Jump to content

వెలుగునీడలు (1961 సినిమా)

వికీపీడియా నుండి
వెలుగునీడలు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం డి.మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
సావిత్రి,
జగ్గయ్య,
ఎస్.వి.రంగారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి వెంకటరామయ్య,
సూర్యకాంతం,
గిరిజ,
రాజసులోచన,
పద్మనాభం,
పేకేటి శివరామ్,
ఇ.వి.సరోజ,
పెండ్యాల నాగేశ్వరరావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల,
మాధవపెద్ది సత్యం
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
ఛాయాగ్రహణం పి.ఎన్.సెల్వరాజ్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్
విడుదల తేదీ జనవరి 7, 1961
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన వెలుగు-నీడలు ఒక మంచి సాంఘిక చిత్రం. ప్రతి మనిషి జీవితంలో వెలుగు నీడలు వుంటాయని, వాటిని దీరోదాత్తంగా ఎదుర్కొనాలని హితవు చెప్పే ఈ చిత్రం ప్రతి సన్నివేశాన్ని రసవత్తరంగా తీర్చిదిద్దారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

రావు బహదూర్ వెంకట రామయ్య (యస్.వి.రంగారావు), భార్య కనకదుర్గమ్మ (సూర్యకాంతం) దంపతులకు సంతానంలేని కారణంగా సుగుణ (సావిత్రి)ని పెంచుకుంటారు. తరువాత వారికి సంతానయోగం కలిగి వరలక్ష్మి (గిరిజ) పుడుతుంది. సుగుణపై వెగటు పుడుతుంది. దీనిని గ్రహించిన వెంకట రామయ్య సుగుణ బాధ్యతల్ని గుమస్తా వెంగళప్పకు అప్పచెబుతాడు.

డాక్టరు చదువుతున్న సుగుణకు కవితలు రాసే రవి (నాగేశ్వరరావు)తో పరిచయమవుతుంది. అది ప్రేమకు దారితీస్తుంది. విదేశాల నుంచి వచ్చిన రఘు (జగ్గయ్య) సుగుణ అంటే అభిమానం చూపిస్తాడు. రవికి క్షయవ్యాధి వస్తుంది. తన పరిస్థితి తెలిసిన రవి సుగుణను వప్పించి రఘుతో పెళ్ళి జరిపిస్తాడు.

విధి వంచితుడైన రఘు ప్రమాదంలో మరణిస్తాడు. రవి మదనపల్లి శానిటోరియంలో వుండి ఆరోగ్యవంతుడవుతాడు. సుగుణ కోరిక మేరకు వరలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు. రావుబహదూర్ వెంకటరామయ్య స్వాతంత్రం వచ్చినా పూర్వం నాటి బ్రిటీష్ రాజభక్తి మాత్రం వదలరు. తాను బ్రిటీష్ కాలంలో ప్రారంభించిన రాజసేవ పత్రిక అదే పేరుతో, అదే ధోరణితో నడపడమే కాక జార్జిప్రెస్ అన్న ప్రెస్ పేరునూ అలాగే కొనసాగిస్తారు. రాజసేవ పత్రికను నడిపించమన్న మావగారి కోరిక మీద దాని యాజమాన్యం స్వీకరించి నడిపిస్తాడు రవి. రాజసేవ పత్రికను నవజ్యోతిగా మార్చి, దాన్ని లాభాల బాట పట్టిస్తారు. అయితే తన అభ్యుదయ భావాలతో పత్రిక లాభాల్లో వాటా ఇవ్వాలని హామీ ఇవ్వగా, అప్పటికే ఆ లాభాలన్నిటినీ కుటుంబంలోని వారు ఖర్చుచేసేయడంతో హతాశుడవుతాడు. గతంలో రవి, సుగుణ ప్రేమించుకున్న విషయం తెలుసుకున్న వరలక్ష్మి భర్తను అనుమానిస్తుంది. చివరకు నిజం తెలుసుకొని పశ్చాత్తాప పడుతుంది.

తారాగణం

[మార్చు]
  • అక్కినేని నాగేశ్వరరావు_చంద్రం
  • సావిత్రి_ సుగుణ
  • సామర్ల వెంకట రంగారావు_ రావు బహుదూర్ వెంకట్రామయ్య
  • కొంగర జగ్గయ్య_ డాక్టర్ రఘునాథ్
  • రేలంగి వెంకట్రామయ్య_ వెంగళప్ప
  • పద్మనాభం_ వైద్య విద్యార్థి
  • పేకేటి శివరావు_ శివరాం
  • సూర్యకాంతం_ కనకదుర్గమ్మ
  • గిరిజ_ వరలక్ష్మి
  • రాజసులోచన_ ప్రత్యేక పాటలో
  • ఇ.వి.సరోజ_ ప్రత్యేక పాటలో
  • సంధ్య_సుభద్రమ్మ
  • టి జి.కమలాబాయి _ శాంతమ్మ
  • సురభి కమలాబాయి
  • మోహన_ నర్స్.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు
  • చిత్రానువాదం: ఆదుర్తి సుబ్బారావు
  • సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
  • మాటలు:ఆచార్య ఆత్రేయ
  • పాటలు: శ్రీరంగం శ్రీనివాసరావు, కొసరాజు రాఘవయ్య చౌదరి
  • నేపథ్య గాయకులు:ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, జిక్కి, స్వర్ణలత, ఉడుత సరోజిని, పులపాక సుశీల
  • ఛాయా గ్రహణం: పి ఎస్.సెల్వరాజ్
  • ఎడిటింగ్: ఎం.ఎస్.మణి
  • నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు
  • నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ పిక్చర్స్
  • పంపిణీదారులు: నవయుగ ఫిలింస్
  • విడుదల:07:01:1961.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
ఓ రంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో శ్రీ శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
పి.సుశీల
కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు శ్రీశ్రీ పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
పాడవోయి భారతీయుడా, ఆడిపాడవోయి విజయగీతికా
నేడే స్వాతంత్ర్యదినం, వీరుల త్యాగఫలం
శ్రీశ్రీ పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
పి.సుశీల
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో శ్రీశ్రీ పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
పి.సుశీల
చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు, చేరి మనం ఆడేపాడే పండుగరోజు శ్రీశ్రీ పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల, స్వర్ణలత
చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు, మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు శ్రీశ్రీ పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల, జిక్కి

భలే భలే మంచి రోజులు లే ,ఘంటసాల , మాధవపెద్ది, బృందం, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి

సరిగంచు చీరకట్టి ... నిలపర చిన్నోడు నీ సోకు,ఘంటసాల, సుశీల , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి

ఇతర విశేషాలు

[మార్చు]
  • పాడవోయి భారతీయుడా నృత్య గీతంలో రాజసులోచన అతిథిగా పాల్గొన్నారు.
  • కలకానిది నిజమైనది రేడియో స్టేషను లో పాట రికార్డింగ్ సందర్భంగా ఆర్కెస్ట్రా కండక్టర్ గా పెండ్యాల నాగేశ్వరరావు కనిపిస్తారు.

మూలాలు

[మార్చు]