నెమలికంటి తారకరామారావు
నెమలికంటి తారకరామారావు | |
---|---|
జననం | నెమలికంటి తారకరామారావు మార్చి 5, 1937 నెమలికల్లు, అమరావతి, గుంటూరు జిల్లా |
ప్రసిద్ధి | కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు. |
మతం | హిందూ మతము |
తండ్రి | మృత్యుంజయశర్మ |
తల్లి | సీతారామమ్మ |
నెమలికంటి తారకరామారావు (మార్చి 5, 1937) కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు. దాదాపు 40కి పైగా నాటకాలు, నాటక పరిశోధన గ్రంథాలు, నవలలు, కథలు రచించారు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]గుంటూరు జిల్లా, అమరావతి సమీపంలోని నెమలికల్లు లో 1937, మార్చి 5 న జన్మించాడు. తల్లిదండ్రులు సీతారామమ్మ, మృత్యుంజయశర్మ. మృత్యుంజయశర్మ స్వాతంత్ర్య సమరయోధుడు. తారకరామారావు విద్యాభ్యాసం అమరావతి, గుంటూరు, హైదరాబాద్ లలో జరిగింది.
ఉద్యోగం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో సహాయ సంచాలకులుగా 1995లో పదవీ విరమణ చేశారు.
నట ప్రస్థానం
[మార్చు]తారకరామారావు మొట్టమొదట గనిపిశెట్టి వేంకటేశ్వరరావు భలేపెళ్లి నాటకంలో, ఆ తరువాత లింగమూర్తి రచించిన వెంకన్న కాపురంలో వేంకటేశ్వర్లు పాత్రలో నటించాడు. రంగస్థల, ఆఖాశవాణి, దూరదర్శలలో 1959 నుండి 1982 వరకు నటుడిగా కొనసాగారు.
రచనలు
[మార్చు]నాటకాలు
[మార్చు]- ఆత్మసాక్షి (1969)
- మహాప్రస్థానం (1971)
- శరణం గచ్చామి (1973)
- నాతి చరామి (1974)
- బకాసుర (1990) (బొంబాయి, అహ్మదాబాద్, సూరత్ లలో ప్రదర్శించబడింది)
- జనమేజయం (1997) (ఈ నాటకం భారత రంగఉత్సవ్ (2001)లో రసరంజని వారిచే ప్రదర్శించబడింది)
- యజ్క్షసేని ఆత్మకథ (కాంచిపురంలో ప్రదర్శించబడింది)
నాటికలు
[మార్చు]- వరుడు కావాలి (1980)
- షరా మామూలే (1981)
- వీధి నాటకం (1983)
- మేలు కొలుపు (1985)
మహాప్రస్థానం నాటకం అనేకసార్లు ప్రదర్శించబడింది. శరణం గచ్చామి నాటకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శించింది. శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదు లోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
పురస్కారాలు
[మార్చు]- చరమాంకం (నాటకం)- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచన పురస్కారం (1982), రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం (1987)
- నాతి చరామి (నాటకం)- తృతీయ బహుమతి, ఆంధ్రజ్యోతి నాటక పోటీలు.
- తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం.
- ఆజోవిజో కందాళం వారి రంగస్థల పురస్కారం.
- యువకళావాహిని రంగస్థల పురస్కారం.
- రసమయి రంగస్థల పురస్కారం.
- రసరంజని రంగస్థల పురస్కారం. (జూలై 1, 2015 గరిమెళ్ళ రామమూర్తి గారి 79వ జయంతి సందర్భంగా)
మూలాలు
[మార్చు]- నెమలికంటి తారకరామారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 330.