పండంటి కాపురం
| పండంటి కాపురం | |
|---|---|
| దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
| నిర్మాత | జి. హనుమంతరావు |
| తారాగణం | |
| సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నిర్మాణ సంస్థ | జయప్రద పిక్చర్స్ |
| భాష | తెలుగు |
పండంటి కాపురం లక్ష్మీదీపక్ దర్శకత్వంలో 1972 జూలై 21 న విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, దేవిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎస్ పి కోదండపాణి సంగీతం సమకూర్చాడు. ఇదే చిత్రాన్ని 1975 లో హిందీ లో ఆదుర్తి సుబ్బారావు సునెహ్ర సంసార్ పేరుతోనూ, తమిళంలో అన్బు సగోదరగళ్ అనే పేరుతోనూ పునర్మించారు.
ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారం అందుకుంది.[3] తర్వాతి కాలంలో ప్రముఖ కథానాయికగా ఎదిగిన జయసుధ ఈ చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె అసలు పేరైన సుజాత అనే పేరు వాడారు.[4]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ_ రవి
- జూలూరి జమున_ రాణి మాలినీదేవి/ సవిత
- బి.సరోజాదేవి_ శోభ
- విజయనిర్మల_ సుశీల" సుశీ"
- సామర్ల వెంకట రంగారావు _ నారాయణరావు
- గుమ్మడి వెంకటేశ్వరరావు_ శ్రీనివాసరావు" వాసు"
- మందాడి ప్రభాకరరెడ్డి_ మధు
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి_ కోటేశ్వరరావు
- అల్లు రామలింగయ్య_ చెంగయ్య
- రాజబాబు_ సంజీవి
- సాక్షి రంగారావు_ రుద్రయ్య
- రామ్ మోహన్_ మోహన్
- దేవిక_ లక్ష్మీ
- పండరీబాయ్_ చిన్నమ్మ
- రాధాకుమారి_ జగదాంబ
- జయసుధ_ శాంతి
- సంధ్యారాణి_ ఆశా
- మాస్టర్ నరేష్ కుమార్_ రాము
- బేబీ డాలీ_ బాబు
- బాలకృష్ణ_ బోటని లెక్చరర్
- పొట్టి ప్రసాద్_ బోటని లెక్చరర్ కొడుకు
సాంకేతిక వర్గం
[మార్చు]స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మీదీపక్
సంగీతం: ఎస్ పి కోదండపాణి
కధ: మందాడి ప్రభాకర రెడ్డి
మాటలు: మద్దిపట్ల సూరి
గీత రచయితలు:మైలవరపు గోపి , దాశరథి కృష్ణమాచార్య
నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి కోదండపాణి
ఛాయా గ్రహణం: వి ఎస్.ఆర్ స్వామి
నిర్మాత: జి.హనుమంతరావు
నిర్మాణ సంస్థ: జయప్రద పిక్చర్స్
ఎడిటింగ్: గోపాలరావు
పంపిణీ దారులు: పూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల:21:07:1972.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎస్. పి. కోదండపాణి సంగీతం అందించాడు. మైలవరపు గోపి, దాశరథి పాటలు రాశారు. ఘంటసాల, పి. సుశీల, ఎస్. పి. కోదండపాణి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు.
- ఆడే పాడే కాలంలోనే అనుభవించాలి తేనెలూరు - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: మైలవరపు గోపి
- ఇదిగో దేవుడు చేసిన బొమ్మా ఇది నిలిచేదేమో - ఎస్.పి. కోదండపాణి, పి.సుశీల - రచన: మైలవరపు గోపి
- ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు - సుశీల, ఎస్.పి. బాలు - రచన: మైలవరపు గోపి
- ఏవమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో - ఎస్.పి. బాలు, సుశీల - రచన: దాశరథి
- బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం (సంతోషం) - ఘంటసాల బృందం , రచన: దాశరథి.
- బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని (విషాదం) - ఘంటసాల, రచన: దాశరథి.
- మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కినా నావలా - పి.సుశీల, రచన: మైలవరపు గోపి
- సర్వసిద్ధి ప్రదేదేవి పరంజ్యోతి స్వరూపిణి(శ్లోకం)- ఘంటసాల వెంకటేశ్వరరావు.
మూలాలు
[మార్చు]- ↑ మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
- ↑ "20th National Film Awards". International Film Festival of India. Archived from the original on 5 November 2013. Retrieved 26 September 2011.
- ↑ "My first break - Jayasudha". The Hindu. 27 November 2010. Archived from the original on 30 June 2019. Retrieved 1 November 2020.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)