల సరసన హిందీ నాటకాలలో నటించాడు. అక్కడే గరికపాటి రాజారావు దగ్గర మేకప్ నేర్చుకున్నాడు.
నాటకాలు
[మార్చు]నటించినవి:
- మనోవ్యధ (డాక్టరు పాత్ర)
- కన్యాశుల్కం (గిరీశం పాత్ర)
- కథకంచికి
- ఇంటిదీపం
- దైవశాసనం
- మాస్టర్జీ
- ఫణి
- ఒకే కుటుంబం
- చరిత్ర
- పద్మవ్యూహం
రచించినవి:
- క్రీనీడ (1964)
- కళాప్రపూర్ణ
- నటనాశిల్పం
- రంగస్థల శిల్పం
బహుమతులు
[మార్చు]- ఉత్తమ నటుడు - లలితకళాసమితి రాష్ట్రస్థాయి నాటిక పోటలు (1958) - లో కొర్రపాటి గంగాధరరావు మనోవ్యధ నాటకంలోని డాక్టరు పాత్ర
- ఉత్తమ నటుడు - లలిత కళానికేతన్ (రాజమండ్రి) మొట్టమొదట నిర్వహించిన కన్యాశుల్కం ఆఖరి దృశ్యంలోని గిరీశం పాత్ర.
- అనేక నాటకాల్లో పాత్రోచిత నటనకు ఉత్తమ నటుడిగా బహుమతులు
మరణం
[మార్చు]సత్యనారాయణ 2004 లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ చిలకమర్తి సత్యనారాయణ, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.390.
వర్గాలు:
- Pages using infobox person with unknown parameters
- Infobox person using ethnicity
- తెలుగు రంగస్థల నటులు
- తెలుగు కళాకారులు
- తెలుగు నాటక రచయితలు
- తెలుగు రంగస్థల దర్శకులు
- 1927 జననాలు
- 2004 మరణాలు
- తూర్పు గోదావరి జిల్లా రంగస్థల నటులు
- తూర్పు గోదావరి జిల్లా నాటక రచయితలు
- కన్యాశుల్కం నాటకం ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు