Jump to content

పేకేటి శివరాం

వికీపీడియా నుండి
(పేకేటి శివరామ్ నుండి దారిమార్పు చెందింది)
పేకేటి శివరాం
జననం
పేకేటి శివరామ సుబ్బారావు

అక్టోబరు 8, 1918
మరణండిసెంబరు 30, 2006
వృత్తినటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామిప్రభావతి
పిల్లలు4 కుమారులు ‍, 4 కుమార్తెలు

పేకేటి శివరామ్ (పేకేటి శివరామ సుబ్బారావు) (అక్టోబరు 8, 1918 - డిసెంబరు 30, 2006) ఒక తెలుగు సినిమా నటుడు.

జననం

[మార్చు]

ఈయన అక్టోబరు 8, 1918 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో జన్మించాడు. 1937లో మద్రాస్ వెళ్లి కొంతకాలం కెమెరా డిపార్ట్‌మెంటులో, 1945లో హెచ్‌ఎంవి గ్రామ్‌ఫోన్ రికార్డు సంస్థలో ఇన్‌ఛార్జిగా పనిచేశాడు. ఆ సమయంలో ఘంటసాలతో లలిత గీతాలు పాడించి ప్రైవేట్ రికార్డు చేశాడు. శ్రమజీవి అనే పత్రికకు కొంతకాలం ఆపద్ధర్మ సంపాదకుడిగా పనిచేశాడు. చిత్ర అనే సినిమా పత్రిక భాద్యతలు నిర్వహించాడు. బెంగళూరు నుండి వెలువడే సినిమా ఫ్లేమ్‌ అనే పత్రికకు మద్రాసు ప్రతినిధిగా పనిచేశాడు. భగవాన్ పేరుతో పద్దెనిమిది డిటెక్టివ్ నవలలు వ్రాశాడు.[1] ప్రతిభా, వినోద నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో ‘శాంతి’ (1952) చిత్రంలో నటి సావిత్రి సరసన హాస్య నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించి, 1953లో దేవదాసులో భగవాన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అప్పటినుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 100కు పైగా చిత్రాల్లో నటించాడు. మద్రాసులో ఒక విందులో మిత్రునితో సాగించిన సినీరంగం, నిర్మాణ కార్యక్రమాల విశ్లేషణ వీరిని కన్నడ చిత్ర రంగానికి దర్శకునిగా, చక్రతీర్థ అనే కన్నడ నవల చిత్రరూపానికి సారథిని చేసింది. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. తరువాత ఇతడు 1971 కన్నడంలో రూపొందించిన కుల గౌరవం చిత్రం (రాజ్‌కుమార్, భారతి, జయంతిలతో), దాన్ని తెలుగులో యన్‌టిఆర్‌తో 1972లో నిర్మించిన కులగౌరవం చిత్రానికి ఇతడే దర్శకుడు కావటం విశేషం. శ్రీదేవి కంబైన్స్ 1968లో నిర్మించిన చుట్టరికాలు తరువాత, 1969లో అదే సంస్థ నిర్మించిన భలే అబ్బాయిలు సినిమాకు దర్శకత్వం వహించాడు.[2]

ఇతనికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కళా దర్శకుడు పేకేటి రంగా వీరి కుమారుడే. తమిళ నటుడు ప్రశాంత్ ఇతని మనుమడు.

మరణం

[మార్చు]

పేకేటి 2006 డిసెంబర్ 30 తేదీన చెన్నైలో మరణించాడు.

చిత్ర సమాహారం

[మార్చు]

ఇతడు నటించిన చిత్రాల పాక్షిక జాబితా:

సంవత్సరం సినిమా భాష ధరించిన పాత్ర
1953 కన్నతల్లి తెలుగు నటుడు
దేవదాసు తెలుగు భగవాన్ పాత్రధారి
గుమస్తా తెలుగు నటుడు
1954 రేచుక్క తెలుగు నటుడు
వద్దంటే డబ్బు తెలుగు నటుడు
1955 కన్యాశుల్కం తెలుగు పోలీసు పాత్రధారి
అనార్కలి తెలుగు నటుడు
1956 చిరంజీవులు తెలుగు నటుడు/రత్నం
ఏది నిజం తెలుగు నటుడు/అతిథి
1957 సువర్ణ సుందరి తెలుగు వసంతుడు పాత్రధారి
భాగ్యరేఖ తెలుగు నటుడు
పాండురంగ మహత్యం తెలుగు నటుడు
వీర కంకణం తెలుగు నటుడు
1958 పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు తేజం పాత్రధారి
1959 ఇల్లరికం తెలుగు నటుడు
జయభేరి తెలుగు నటుడు
1960 శ్రీ వెంకటేశ్వర మహత్యం తెలుగు నటుడు
1962 గులేబకావళి కథ తెలుగు నటుడు
1961 ఉషా పరిణయం తెలుగు నటుడు
1962 గాలిమేడలు తెలుగు అతిథి నటుడు
1964 బభ్రువాహన తెలుగు నటుడు
మురళీకృష్ణ తెలుగు నటుడు
వెలుగు నీడలు తెలుగు నటుడు
1967 చక్ర తీర్థ కన్నడం దర్శకుడు
1968 చుట్టరికాలు తెలుగు దర్శకత్వం
1969 పునర్జన్మ కన్నడం దర్శకుడు
భలే అబ్బాయిలు తెలుగు దర్శకత్వం
1971 కులగౌరవ కన్నడం దర్శకుడు
Bala Bandhana కన్నడం దర్శకుడు
1974 అల్లూరి సీతారామరాజు తెలుగు నటుడు- బ్రేకన్
1975 Dari Tappida Maga కన్నడం దర్శకుడు
1976 Sutrada Bombe కన్నడం దర్శకుడు
1978 Maathu Thappadha Maga కన్నడం దర్శకుడు

మూలాలు

[మార్చు]
  1. రావి కొండలరావు. "తెలుగు సినిమా విజ్ఞానకోశం ... పేకేటి శివరాం". సితార. USHODAYA ENTERPRISES PVT LTD. Archived from the original on 11 June 2020. Retrieved 31 July 2020.
  2. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (9 March 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 25 March 2019. Retrieved 25 March 2019.

బయటి లింకులు

[మార్చు]