Jump to content

జీవన ముక్తి

వికీపీడియా నుండి
(జీవన్ముక్తి నుండి దారిమార్పు చెందింది)
జీవన ముక్తి
(1942 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.వి.నీలకంఠం
నిర్మాణం ఎస్.ఎస్.వాసన్
కథ బలిజేపల్లి లక్ష్మీకాంతం
తారాగణం పి.సూరిబాబు, బెజవాడ రాజరత్నం, బలిజేపల్లి లక్ష్మీకాంతం
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు బలిజేపల్లి లక్ష్మీకాంతం
ఛాయాగ్రహణం శైలేన్ బోస్
నిర్మాణ సంస్థ జెమిని పిక్చర్స్
భాష తెలుగు

జీవన్ముక్తి లేదా జీవన ముక్తి 1942లో విడుదలైన తెలుగు సినిమా. ఇది ఎస్.ఎస్.వాసన్ జెమినీ పిక్చర్స్ నిర్మించిన మొదటి సినిమా.బెజవాడ రాజారత్నం, పి.సూరిబాబు, బలిజేపల్లి లక్ష్మీకాంతం ప్రధాన తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి, టి. వి. నీలకంఠం దర్శకుడు.సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: టి.వి.నీలకంఠం
  • కధ, మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంతం
  • గీత రచయిత:సముద్రాల రాఘవాచార్య
  • సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
  • ఛాయా గ్రహణం: శైలేన్ బోస్
  • గాయనీ గాయకులు: పి.సూరిబాబు, బెజవాడ రాజారత్నం, మాస్టర్ విశ్వం , కమలకుమారి, మాధవరావు, లక్ష్మీదేవి, ఎల్.ఎస్.నారాయణ, కె.శివరామకృష్ణయ్య
  • నిర్మాత: ఎస్.ఎస్.వాసన్
  • నిర్మాణ సంస్థ: జెమిని పిక్చర్స్
  • విడుదల:14:01:1942.

పాటలు

[మార్చు]
పి.సూరిబాబు పాడిన వెలిగింపుమా నాలో జ్యోతి పాట

ఈ సినిమాలో మొత్తం 19 పాటలు, ఒక పద్యం ఉన్నాయి. అన్నింటిని సముద్రాల రాఘవాచార్య రచించారు.[1]

  1. ఆకల్లాడదొకింత లోకమున, నీ యాదేశ మేలేక మా (పద్యం) - సూరిబాబు
  2. ఆయే వేళాయే హరి మా యిలు సేరగ వేళాయె - రాజరత్నం- పి.సూరిబాబు
  3. ఆరగింప రారా విందారగింప రారా కరుణాలవాల రారా - పి.సూరిబాబు, రాజరత్నం, మాస్టర్ విశ్వం
  4. ఆహా నా తరమా సుతిసేయా - రాజరత్నం, సూరిబాబు
  5. ఏల రావోయీ కన్నయ్యా జీవుడు పూజకు లేడని జాగా - రాజరత్నం
  6. చూచితిగా చూచితిగా... కనుల పండువుగా నేడే - కమల కుమారి
  7. జయ జయ పరమాత్మ సకల భువన కారణా - బృందం
  8. జైజైరాం హరె జానకిరాం -
  9. జోడు కొంటారా బాబూ జోడు కొంటారా - మాస్టర్ విశ్వం
  10. దాశరథే దయాశరథే కావ రావా కనరావా - కమల కుమారి, సురిబాబు
  11. పలుకే బంగారమాయెనా సిన్నారి సిలకా - మాధవరావు
  12. పూలోయమ్మా పూలండయ్యా పూవులు చక్కని కమ్మని పూలూ-లక్ష్మీదేవి
  13. పోవుదము కోవెలకు రండి బిరానా హాయి హాయిగా - కమల కుమారి, మాస్టర్ విశ్వం, బృందం
  14. బాలుడే గోపాల బాలుడే మాపాలి దేవుడు - మాస్టర్ విశ్వం
  15. బొద్దుగా ముద్దుగా కట్టుదామా గులాబి మాలా - ఎల్. ఎస్.నారాయణ - కె. శివరామకృష్ణయ్య
  16. మేలుకో జీవా జీవా తూర్పు తెలవారే
  17. మొరవిను వారే లేదా యీ చెర విడిపింపగ రారా - మాస్టర్ విశ్వం, బృందం
  18. రారా కట్టుదమా సుమమాలా శ్రీహరికి తులసీ మాలా - సూరిబాబు
  19. లీలా రసికులు కోరెడు పూలూ - లక్ష్మీదేవి
  20. వెలిగింపుమా నాలో జ్యోతి తిలకింతుగా ఓ దేవా - పి. సూరిబాబు
  21. శ్రీ రఘు నందన జైజైరాం శ్రితజనచందన జైజైరాం
  22. హాయిగా హాయిగా పూజ సేయుదునా - కమల కుమారి

చలం వాఖ్యలు

[మార్చు]

ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం 1940లలొ బెజవాడలో ఒక సినిమా హాలుకు ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవాడు. రోజూ సినిమాలు వినేవాడు.ఈ సినిమా మీద తను రచించిన మ్యూజింగ్స్ లో(280వ పుటలో 5 వ ముద్రణ 2005) ఈ కింది విధంగా వ్రాశాడు: జీవన్ముక్తిలో ఎవరో అమ్మాయికి కృష్ణుడు ప్రత్యక్ష మౌతాడు. ఆ సంతోషాన్ని 'చూచితిగా' అంటుంది. అదేదో చాలా బూతును చూసినట్టు, తనకి చాలా సిగ్గయినట్టు, బతుకు అసహ్యమైనట్టు. "ఏమి తెల్పుదు నాన్నా!ఏమి తెల్పుదు నాన్నా! ఏమి తెల్పుదు నాన్నా!" అని ఏడుస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. జీవన్ముక్తి, జీవితమే సఫలము, మొదటి సంపుటి, డా.వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పేజీలు: 137-150.